MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బ్లాక్ మనీని వైట్ చేయటానికే ‘హరి హర వీరమల్లు’?పవన్ పై దిల్ రాజు కంప్లైంట్? బన్నీ గురించి కూడా...

బ్లాక్ మనీని వైట్ చేయటానికే ‘హరి హర వీరమల్లు’?పవన్ పై దిల్ రాజు కంప్లైంట్? బన్నీ గురించి కూడా...

  చంద్రబాబు నుంచి ప్యాకేజీ రూపంలో అందిన బ్లాక్‌మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్‌మనీగా మార్చుతున్నారంటూ ...

5 Min read
Author : Surya Prakash
Published : Apr 21 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా నిర్మితమవుతున్న పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా గత నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటోంది. రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ వస్తోంది. ఆ మద్యన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే  సినిమా కు సంబంధించి పోస్టర్ శ్రీరామ నవమి పూట రిలీజ్ చేసి సినిమాపై బోలెడన్ని అంచనాలను పెంచారు చిత్ర యూనిట్. అయితే అదే సమయంలో ఈ చిత్రం బ్లాక్ మనీని వైట్ చేసుకోవటానికే తీస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. అసలు ఆ ప్రచారం వెనక వాస్తవం ఎంత..ఎందుకు ఈ చిత్రం లేటు అవుతూ వస్తోంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213


ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూండటంతో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నకలపైనే కేంద్రీకరించారు. దాదాపు షూటింగ్ లు అన్ని ఆపేసారు. పూర్తి రాజకీయాలమీదే దృష్టి  పెట్టారు. అయితే అదే సమయంలో రాజకీయ  ప్రత్యర్ధులు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు.  చంద్రబాబు నుంచి ప్యాకేజీ రూపంలో అందిన బ్లాక్‌మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్‌మనీగా మార్చుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పోతిన మహేష్. 

313


పోతిన మహేష్  మీడియాతో మాట్లాడుతూ...పవన్‌ తన బ్లాక్‌ మనీ మొత్తం హరిహర వీరమల్లు సినిమాకు పెడుతున్నారని అన్నారు. ఆ సినిమా అసలు నిర్మాత పవనే అని, వేరే పేరుతో తీస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అలాగే పవన్‌పై నిర్మాత దిల్‌రాజు ఆదాయ పన్నుల శాఖకు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా చెప్పాలన్నారు. 

413


పవన్  కుటుంబంలో ఒకడైనప్పటికీ, అల్లు అర్జున్‌ గురించి ఎప్పుడైనా నాలుగు మంచి మాటలు చెప్పారా అని ప్రశ్నించారు. మాట్లాడితే బ్రాండ్‌ అనే పవన్‌ నిజమైన బ్రాండ్‌ అల్లు అర్జున్‌ అని గుర్తించాలన్నారు. సినిమా పరిశ్రమకు ఏం చేశారో కూడా పవన్‌ చెప్పాలన్నారు. పవన్‌ ఫ్యామిలీది బ్రాండ్ కాదు మోసం, దగా అంటూ నిప్పులు చెరిగారు. తను లేవనెత్తిన అంశాలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమంటూ జనసేన నేతలకు సవాల్ విసిరారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. అయితే పవన్ అభిమానులు ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు గా కొట్టిపారేస్తున్నారు. 

అలాగే ప్రత్యేకంగా బన్ని ప్రస్తావన  తేవటం వెనక రాజకీయ ఉద్దేశ్యాలు తప్పించి మరొకటి కాదంటున్నారు. బన్ని అభిమానులను జనసేన నుంచి వేరు చేయాలని ఈ కామెంట్స్ చేసారని సోషల్ మీడియా జనం అంటున్నారు.

513
Pawan Kalyan Chiranjeevi

Pawan Kalyan Chiranjeevi


గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన  బ్రో సినిమాకు బ్లాక్ మనీ ఉపయోగించారని అన్నారు. అలాగే , పవన్ కల్యాణ్ కు రెమ్యునరేషన్ రూపంలో టీడీపీ ముడుపులు అందినట్లుగా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. దీనిపై తాజాగా బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. 
 

613


"మేం ప్రొడక్షన్ లోకి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఇది (బ్రో) 25వ సినిమా. మేము విడుదల చేసిన వాటిలో ఇది భారీ చిత్రం. దీనికి నెట్ ఫ్లిక్స్ తో పాటు జీ టీవీతో ఎక్స్ ట్రార్డినరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పవన్ కల్యాణ్ రేంజ్ కి తగినట్లుగా అన్ని ఏరియాకు సేల్ చేయగలిగాం. ఆయన (అంబటి రాంబాబు) నోటికొచ్చినట్లు మాట అనడమే కానీ, దీనికి దానికి పొంతనే లేదు" అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 

713


"మేము ఏదైతే బయట నుంచి డబ్బు తెస్తామో ప్రాపర్ ఆర్బీఐకి రిపోర్ట్ చేసే తీసుకొస్తాం. లోకల్ గా జెనరేట్ అయినా రెవిన్యూ లోకల్ గా వస్తుంది. ఏజెన్సీ వస్తే మీరు నేను కాదు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకరికి అవసరం లేని ఆన్సర్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఈ సినిమాకు ఎంత అయిందేనిది మాకు, జీటీవికి క్లియర్ గా తెలుసు. మా ఇద్దరికి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు" అని బ్రో నిర్మాత పేర్కొన్నారు.

813
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu


"మా కంపెనికీ, కల్యాణ్ గారికి ఉన్న అగ్రిమెంట్ అడిగే హక్కు ప్రపంచంలో ఎవడికి లేదు. ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు ఆయన చేసుకుంటారు. మా లెక్కలు మేము చూపిస్తాం. మాకు వచ్చిన అమౌంట్ కు జీఎస్టీ రిపోర్ట్ చేస్తాం. దీనికి మించి ఎవరికి కూడా అడిగే అధికారం లేదు. నాకు చెప్పే అవసరం లేదు. పుకార్లు అనేవి ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా వస్తాయి" అని టీజీ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.
 

913
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu


 
"మేము, జీ టీవి కలిసి నిర్మించిన సినిమా ఇది. పవన్ కల్యాణ్ రేంజ్ కు తగినట్లుగా పారితోషికం ఇచ్చాం. అది ఎంత ఇచ్చాం, బయటకు చెప్పడం చెప్పకపోవడం అనేది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. మా బిజినెస్ ఎంత అయిందనేది కొన్ని ఫోరమ్స్ లో ఉంటుంది. అక్కడ అన్ని లెక్కలు ఉంటాయి. మేం ఎంత ఖర్చు పెట్టాం అన్నది మా ఇంటర్నల్ విషయం. అది ఎప్పటికీ బయటకు చెప్పం" అని విశ్వ ప్రసాద్ అన్నారు. 

1013


ఇక హర వీరమల్లు విషయానికి వస్తే..  రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూ లో,చిత్ర నిర్మాత, AM రత్నం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. హరి హర వీర మల్లు రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. సినిమా ఆగిపోయినట్లు,క్యాన్సిల్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ని  తోసిపుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి VFX పనూలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది.   బాడీని ఫిట్ గా ఉంచేందుకు పవన్ ప్రత్యేక ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హరిహర వీరమల్లులోని యుద్ధ విన్యాసాల కోసం ఫ్లైక్సిబుల్ బాడీ కోసం శ్రమిస్తున్నాడు పవన్. ఈ మేరకు హరిహర వీరమల్లు కోసం చేస్తున్న పవర్ ఫుల్ రిహార్సల్స్ కు సంబంధించిన ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. 

1113


అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఖచ్చితంగా సినిమా ఉందని, ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లు అవుతుందని నిర్మాత,టీమ్ చెప్తున్నారు.

`వకీల్‌సాబ్‌`, `భీమ్లా నాయక్‌` సినిమాలు రీమేక్‌లు. దీంతో అవి ఫర్వాలేదనిపించుకున్నాయి. కానీ స్ట్రెయిట్‌గా హిట్‌ రాక చాలా రోజులవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. హిస్టారికల్‌ నేపథ్యంలో రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రంపై అనేక రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీని ఫలితాన్ని ఊహించడం కష్టమే. విడుదలై సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకునేంత వరకు ఈ సినిమా రిజల్ట్ ని ఊహించడం కష్టం. 

1213

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఒక రాబిన్ హుడ్ తరహా దొంగ కథను చెబుతుంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ.
 

 

1313

పవన్ కళ్యాణ్ బాడీ ట్రాన్స్ ఫామ్ షాకింగ్ గా ఉంది. హరిహార వీరమల్లు కోసం పవర్ స్టార్ తన బాడీని ఫిట్ గా మార్చేశాడు. తాజా లుక్ లో వపన్ చూస్తే  దిమ్మతిరిపోవాల్సిందే. పవన్ లేటెస్ట్ మేక్ ఓవర్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 మొఘ‌ల్ కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన ఓ బందిపోటు దొంగ పాత్ర‌నే ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్నారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ క‌నిపించ‌బోతున్నారు. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ పంచ‌మి అనే పాత్ర‌లో న‌టిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘ‌ల్ రాకుమారి పాత్ర‌లో క‌నిపించ‌నుందని టాక్‌.   

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అనుష్క శెట్టి
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved