MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 20 ఏళ్ళ కుర్రాడిని నమ్మి 1000 కోట్ల ప్రాజెక్టు, అల్లు అర్జున్ ని ఫిదా చేసిన సాయి అభ్యంకర్ ఎవరు ?

20 ఏళ్ళ కుర్రాడిని నమ్మి 1000 కోట్ల ప్రాజెక్టు, అల్లు అర్జున్ ని ఫిదా చేసిన సాయి అభ్యంకర్ ఎవరు ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో క్రేజీ చిత్రానికి రంగం సిద్ధం అయింది. మంగళవారం రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో క్రేజీ చిత్రానికి రంగం సిద్ధం అయింది. మంగళవారం రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ అట్లీ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలన్నీ మాస్ కథలే. రాజా రాణి మాత్రం లవ్ స్టోరీ. 

26
AA22 x A6 movie

AA22 x A6 movie

అల్లు అర్జున్ తో కూడా భారీ స్థాయిలో మాస్ మూవీ చేస్తాడని అంతా భావించారు. కానీ అనౌన్స్ మెంట్ వీడియోతో అందరి మతులు పోయాయి. అమెరికా వెళ్లి పాపులర్ విఎఫ్ఎక్స్ సంస్థలతో మాట్లాడారు. హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన విఎఫ్ ఎక్స్ సంస్థలు అల్లు అర్జున్, అట్లీ చిత్రం కోసం వర్క్ చేయబోతున్నాయి. విఎఫ్ఎక్స్ సంస్థల ప్రతినిధులు అల్లు అర్జున్, అట్లీ మూవీ స్టోరీ విని ఫిదా అయ్యారు. కొంతమంది అయితే ఈ కథ విన్నాక తమ బుర్ర బొంగరంలా తిరుగుతోంది అని తెలిపారు. అంతటి భారీ కథతో అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 250 నుంచి 300 కోట్ల వరకు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే బడ్జెట్ ఖర్చు అవుతుందట. 

36
Atlee - Allu Arjun Movie

Atlee - Allu Arjun Movie

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఓవరాల్ గా ఈ చిత్ర బడ్జెట్ 1000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ మాస్ చిత్రం కాదు. ఇప్పటి వరకు హాలీవుడ్ వాళ్లకు మాత్రమే సాధ్యమైన స్పేస్, ఏలియన్స్, ఇతర గ్రహాలకు సంబంధించిన కథ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో పార్లల్ యూనియర్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుందట. 

Also Read : తన చిత్రం రాంచరణ్ చేతుల్లోకి వెళ్లడంతో.. క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిందా ?

46

అంతరిక్షంలో ఏలియన్స్, వారితో పోరాటం చేసే వీరుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే వీడియోలో అనేక రకాల ఆయుధాలు, విచిత్రమైన ఆకారాలతో బొమ్మలు కనిపించాయి. హాలీవుడ్ లో అవతార్ లాంటి చిత్రాల్లో విశ్వంలో మరో గ్రహంలో జీవజాతి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనే ఫిక్షనల్ కథలు వచ్చాయి. బన్నీ, అట్లీ చిత్రం కూడా అలాంటి కథే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

56
Sai Abhyankkar

Sai Abhyankkar

ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్న మరో అంశం ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. ఇతగాడి వయసు కేవలం 20 ఏళ్ళు మాత్రమే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, బన్నీ అట్లీ చిత్రాన్ని సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఈ కుర్రాడు పాపులర్ అయ్యాడు. తమిళంలో పలు అవకాశాలు అందుకుంటున్నాడు. ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ అనుభవం లేని కుర్రాడికి 1000 కోట్ల చిత్రం అప్పగించడం ఏంటని ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ ఈ కుర్రాడి ట్యాలెంట్ కి ఫిదా అయ్యాడట. అట్లీ కూడా సాయి అభ్యంకర్ పై నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. 

66
Sai abhyankkar

Sai abhyankkar

ఈ సాయి అభ్యంకర్ ఎవరో కాదు ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడే. సింగర్ హరిణి.. నరసింహ నాయుడు, మురారి, ఖుషి లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన సాంగ్స్ పాడారు. తల్లి దండ్రుల ద్వారా సాయి అభ్యంకర్ కి కూడా మ్యూజిక్ పై ఆసక్తి పెరిగింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved