MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన చిత్రం రాంచరణ్ చేతుల్లోకి వెళ్లడంతో.. క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిందా ?

తన చిత్రం రాంచరణ్ చేతుల్లోకి వెళ్లడంతో.. క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిందా ?

టాలీవుడ్ లో ఒక హీరో చేయాలి అనుకున్న కథలు మరో హీరో చేతుల్లోకి వెళుతుంటాయి. హీరో రిజెక్ట్ చేయడం వల్ల కావచ్చు, బడ్జెట్ కారణాలు, ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.రాంచరణ్ వల్ల మరో క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్రం ఏంటి ? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Apr 09 2025, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ram Charan

Ram Charan

టాలీవుడ్ లో ఒక హీరో చేయాలి అనుకున్న కథలు మరో హీరో చేతుల్లోకి వెళుతుంటాయి. హీరో రిజెక్ట్ చేయడం వల్ల కావచ్చు, బడ్జెట్ కారణాలు, ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. రాంచరణ్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. రాంచరణ్ వల్ల మరో క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్రం ఏంటి ? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 

27
Ram Charan Peddi Movie

Ram Charan Peddi Movie

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. రవితేజ, రాంచరణ్, మహేష్ ఇలా చాలా మంది హీరోలకి తన చిత్రాలతో స్టార్ డమ్ తీసుకువచ్చారు. కన్నడలో రాజ్ కుమార్ తనయుడు పునీత్ ని లాంచ్ చేసి సూపర్ హిట్ ఇచ్చింది పూరి జగన్నదే. తెలుగులో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ని లాంచ్ చేసి చిరుత చిత్రంతో మంచి హిట్ అందించారు. అయితే చిరుత చిత్రం విషయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చిరుత చిత్రం 2007లో రిలీజ్ అయింది. 

37

అంతకు 3 ఏళ్ళ ముందే ఈ చిత్ర కథ రెడీ అయింది. అయితే రాంచరణ్ కోసం కాదు. పూరి జగన్నాధ్ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ని 143 చిత్రంతో హీరోగా లాంచ్ చేశారు. ఆ టైంలో మెహర్ రమేష్ పూరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. మెహర్ రమేష్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. తన తమ్ముడితో మరో చిత్రాన్ని నిర్మించాలని పూరి జగన్నాధ్ భావించారు. కథని రెడీ చేసే బాధ్యత మెహర్ కి అప్పగించారు. ముందుగా అక్క తమ్ముడు సెంటిమెంట్ తో ఒక కథని మెహర్ రమేష్ స్టార్ట్ చేశారు. ఆ కథ తనకే నచ్చలేదని మెహర్ పూరికి చెప్పారట. దీనితో పూరి జగన్నాధ్ మెహర్ రమేష్ కి ఒక ఐడియా ఇచ్చారు. 

47

హాలీవుడ్ లో ఒక చిత్రం ఉంది. పొగరుబోతు హీరోయిన్, హీరోతో పొరపాటున ఐలాండ్ లోకి వెళుతుంది. అక్కడ హీరో ఆమె గర్వం తగ్గేలా పనులు చేయిస్తాడు. ఆ చిత్రం పేరు గుర్తుకు రావడం లేదు. ఆ మూవీ ఏంటో కనుక్కునే బాధ్యతని పూరి.. రచయిత తోట ప్రసాద్ కి అప్పగించారట. తోట ప్రసాద్ ఆరా తీయగా.. అది 2002లో విడుదలైన స్వెప్ట్ అవే అనే చిత్రం అని తెలిసింది. అప్పటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మడోన్నా అందులో హీరోయిన్ గా నటించారు. 

57
Puri Jagannadh

Puri Jagannadh

ఆ చిత్రం ఆధారంగా మెహర్ రమేష్, తోట ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఫస్ట్ టైం అనుష్క శెట్టిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రానికి సీతామహాలక్ష్మీ ఎఫ్ 19 అనే టైటిల్ అనుకున్నారట. అనుష్క హీరోయిన్ గా సెట్ కాలేదు. చివరికి మరో హీరోయిన్ ని అనుకున్నారు. 2004 డిసెంబర్ మొదటి వారంలో పూరి జగన్నాధ్ నిర్మాతగా, మెహర్ రమేష్ దర్శకుడిగా, సాయిరాం శంకర్ హీరోగా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. బ్యాంకాక్ బీచ్ లో షూటింగ్ చేద్దామని అనుకున్నారు. 

67

ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగిన కొన్ని రోజులకే భారీ సునామీ వచ్చింది. ఆ ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగింది. బీచ్ లో బోటింగ్, షూటింగ్స్ చేయడంపై ఆంక్షలు విధించారు. పరిస్థితి చక్కబడే సమయానికి బడ్జెట్, ఆర్థిక సమస్యల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది అని రచయిత తోట ప్రసాద్ తెలిపారు. ఇంతలో 2006లో మెగాస్టార్ చిరంజీవి వచ్చి తన కొడుకుని హీరోగా లాంచ్ చేయాలి అని పూరి జగన్నాధ్ ని అడిగారు. అశ్విని దత్ నిర్మాత. రాంచరణ్ కి ఎలాంటి కథ సెట్ అవుతుంది అని ఆలోచిస్తున్న టైంలో పూరి జగన్నాధ్ కి స్వెప్ట్ అవే చిత్రం గుర్తుకు వచ్చింది. ఆ మూవీ ఆధారంగా తన తమ్ముడి కోసం రెడీ చేసిన కథని పూరి బయటకి తీశారు. 

77
Swept Away

Swept Away

ఆ కథలో కొన్ని మార్పులు చేసి, యాక్షన్ జోడించి చిరుత స్క్రిప్ట్ రెడీ చేశారు. చిరుత మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఐలాండ్ లో జరిగే 40 శాతం సన్నివేశాలు స్వెప్ట్ అవే చిత్రం నుంచి తీసుకున్నవే అని తోట ప్రసాద్ తెలిపారు. ఆ చిత్రం కనుక సాయిరాం శంకర్ కి పడి ఉంటే అతడి కెరీర్ ఇంకా మెరుగ్గా ఉండేది. ప్రస్తుతం టాలీవుడ్ లో సాయిరాం శంకర్ కనిపించని పరిస్థితి ఉంది. చిన్న చిన్న చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Recommended image2
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Recommended image3
రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved