MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?

Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో రామాయణానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఎపిసోడ్ ఉండబోతోంది. శ్రీరాముడు, కుంభకర్ణుడికి మధ్య జరిగిన యుద్దని జక్కన్న చూపించబోతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 15 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kumbhakarna
Image Credit : Asianet News

Kumbhakarna

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారాణసి చిత్రం వరల్డ్ వైడ్ గా సినీ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుపు తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే జక్కన్న ఈసారి కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో మూవీ తెరకెక్కిస్తున్నారు. వారాణసి చిత్రం టైం ట్రావెల్ అంశంతో, ప్రపంచం మొత్తం తిరిగే సాహస వీరుడి కథగా ఉండబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధం
Image Credit : SS Rajamouli/ Instagram, T-Series/ Youtube

రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధం

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వీరుడిగా, అదే విధంగా శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. రామాయణంలోని అత్యంత భీకర యుద్ధం అయిన కుంభకర్ణుడి ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతోంది. దాదాపు 25 నిమిషాల నిడివితో రాముడు, కుంభకర్ణుడి యుద్ధం ఉండబోతోంది అని జక్కన్న ఇప్పటికే ప్రకటించారు. దీనితో ఆ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు రామాయణంలో రాముడు, కుంభకర్ణుడిని ఎందుకు చంపారు ? అతడు మంచివాడా చెడ్డవాడా ? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.

35
దిక్కుతోచని స్థితిలో రావణుడు
Image Credit : SS Rajamouli/ Facebook

దిక్కుతోచని స్థితిలో రావణుడు

రాముడితో రావణుడి తరపున వాళ్ళు ఎన్ని సార్లు పోరాడినా వాళ్లకు పరాజయమే ఎదురుతూ ఉంటుంది. రావణుడి కుమారుడు అతికాయుడిని లక్ష్మణుడు ఘోరంగా చంపేస్తారు. దీనితో రావణుడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తన సోదరుడు కుంభకర్ణుడిని యుద్ధంలోకి దించాలి అని రావణుడు భావిస్తాడు. అప్పటికే కుంభ కర్ణుడు కొన్ని నెలలుగా గాఢ నిద్రలో ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడిని బలవంతంగా నిద్ర లేపి జరిగిన విషయం చెబుతాడు.

45
కుంభకర్ణుడు ఎంత మంచివాడో తెలుసా ?
Image Credit : urstrulymahesh/Instagram

కుంభకర్ణుడు ఎంత మంచివాడో తెలుసా ?

కుంభకర్ణుడు స్వతహాగా చాలా మంచివాడు. సీతని అపహరించి తీసుకురావడం నీవు చేసిన పెద్ద తప్పు. అలా చేసి ఉండాల్సింది కాదు అని హితవు పలుకుతాడు. కుంభకర్ణుడి మంచి గుణానికి ఇదే నిదర్శనం. కానీ యుద్ధం ఇంటి గుమ్మం వరకు వచ్చేసింది. నీ తరుపున నిలబడాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ కుంభ కర్ణుడు తన సోదరుడిపై ప్రేమ ప్రదర్శిస్తాడు. శ్రీరాముడితో, వానర సేనతో యుద్ధంలోకి దిగుతాడు. యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే కుంభకర్ణుడు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తన భారీ కాయంతో వానర సేనను నలిపేస్తుంటాడు. అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు లాంటి వానర వీరులు కుంభకర్ణుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. కానీ అతడిని నిలువరించడం వారికి సాధ్యం కాదు. కొంత వరకు గాయపరచగలుగుతారు అంతే. సుగ్రీవుడిని కుంభకర్ణుడు ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాడు.

55
రాముడు, కుంభకర్ణుడు మధ్య దద్దరిల్లే యుద్ధం
Image Credit : gemini ai

రాముడు, కుంభకర్ణుడు మధ్య దద్దరిల్లే యుద్ధం

వానర సైన్యం కుంభకర్ణుడి ధాటికి భయంతో పరుగులు తీస్తుంటారు. పరిస్థితి చేదాటిపోతుండడంతో రాముడు రంగంలోకి దిగక తప్పదు. చాలా సేపు రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది. కుంభకర్ణుడి గర్జన, రాముడి పరాక్రమంతో ఇరువైపు సైన్యాలు కంపించిపోతాయి. దీనితో శ్రీరాముడు తన అమ్ములపొది లోనుంచి అంత్యత శక్తివంతమైన వాయువ్యాస్త్రాన్ని సంధించి కుంభకర్ణుడి చేతిని నరికేస్తాడు. మరో అస్త్రంతో రెండో చేతిని కూడా ఖండిస్తాడు. రెండు చేతులు లేకపోయినా కుంభకర్ణుడు యుద్ధం ఆపడు. పోరాడుతూనే ఉంటాడు. ఆ తర్వాత రాముడు అతడి రెండు కాళ్ళని కూడా తెగనరికేస్తాడు. చివరగా శ్రీరాముడు దేవేంద్రుడి వరం అయిన ఐంద్రాస్త్రాన్ని శరవేగంగా సంధించి కుంభకర్ణుడి శిరస్సు ఖండిస్తాడు. ఆ వేగానికి కుంభకర్ణుడి తల సముద్రంలో వెళ్లి పడుతుంది. అతడి భారీ కాయం సముద్రంలో మునిగిపోతుంది. కుంభకర్ణుడు గొప్పవాడైనప్పటికీ రావణుడు చేసిన తప్పుకు కొమ్ము కాయడంతో ఘోరమైన చావు తప్పలేదు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ ఎపిసోడ్ ని రాజమౌళి వారాణసి మూవీలో ఎలా తెరకెక్కించారు అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Tollywood: కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు, పెళ్లి తర్వాత మాస్ కంబ్యాక్.. చైతు, సమంత ఇద్దరూ భలే లక్కీ
Recommended image2
Kalki 2: 'ఓ ధనంజయా, నువ్వు నేను ఇద్దరం కర్ణుడిని ఓడించలేం'.. మంటలు మరింత పెంచిన నాగ్ అశ్విన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved