- Home
- Entertainment
- పూరి జగన్నాధ్ ఆ ఇద్దరికీ హ్యాండిచ్చినట్లేనా.. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్స్ ఎవరంటే ?
పూరి జగన్నాధ్ ఆ ఇద్దరికీ హ్యాండిచ్చినట్లేనా.. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్స్ ఎవరంటే ?
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ఎవరు అనుకోరు. కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం లేదు అనే కామెంట్ ఉంది.

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ఎవరు అనుకోరు. కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం లేదు అనే కామెంట్ ఉంది. ఎలాగోలా పూరి.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సెట్ చేసుకున్నారు.
నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో పూరి జగన్నాధ్.. రామ్ పోతినేని మాస్ విశ్వరూపం చూపించాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ఖరారైంది. ఇటీవలే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ ల పాత్రని కొట్టిపారేయలేం. గ్లామర్ తో సినిమాకి వాళ్లిద్దరూ చాలా బాగా ప్లస్ అయ్యారు. ఇప్పుడు వీళ్లిద్దరి పరిస్థితి ఏంటి ? డబుల్ ఇస్మార్ట్ లో పూరి వీరిద్దరికి ఛాన్స్ ఇస్తారా అంటే అనుమానమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే నిధి అగర్వాల్, నభా నటేష్ ప్రభావం టాలీవుడ్ తగ్గింది. వీళ్లిద్దరికీ ఆఫర్స్ దాదాపుగా తగ్గిపోయాయి. ఇక పూరి జగన్నాధ్ కూడా బాలీవుడ్ వైపే మనసు పెడుతున్నారట. ఆల్రెడీ సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో క్లారిటీ లేదు.
పూరి డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీనితో నార్త్ హీరోయిన్స్ అయితే అప్పీల్ ఉంటుందనేది పూరి ప్లాన్ అట. అదే కనుక జరిగితే నభా నటేష్, నిధి అగర్వాల్ అని పక్కన పెట్టేసినట్లే అని వార్తలు వస్తున్నాయి.
అయితే లైగర్ చిత్రంలో పూరి నార్త్ బ్యూటీ అనన్య పాండేని ఎంచుకుని దెబ్బైపోయాడు. సినిమా ఎలా ఉన్నా అనన్య ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రామ్ పోతినేని ఫ్యాన్స్ మాత్రం నిధి, నభా అయితేనే బావుంటుందని అంటున్నారు. మరి పూరి ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారో చూడాలి.