`జబర్దస్త్`లో ట్రెండ్ సెట్టర్ సత్యశ్రీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?.. ఇప్పుడేం చేస్తుంది?
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మంది లైఫ్ ఇచ్చింది. అందులో మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు సత్యశ్రీ. చమ్మక్ చంద్రతో జోడీ కట్టిన ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుంది? ఇంతకి ఆమె గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`జబర్దస్త్` కామెడీ షో గత ఎనిమిదేళ్లుగా విజయవంతంగా రన్ అవుతుంది. ఇంటిళ్లిపాదికి వినోదాన్ని పంచుతుంది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ షో ఇప్పుడు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ షోగా నిలిచింది. అంతేకాదు అనేక మంది కమెడీయన్లకి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో చాలా వరకు అబ్బాయిలే ఉండేవారు. యాంకర్లు అనసూయ, రష్మి, జడ్జ్ రోజా తప్పా మిగిలిన కమెడీయన్లంతా మగవాళ్లే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలు జోరు పెరిగింది. అమ్మాయిలు మేల్ కంటెస్టెంట్లకి దీటుగా వస్తున్నారు. రాణిస్తున్నారు.
`జబర్దస్త్`లో అమ్మాయిల ఎంట్రీ `సత్యశ్రీ`తో జరిగింది. చమ్మక్ చంద్ర టీమ్‌తో ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ ఉన్నన్ని రోజులు ఆద్యంతం కనువిందు చేసింది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసింది. అంతకు ముందు అమ్మాయిల వేషాధారణ కూడా మేల్ కంటెస్టేంట్లే వేసేవారు. కానీ సత్య శ్రీ ఓరకంగా ఆ ట్రెండ్‌ని మార్చింది. `జబర్దస్త్`లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపించుకుంది. అందుకు చమ్మక్ చంద్ర చేసిన ఎంకరేజ్‌మెంటే కారణమని చెప్పొచ్చు.
సత్యశ్రీ `జబర్దస్త్`లోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్, కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ చిన్న చిన్న పాత్రలు కావడంతో ఎవరూ గుర్తించలేదు. గుర్తింపు రాలేదు. `జబర్దస్త్`లోకి రావడంతో ఆమె కెరీరే మారిపోయింది. మరో టర్న్ తీసుకుంది. ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది.
అయితే చమ్మక్ చంద్రకి మధ్యలో కొన్ని సినిమా ఆఫర్లు రావడంతో ఆయన `జబర్దస్త్`కి బ్రేక్ ఇచ్చారు. దీంతో ఆయనతోపాటు సత్యశ్రీ కూడా వెళ్లిపోయింది. కానీ ఆమె ఈ కామెడీ షోలో మాత్రం ఓ గొప్ప మార్పుని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తర్వాత జబర్దస్త్ లో చాలా మంది మహిళా కమెడీయన్లు వచ్చారు. `జబర్దస్త్` వర్ష, రోహిణి, పవిత్ర, ఫైమా వంటి వారు ఇప్పుడు సందడి చేస్తున్నారు.
`జబర్దస్త్` తర్వాత చమ్మక్ చంద్రతోకలిసి `అదిరింది` షోలో యాక్ట్ చేసింది. మరోవైపు సినిమాల్లో అవకాశాలను అందుకుంది సత్యశ్రీ. ఆమెకి `రాజా ది గ్రేట్`, `సర్దార్ గబ్బర్ సింగ్`, `సిల్లీ ఫెలోస్`, `రారండోయ్ వేడుక చేద్దాం` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సైతం సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది.
అయితే `జబర్దస్త్`లోకి అమ్మాయిలను తీసుకోవడానికి కారణం రియాలిటీ అని, తన స్కిట్‌లు భార్యాభర్తల రిలేషన్ షిప్స్ పై ఉంటాయని, అందులో అమ్మాయిలుంటే రియల్ ఫీల్ ఉంటుందని అందుకే అమ్మాయిలను తీసుకుంటానని చెప్పారు చమ్మక్ చంద్ర. అలా సత్యశ్రీని కూడా తీసుకొచ్చానని, ఆమెతో నా జోడీ బాగా క్లిక్ అయ్యిందని, బాగా ఆదరణ దక్కుతుందని చెప్పారు. `జబర్దస్త్`లో లేడీస్‌ని తీసుకోకపోవడానికి కారణంగా డబుల్ మీనింగ్ డైలాగులను, కొన్ని కొట్టుకునే సన్నివేశాల కారణంగా వారిని తీసుకోవడం లేదని, కానీ అమ్మాయిలను తీసుకోకూడదనే రూల్ ఏం లేదని చెప్పారు.