- Home
- Entertainment
- Mrunal and Dhanush: మృణాల్ ప్రేమలో హీరో ధనుష్? వైరల్ అవుతున్న ఫోటోలు, వారి మధ్య వయసు తేడా ఎంత?
Mrunal and Dhanush: మృణాల్ ప్రేమలో హీరో ధనుష్? వైరల్ అవుతున్న ఫోటోలు, వారి మధ్య వయసు తేడా ఎంత?
ధనుష్ తన భార్య ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఐశ్వర్యతో విడాకుల తర్వాత
కుబేర సినిమాతో తన ఖాతాలో మరొక విజయాన్ని వేసుకున్నాడు ధనుష్. రజనీకాంత్ అల్లుడైన ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ధనుష్ మళ్లీ ప్రేమలో పడ్డాడని, అది కూడా ఒక యంగ్ హీరోయిన్ తో చనువుగా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి.
మీనాతోనూ వార్తలు
గతంలో సీనియర్ హీరోయిన్ మీనా తో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. కానీ అవేవీ నిర్ధారణ కాలేదు. ఇప్పుడు మృణాల్ తో ధనుష్ కొత్తగా ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ధనుష్ వయసు 42 కాగా, మృణాల్ వయసు 33. ఇద్దరి మధ్య 9 ఏళ్ల తేడా ఉంది.
మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలు
ఆగస్టు ఒకటిన మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలు ముంబైలో జరిగాయి. ఈ వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. ఆ పార్టీలో వీరు చాలా చనువుగా మాట్లాడుకుంటూ కనిపించారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని భావించడం మొదలుపెట్టారు నెటిజన్లు.
మృణాల్ గుసగుసలు
అలాగే ఈ బర్త్ డే పార్టీకి కొన్ని గంటల ముందే అజయ్ దేవగన్, మృణాల్ కలిసి నటించిన సన్నాఫ్ సర్దార్ 2 ప్రత్యేక ప్రదర్శనకు కూడా ధనుష్ హాజరయ్యాడు. ఆ తర్వాత మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ కనిపించాడు. ధనుష్ తో మృణాల్ ఏదో గుసగుసలాడుతున్నట్టు వీడియోలో ఉంది. దీంతో అభిమానుల్లో ఉత్సుకత పెరిగిపోయింది. ధనుష్.. మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారా అంటూ పుకార్లు మొదలైపోయాయి.
నిజం చెప్పాలంటే మృణాల్ ఠాకూర్, ధనుష్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 3న ధనుష్ సినిమా తేరే ఇష్క్ మే కోసం ఆ సినిమా రచయిత, నిర్మాత అయిన కనిక థిల్లాన్ నిర్వహించిన పార్టీలో కూడా మృణాల్ కనిపించింది. కనికా షేర్ చేసిన చిత్రాలలో మృణాల్, ధనుష్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
Dhanush and Aishwarya
ధనుష్, మృణాల్ ఠాకూర్ ఇంతవరకు కలిసి నటించలేదు... కానీ కేవలం కొన్ని వీడియోలు, ఫోటోల ద్వారానే వారి అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ కొత్త సినిమా సన్నాఫ్ సర్దార్ 2 ఆగస్టు 1న థియేటర్లలోకి వచ్చింది. ఇక ధనుష్ కుబేర తరువాత తేరే ఇష్క్ మే సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.
ధనుష్ రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు వీరికి వివాహం కొనసాగింది. 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ తొలిసారి 2003లో కలుసుకున్నారు. ఆ కలయిక ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. వీరిద్దరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారి పేర్లు యాత్రా, లింగా.