MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ 'ఆంటీ' వివాదం, ఆమెపై రగిలిపోతున్న ఇండస్ట్రీ... బ్రహ్మాజీ కౌంటర్ వెనుక కారణాలెన్నో!

అనసూయ 'ఆంటీ' వివాదం, ఆమెపై రగిలిపోతున్న ఇండస్ట్రీ... బ్రహ్మాజీ కౌంటర్ వెనుక కారణాలెన్నో!

పరిశ్రమకు చెందిన నటిగా ఉండి ఓ సినిమా ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేశానని చెప్పి అనసూయ ఇండస్ట్రీ వర్గాల ఆగ్రహానికి గురైనట్లు అనిపిస్తుంది. దానికి తాజా సంఘటనలే రుజువుగా కొందరు విశ్లేషిస్తున్నారు.  

2 Min read
Sambi Reddy
Published : Aug 31 2022, 04:54 PM IST | Updated : Aug 31 2022, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

అనుకోకుండా లేదా మన ప్రమేయం లేకుండా వివాదంలో ఇరుక్కోవడం వేరు. ఒకర్ని గెలికి మరీ వివాదం రాజేయడం వేరు. అనసూయ 'ఆంటీ' వివాదానికి రెండో కండీషన్ అప్లై అవుతుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమె కావాలని గొడవ పెట్టుకున్నారు. లైగర్ కి డిజాస్టర్ టాక్ రాగానే, కర్మ ఫలం అంటూ ఇండైరెక్ట్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ వివాదానికి కారణమైంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసేలా చేసింది.

27
Asianet Image


ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాక కూడా ఆమె తగ్గలేదు. నా ట్వీట్ లైగర్ మూవీ గురించి కాదని చెప్పలేదు. మరింత రెచ్చగొట్టేలా ఒకప్పుడు నన్ను తిట్టారు. అందుకే నేను ట్వీట్ వేశాను. లైగర్ ఫెయిల్యూర్ నేను ఎంజాయ్ చేస్తున్నానని ఒప్పుకున్నారు. ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ట్వీట్స్ మనం పట్టించుకోవాలా అని, ఊరుకోకుండా వాళ్లకు సమాధానాలు ఇస్తూ వివాదం మరింత పెద్దది చేశారు. 

37
Asianet Image

ఇదంతా అనసూయ పబ్లిసిటీ కోసం చేశారా? విజయ్ దేవరకొండపై కోపంతో చేశారా? అనేది పక్కన పెడితే. ఆమెకు ఈ పరిణామం చేటు చేసే సూచనలే ఎక్కువ కనబడుతున్నాయి. ఓ మూవీ పరాజయాన్ని ఎంజాయ్ చేశానని చెప్పి చాలా మంది ఆగ్రహానికి కారణమయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది జీవితాలను ప్రభావితం చేసే మూవీ ఫెయిల్ అవ్వాలని కోరుకోవడం చాల పెద్ద తప్పు. 

47
Asianet Image

దశాబ్దానికి పైగా అనసూయ ఇండస్ట్రీ పైనే బ్రతుకుతుంది. యాంకరింగ్ కూడా పక్కన పెట్టి నటిగా వరుస ఆఫర్స్ తో లక్షలు ఆర్జిస్తోంది. అలాంటి అనసూయకు మూవీ ఫెయిల్యూర్ దర్శక నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్స్, హీరో హీరోయిన్స్ ని ఎంత వేదనకు గురి చేస్తుందో తెలియని కాదు. అంటే వాళ్ళందరి ఏడుపును అనసూయ ఎంజాయ్ చేశారంటే దాన్ని శాడిజం అనాలా. ఇందుకే పరిశ్రమకు అనసూయ మీద మండిందనిపిస్తుంది.

57
Asianet Image

మనం గమనిస్తే అనసూయను ఆంటీ అని ట్రోల్ చేస్తున్నా పరిశ్రమ నుండి ఒక్కరు మద్దతు ఇవ్వలేదు. ఒక్క శ్రద్దా దాస్ మాత్రం స్పందించారు. సప్పోర్ట్ చేశారు. ఫక్తు తెలుగు పరిశ్రమకు చెందినవారు కానీ, బుల్లితెర యాంకర్స్ కానీ నోరు మెదపలేదు. కారణం ఆమెదే తప్పని భావిస్తూ ఉండవచ్చు. 
 

67
Asianet Image


అనసూయ తీరు పరిశ్రమ పెద్దలకు కోపం తెప్పించింది అనడానికి మరొక ఉదాహరణ నటుడు బ్రహ్మాజీ ట్వీట్. అనసూయకు ఆయన డైరెక్ట్ గా చురకలు అంటించాడు. ''ఎవర్రా అంకుల్, అంకుల్ అంటే కేసు పెడతా'' అని ట్వీట్ చేశాడు. ఇది ఖచ్చితంగా అనసూయపై ఆయన వేసిన సెటైర్. తనకు అత్యంత సన్నిహితుడు పూరి తెరకెక్కించిన లైగర్ పట్ల అనసూయ వ్యవహరించిన తీరు ఆయనకు కోపం తెప్పించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

77
Asianet Image

దారిన పోయే కంపను ముడ్డికి తగిలించుకున్నట్లు లేని పోనీ గొడవలు పెట్టుకొని అనసూయ కెరీర్ చేజేతులా ప్రమాదంలోకి నెట్టుకుంటుంది. నెగిటివిటీ ఇలానే పెంచుకుంటూ పోతే అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ఆఫర్స్ కోల్పోవడం ఖాయం. ఎస్టాబ్లిష్ అయ్యాం  మనకేం ఢోకా లేదు అనుకుంటే పొరపాటే. టెక్కు చూపించిన మహామహులే కనుమరుగైపోయారు.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved