'సైరా' రేపే విడుదల: ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే!
First Published Oct 1, 2019, 2:53 PM IST
'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆ సినిమా స్పూర్తిగా సౌత్ లో మరిన్ని సినిమాలు వస్తున్నాయి.

'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆ సినిమా స్పూర్తిగా సౌత్ లో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రూపొందిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. 'బాహుబలి' లేకపోతే 'సైరా' లేదంటూ చిరు స్వయంగా చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన నూటయాభై సినిమాలు ఒక ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు. చిరు లాంటి నటుడిని ఇలాంటి ప్యాన్ ఇండియా కథలో చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?