మహాభారతంలో వీరుడిగా నందమూరి మోక్షజ్ఞ ?.. ఇది కనుక నిజమైతే..
బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఇంతకాలం వెయిట్ చేశారు.
Mokshagna
ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. ప్రశాంత్ వర్మ హను మాన్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకి మించేలా విజువల్ ఎఫెక్ట్స్ ఉండే భారీ కథని మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారట.
ఈ కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మాత్రం భారీ బడ్జెట్ లో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారట. కథ గురించి వస్తున్న లీక్స్ ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు.
ఈ చిత్ర కథ మహాభారతంలోని ఒక వీరుడు చుట్టూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఆ వీరుడిగా కనిపిస్తాడా లేక హను మాన్ తరహాలో సాధారణ యువకుడిగా ఉంటూ ఆ వీరుడి నుంచి స్ఫూర్తి పొందుతాడా అనేది చూడాలి.
మొత్తంగా ప్రశాంత్ వర్మ ఒక పవర్ ఫుల్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ చిత్రం సెప్టెంబర్ 6న లాంచ్ కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.