- Home
- Entertainment
- బికినీలోనే బర్త్ డే చేసుకున్న అమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్.. ఇంట్లో దుస్తులేసుకోరా అంటూ దారుణంగా ట్రోల్స్
బికినీలోనే బర్త్ డే చేసుకున్న అమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్.. ఇంట్లో దుస్తులేసుకోరా అంటూ దారుణంగా ట్రోల్స్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్, హెల్త్ విషయంలో చర్చనీయాంశంగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు బికినీలో బర్త్ డే చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది.

ఐరాఖాన్ తాజాగా 25వ పుట్టిన రోజుని జరుపుకుంది. అయితే రెగ్యూలర్‌లా కాకుండా ఈ సారి కొత్తగా ప్లాన్ చేసింది. బట్టల్లేకుండా కేవలం బికినీలోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఆమెనే కాదు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఇలా అర్థనగ్నంగానే ఉన్నారు. చివరికి అమీర్ ఖాన్ కూడా జస్ట్ షాట్ ధరించి ఉన్నారంటే వీరు ఎంత వెరైటీగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్, రీనా దత్తా, కిరణ్ రావు, ప్రియుడు నుపూర్ శిఖారేలు కూడా ఉన్నారు.
బికినీలో ఉన్న ఐరా ఖాన్, బట్టల్లేకుండా కేవలం షాట్‌లో ఉన్న అమీర్‌ఖాన్ కలిసి అందరు అర్థనగ్నంగా ఉన్న లుక్‌లో ఆమె కేక్ కట్ చేయడం విశేషం. తాజాగా ఈ పిక్స్ ని ఐరా ఖాన్ అభిమానులతో పంచుకుంది. దాదాపు తొమ్మిది ఫోటోలు, ఓ చిన్న వీడియోని షేర్ చేసుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన ప్రియుడు నుపూర్, ఇతర ఫ్రెండ్స్ తోనూ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తుంది ఐరాఖాన్. బర్త్ డే సెలబ్రేషన్‌లో మొత్తంగా ఆమె ఇలా అర్థనగ్నంగానే ఉండటం విశేషం. అర్థనగ్నంగానే పార్టీ చేసుకున్నారు. ఇదంతా తండ్రి అమీర్, తల్లి సమక్షంలో జరగడం నెటిజన్లని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ రేంజ్‌లో బర్త్ డే చేసుకోవడం పట్ల సర్వత్రావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రోలర్స్ మాత్రం తమ కామెంట్లకి పని చెప్పారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంట్లో బట్టలేసుకోరా ఏంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమీర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కూతురు ఇంతగా తెగిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
`ఐరా ఖాన్ బర్త్ డే రోజు కొత్త బట్టలు కొనుక్కోలా ఏంటీ? అలా బికినీలో కేక్ కట్ చేసింది`, `వీళ్లు ఇంట్లో బట్టలేసుకునే అలవాటు లేదా ఏంటీ?`, `ఎటు చూసినా నగ్నత్వమే కనిపిస్తుందిగా`, `తండ్రి ముందే బికినీలో.. వాహ్` అంటూ తమదైన స్టయిల్‌లో కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఐరా ఖాన్ బర్త్ డే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.దుమారం రేపుతున్నాయి.
అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ స్టడీస్ కంప్లీట్ చేసి థియేటర్ రంగంలో రాణిస్తుంది. నాటకాల్లో డైరెక్షన్ చేస్తుంది. మున్ముందు సినిమాల్లోకి రాబోతుందనే ఊహగానాలు ఊపందుకున్నాయి. మరి హీరోయిన్‌గా చేస్తుందా? లేక డైరెక్షన్ సైడ్ వెళ్తుందా? అది కాక థియేటర్ రంగంలోనే రాణిస్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది.
మరోవైపు ఐరాఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారేతో ప్రేమలో మునిగితేలుతుంది. రెండుమూడేళ్లుగా వీరిద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారు. నుపూర్ అమీర్ ఖాన్‌కి కూడా ఫిట్‌నెస్ ట్రైనర్ కావడం విశేషం. తండ్రికి ఫిట్‌నెస్ నేర్పిస్తూ కూతురిని బుట్టలో వేసుకున్నాడని చెప్పొచ్చు. లేదంటే ఆయన ఫిట్‌నెస్‌ని చూసి అమీర్ కూతురు ఫిదా అయిపోయింటుంది. మొత్తంగా ఇద్దరు ఓపెన్‌గానే ప్రేమించుకుంటున్నారు. తండ్రి ముందే ప్రేమ కలాపాలు నడిపిస్తుండటం విశేషం. తరచూ వీరిద్దరు తమ ప్రేమని నిదర్శనంగా నిలిచే ఫోటోలను పంచుకుంటున్నారు.
ఐరా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, కెరీర్‌కి సంబంధించిన అంశాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంది. దీంతోపాటు హాట్ ఫోటో షూట్ పిక్స్ ని సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
మరోవైపు ఐరా ఖాన్ ఇటీవల తాను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. యాంగ్జైటీ(ఏడిచే రోగం)తో బాధపడుతుందట. నా మీద యాంగ్జైటీ దాడి చేస్తోంది. గతంలో ఎప్పుడూ నాకు యాంగ్జైటీ లేదు.. కానీ, ఇప్పుడు పట్టుకుంది. దాని వల్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నా. క్రయింగ్ ఫిట్స్ పట్టి చంపేస్తోంది అంటూ బాధను వెల్లబుచ్చింది.
అంతే కాదు భయానికి, భయం దాడికి మధ్య తేడా ఉన్నట్టే యాంగ్జైటీకి యాంగ్జైటీ ఎటాక్ కు మధ్య కూడా చిన్న తేడా ఉంది. యాంగ్జైటీ ఎటాక్స్ తో బయటకు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. హార్ట్ బీట్ సరిగ్గా ఉ ండదు. ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్స్ లక్షణాలు. అవి చాలా నెమ్మదినెమ్మదిగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అని వివరంగా చెప్పింది.