నాని దసరాకి, సిల్క్ స్మితకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా.. అలా చేయాలంటే గట్స్ ఉండాలి
మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. నాని ఈ తరహా రగ్గడ్ లుక్ గతంలో ఎప్పుడూ కనిపించలేదు.

మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. నాని ఈ తరహా రగ్గడ్ లుక్ గతంలో ఎప్పుడూ కనిపించలేదు. బాడీ లాంగ్వేజ్ కూడా ఊరమాస్ అన్నట్లుగా ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీర్తి సురేష్ నానికి జోడిగా నటించింది. రేపు మార్చి 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. నాని అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిత్ర పోస్టర్స్ లో దివంగత నటి సిల్క్ స్మిత ఫోటో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఫోటోని ప్రమోషన్స్ పరంగా దసరా డైరెక్టర్ బాగానే వాడేస్తున్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు సిల్క్ స్మిత మ్యాటర్ ఏంటి అని అడగగా.. తన చిన్ననాటి సంఘటనని శ్రీకాంత్ ఓదెల వివరించాడు.
తన తాత సింగరేణి కార్మికుడిగా పనిచేస్తుండేవారట. ప్రమాదంలో ఆయన కాలు విరిగిపోయింది. ఆ తర్వాత ఆయనకి కల్లు, మద్యం అవసరం అయితే శ్రీకాంత్ వెళ్లి తీసుకువచ్చేవాడట. ఒకసారి చిన్నతనంలో కల్లు దుకాణంకి వెళితే అక్కడ సిల్క్ స్మిత పోస్టర్ కనిపించింది. ఆమెని లుక్ చిన్నతనంలోనే శ్రీకాంత్ ని బాగా ఆకర్షించింది. తాను తొలిసారి సిల్క్ స్మితని చూడడం అదే అని శ్రీకాంత్ తెలిపారు.
అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు సిల్క్ స్మిత ఫోటో చూస్తూనే ఉన్నాడట. ఆ విధంగా శ్రీకాంత్ సిల్క్ స్మితకి అభిమానిగా కూడా మారాడు. ఆ అభిమానంతోనే దసరా చిత్రంలో సిల్క్ స్మిత ఫోటో పెట్టినట్లు శ్రీకాంత్ వివరించాడు. అదన్నమాట దసరా చిత్రానికి, సిల్క్ స్మితకి ఉన్న కనెక్షన్.
అయితే శ్రీకాంత్ ఓదెల మరో అసలు మ్యాటర్ దాచేసినట్లు తెలుస్తోంది. దసరా చిత్రంలో సిల్క్ స్మిత కేంద్రంగా ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా చిత్రంలో సిల్క్ స్మిత ఫోటో ఉన్న కల్లు దుకాణం ఉంటుంది. ఆ దుకాణంలో అగ్రవర్ణాల వారికి, దళితులకు పెద్ద గొడవే జరుగుతుంది. హీరో నాని దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఈ గొడవ కారణంగా ఊరివాళ్ళు ఆ కల్లు దుకాణంని తగలబెడతారు.
దీని పర్యావసానాలు చిత్రంలో చాలా కీలకం కావచ్చు. ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల సిల్క్ స్మితపై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. ఆ టైంలో సిల్క్ స్మిత అలా నటించడానికి చాలా గట్స్ కావాలి అని ప్రశంసించాడు. 80, 90 దశకాల్లోనే సిల్క్ స్మిత బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించింది. ఆమె మరణం కూడా అంతే మిస్టరీగా మారింది.