- Home
- Entertainment
- ‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునైనా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. బ్లూ శారీలో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..
‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునైనా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. బ్లూ శారీలో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..
‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునైనా (Deepthi Sunaina) లేటెస్ట్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ షోతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఈ యంగ్ బ్యూటీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

దీప్తి ఇండిస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలనే లక్ష్యంతో డబ్ స్మాష్ వీడియోస్ చేయడం ప్రారంభించింది. వాటితోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునైనా.. ఆ తర్వాత య్యూటూబర్ గా మరింత పాపులర్ అయ్యింది. మరోవైపు డాన్స్ వీడియోస్ తోనూ తన సత్తా చాటిందీ బ్యూటీ.
ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్2 (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ అన్ని సీజన్లలో దీప్తినే అతి తక్కువ వయసు గల కంటెస్టెంట్ కావడం విశేషం. ఈ షో ద్వారా దీప్తి సునైనాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందనే చెప్పాలి. తనకు మద్దతు తెలుపుతూ చాలా మంది ఓట్ వేశారు. కానీ ట్రోఫీ దక్కించుకోలేక పోయింది. అయినా హౌజ్ నుంచి బయటికి వచ్చాకా తన క్రేజ్ ఏమీ తగ్గలేదు.
అలాగే దీప్తి చేస్తే డబ్ స్మాష్ వీడియోస్, అలాగే యూట్యూబ్ వీడియోను స్టార్ హీరోయిన్ సమంత చూస్తుందని టాక్. అదేవిధంగా దీప్తికి ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడం అంటే ఇస్టం. తన కుడి చేతి మణికట్టుపై ‘డ్రీమ్’ అనే టాటూ ఉంటుంది. రామ్ చరణ్ కు దీప్తి వీరాభిమాాని. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ఐదేండ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది జనవరిలో బ్రేక్ అప్ చెప్పింది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ క్రేజ్ సంపాదిస్తోంది. ఇందుకోసం లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. అటు ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూనే.. ఇటు చీరకట్టి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు దగ్గరగానే ఉంటుందీ బ్యూటీ. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. ఆ పిక్స్ ను దీప్తి ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోల్లో రాత్రి పూట వెలుగునిస్తున్న చందమామాను పోలి ఉంది.
దీప్తి బ్లూ శారీలో అందాల విందుచేస్తోంది. నడుము కనిపించేలా పైట కొంగును పక్కకు జరుపుతూ హోయలు పోయింది. మతిపోయేలా ఫోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు ఆకర్షిస్తోంది. ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ ‘మీ హృదయానికి అర్హమైన ప్రతిదీ త్వరలో మీకు అందుతుంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేరీర్ విషయానికొస్తే.. ఇప్పుడిప్పుడే సినిమాలవైపు అడుగులేస్తోంది. 2018లో హీరో నిఖిల్ నటించిన ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం యూట్యూబ్ లోనే మ్యూజిక్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని కొనసాగిస్తోంది. ఇటీవల ‘ఏమై ఉండచ్చో’ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.