MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్, హను రాఘవపూడి మూవీ క్లైమాక్స్ పై ఫ్యాన్స్ లో ఆందోళన.. అది శాడ్ ఎండింగ్ కాదు అంటూ..

ప్రభాస్, హను రాఘవపూడి మూవీ క్లైమాక్స్ పై ఫ్యాన్స్ లో ఆందోళన.. అది శాడ్ ఎండింగ్ కాదు అంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించేశారు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ భారీ బడ్జెట్  చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 19 2024, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించేశారు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ భారీ బడ్జెట్  చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ చిత్రం 1940 బ్రిటిష్ నేపథ్యంలో ఉండబోతోంది అని చిత్ర యూనిట్ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ ఈ మూవీలో సైనికుడిగా కనిపిస్తారు. అందుకే ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి చిత్రాల్లో కాస్త ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. 

35

ప్రభాస్ చిత్రం స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో మరింత ఎమోషనల్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది.. హ్యాపీ ఎండింగ్ ఉంటుందా లేక శాడ్ ఎండింగ్ లో హను ట్విస్ట్ ఇస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఎందుకంటే హను రాఘవపూడి గత చిత్రం సీతారామంలో కూడా హీరో సైనికుడే. కానీ చివర్లో హీరో చనిపోతాడు. ఎమోషనల్ సీన్స్ తో హను కన్నీళ్లు పెట్టించారు. 

45

ప్రభాస్ లాంటి మాస్ హీరోని పెట్టుకుని అలా శాడ్ ఎండింగ్ ఇస్తే ప్రమాదం. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే హను రాఘవపూడి మాత్రం సీతారామం చిత్రం శాడ్ ఎండింగ్ అంటే ఒప్పుకోవడం లేదు. హీరోని బతికించాలని తన టీమ్ ఎంత చెప్పినా హను వినలేదట. 

55
Sitaramam Review

Sitaramam Review

ఎందుకంటే రామ్ అనే వ్యక్తి ఒక అద్భుతం. అలాంటి వ్యక్తిని పాకిస్తాన్ నుంచి తిరిగి తీసుకువస్తే అందరిలాగే సాధారణ వ్యక్తి అవుతాడు. హీరో చనిపోయినప్పటికీ సీతారామం చిత్రం శాడ్ ఎండింగ్ కాదు. ఎందుకంటే కథ ముగిసేది రామ్ రాసిన లెటర్ సీతకి అందుతుందా లేదా అనే అంశంతోనే.. సీతకి లెటర్ అందింది కాబట్టి ఆ చిత్రం హ్యాపీ ఎండింగే అంటూ హను వివరణ ఇచ్చారు. మరి ప్రభాస్ చిత్ర క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved