MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ

Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ

Irumudi Day 2 Collections: మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తరువాత ఓ భారీ సక్సెస్ తో జోష్ మీద ఉన్నాడు. ఇరుముడి సినిమా ఫస్ట్ డే కంటే కూడా రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 23 2026, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇరుముడి రెండో రోజు కలెక్షన్లు..
Image Credit : Asianet News

ఇరుముడి రెండో రోజు కలెక్షన్లు..

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'ఇరుముడి' థియేటర్లలో తన సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్‌గా రూ. 15.30 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం, రెండో రోజు (శనివారం) మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సక్సెస్ ఫుల్ బిజినెస్ ట్రాకర్ 'శాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం.. 'ఇరుముడి' సినిమా రెండో రోజు ఇండియాలో సుమారు రూ. 16.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

దేశవ్యాప్తంగా మొత్తం 2,943 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం, మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు ఏకంగా 5.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. శుక్రవారం నాడు ఈ చిత్రం మొత్తం 76.9 శాతం ఆక్యుపెన్సీని సాధించగా, శనివారం నాటికి 75.8 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి కలెక్షన్లు..?
Image Credit : X/@MythriOfficial

ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి కలెక్షన్లు..?

తాజాగా నమోదైన రెండు రోజుల బాక్సాఫీస్ సంఖ్యలతో 'ఇరుముడి' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 31.40 కోట్లకు చేరాయి. దేశీయంగా ఈ సినిమా మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్ ప్రస్తుతం రూ. 36.45 కోట్లుగా ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సుమారు రూ. 5 కోట్లు వసూలు చేయడంతో, ఇప్పటివరకు మూవీ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ రూ. 11 కోట్లకు చేరింది. డొమెస్టిక్, ఓవర్సీస్ కలెక్షన్లను రెండింటినీ కలిపి చూస్తే, 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 47.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Related Articles

Related image1
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Related image2
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
34
తెలుగు వెర్షన్‌లోనే ఇరుముడి మూవీకి అత్యధిక వసూళ్లు
Image Credit : Youtube Screenshot@MythriMovieMakers

తెలుగు వెర్షన్‌లోనే ఇరుముడి మూవీకి అత్యధిక వసూళ్లు

రెండో రోజు ఇరుముడి బాక్సాఫీస్ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ అత్యధిక వాటాను అందించింది. శనివారం తెలుగు వెర్షన్‌లో మొత్తం ఆక్యుపెన్సీ 78.54 శాతంగా నమోదైంది. మార్నింగ్ షోలలో 63 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలకు వచ్చేసరికి 80 శాతానికి పెరిగింది. ఈవెనింగ్ షోలలో 82.85 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, నైట్ షోలలో అత్యధికంగా 88.31 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. తమిళ వెర్షన్‌లో ఈ చిత్రం 15 శాతం మొత్తంగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలదే అగ్రస్థానం

రెండో రోజు 'ఇరుముడి' చిత్రం భారతదేశంలో మొత్తం రూ. 18.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యధిక సహకారాన్ని అందిస్తూ రూ. 15.75 కోట్లను రాబట్టాయి. ఇతర రాష్ట్రాల వివరాలు పరిశీలిస్తే, కర్ణాటక నుండి రూ. 2 కోట్ల గ్రాస్, తమిళనాడు నుండి రూ. 43 లక్షలు, కేరళ నుండి రూ. 2 లక్షలు రాగా, మిగిలిన భారతీయ ప్రాంతాల నుండి రూ. 50 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి.

44
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో..
Image Credit : Asianet News

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో..

ఎప్పుడూ మాస్ సినిమాలతో దుమ్మురేపే రవితేజ.. ఈసారి కాస్త ఎక్కువ సెంటిమెంట్ ఉన్న కథతో ముందుకెళ్లాడు. 'ఇరుముడి' సినిమా ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, వారి పెంపకంలో ఇద్దరు తండ్రులు అనుసరించే వేర్వేరు విధానాల నేపథ్యంతో తెరకెక్కింది. ఇందులో రవితేజ 'త్రినాథ్' అనే అయ్యప్ప భక్తుడి పాత్రలో నటించగా, ఆయన కుమార్తె 'మణికంఠ' పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. సాయి కుమార్ 'గోపాల్ రాజు' అనే పాత్రలో కనిపించి, తన కుమార్తె గాయత్రిని వేరే ఆలోచనా విధానంతో పెంచే తండ్రిగా అలరించారు. ఈసినిమా టాక్ బాగుంది అని తెలియడంతో.. థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్యామిలీ ఆడియన్స్ సంఖ్యం భారీగా పెరిగినట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Recommended image2
Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Recommended image2
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved