కత్రినా కైఫ్ ధరించిన స్వెటర్ ధర అంత ఉంటుందా? స్పెషాలిటీ ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా తను పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో కత్రినా ధరించిన స్వెటర్ ప్రైజ్ చూస్తూ మతిపోతోంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. చివరిగా ‘సూర్యవంశీ’ చిత్రంలో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మూడు చిత్రాలో నటిస్తూ బిజీగా ఉంది.
అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కత్రినా తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ భామా వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విషయాలను కూడా అభిమాలనుతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ కత్రినా కైఫ్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
లేటెస్ట్ గా కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఫొటో ఇది. ఈ పిక్ లో కత్రినా అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే స్వెటర్ లో, డెనిమ్ జీన్స్ లో ఆకర్షిస్తోంది. మత్తెక్కించే హావాభావాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్ ను ప్రస్తుతం తెగ వైరల్ చేస్తున్నారు.
కాగా, అట్రాక్టివ్ లుక్ కోసం స్టార్స్ తరుచుగా కాస్లీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఉంటారు. న్యూ ష్యాషన్ ను పరిచయం చేస్తుంటారు. ఈక్రమంలో కత్రినా ధరించిన ఈ స్వెటర్ ధర తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఒక్క స్వెటర్ కే 445 డాలర్లుగా తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 35,000 రూపాయలు అన్నమాట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు స్వెటర్ కోసం అంత ఖర్చు చేసిందా అంటూ షాక్ అవుతున్నారు. అమ్మడు పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.
100 శాతం పాలిస్టర్ తో తయారైంది. అలాగే మల్టీ కలర్ స్వెటర్ కావడం, డిఫరెంట్ అల్లిక కావడం ఈ స్వెటర్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇక కత్రినా కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ట్రెడిషనల్ అయినా, ట్రెండీ వేర్ అయినా తన సెలెక్షన్స్ చాలా బాగుంటాయని అభిమానులు అంటున్నారు.
గతేడాది విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కత్రినా సినిమాల ఆసక్తితో నటిస్తూనే ఉంది. అటు విక్కీ కూడా తన కేరీర్ ను కొనసాగిస్తున్నారు. కత్రినా ప్రస్తుతం ‘ఫోన్ బూత్’,‘మేరీ క్రిస్టమస్’, ‘టైగర్ 3’లో నటిస్తోంది. టైగర్ 3లో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంతో వచ్చే ఏడాది రిలీజ్ ఏప్రిల్ 21న విడుదల కానుంది.