- Home
- Entertainment
- `జబర్దస్త్`కి ఇంద్రజ బిగ్ షాక్.. షోకి గుడ్ బై.. ఎమోషనల్‌గా మారిన కామెడీ షో.. కొత్త జడ్జ్ ఎవరు?
`జబర్దస్త్`కి ఇంద్రజ బిగ్ షాక్.. షోకి గుడ్ బై.. ఎమోషనల్‌గా మారిన కామెడీ షో.. కొత్త జడ్జ్ ఎవరు?
జబర్దస్త్ షోకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది యాంకర్లు, జడ్జ్ లు మారుతున్న నేపథ్యంలో తాజాగా ఇంద్రజ షాక్ ఇచ్చింది. వీడుతున్నట్టు వెల్లడించింది.

జబర్దస్త్ కామెడీ షోలో ఇటీవల చాలా మార్పులు జరుగుతున్నాయి. గత ఏడాది, రెండేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నాగబాబు జడ్జ్ గా వెళ్లిపోయిన తర్వాత నుంచి జడ్జ్ పోస్ట్ లు మారిపోతున్నాయి. రోజా తర్వాత లేడీ జడ్జ్ లో మార్పులు జరిగాయి. అనసూయ వెళ్లిపోయినప్పట్నుంచి యాంకర్లలోనూ మార్పులు జరిగాయి.
నాగబాబు మొదట జబర్దస్త్ ని వీడాడు. ఆయన స్థానంలో మనో చాలా రోజులు ఉన్నాడు. ఆయనతోపాటు శేఖర్ మాస్టర్ జడ్జ్ గా చేశాడు. అంతేకాదు లేడీ జడ్జ్ లు కూడా వచ్చారు. ఫైనల్‌గా కృష్ణభగవాన్‌ని ఫిక్స్ చేశారు. మేల్ జడ్జ్ విషయంలో అంతా సాఫీగా సాగుతుంది.
Anasuya Bharadwaj
యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పింది. శాశ్వతంగా ఆమె దూరమైంది. ఆమె తర్వాత చాలా మందిని యాంకర్లుగా టెస్ట్ చేశారు. ఎవరూ సెట్ కాక రష్మినేయాంకర్ చేసింది. కొన్నాళ్లకి సౌమ్యరావుని తీసుకొచ్చారు. ఆమె బాగానే సెట్ అయ్యింది. ఇంతలోనే ఆమెని కూడా పక్కన పెట్టారు. ఆమె స్థానంలో బిగ్ బాస్ సిరి హన్మంతుని యాంకర్‌గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కంటిన్యూ అవుతుంది.
ఈ క్రమంలో మంత్రి రోజా జబర్దస్త్ ని వీడటంతో చాలా మంది మారిపోయారు. ఇంద్రజ కొన్ని రోజులు, ఖుష్బూ, సదా, ఆమని వంటి వారు వచ్చారు. ఖుష్బూ, ఇంద్రజ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఖుష్బూ కూడా వెళ్లిపోవడంతో ఇంద్రజనే రెండు షోలను మ్యానేజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇంద్రజ కూడా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జబర్దస్త్ ని వీడుతున్నట్టు తెలిపారు.
అయితే కొంత కాలం గ్యాప్ తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. అంటే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్బంగా తన వీడ్కోలుని వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యింది ఇంద్రజ. కన్నీళ్లని ఆపుకోలేకపోయింది. జబర్దస్త్ ని ఓ ఫ్యామిలీలా భావించింది ఆమె. అందరు ఆమెని అమ్మగా పిలుస్తూ ఎంతో ప్రేమగా ఉన్నారు. తాను కూడా అంతే ప్రేమగా వారితో ఉంది. అందుకే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో ఇంద్రజ వెళ్లిపోతుందంటే కమెడియన్లు కూడా ఎమోషనల్ అయ్యారు.
మరి జబర్దస్త్ కి సంబంధించిన రెండు షోలకు లేడీ జడ్జ్ కొరత ఏర్పడింది. ఆమె స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ ఖుష్బూని తీసుకువస్తారా? లేదంటే కొత్త వారిని తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ సారి జడ్జ్ కి సంబంధించిన అంశం చాలా ఇంట్రెస్టింగ్‌గా, హాట్ టాపిక్‌గా మారడం విశేషం. తాత్కాలికంగా ఏ సీనియర్ నటితో లాగించి మళ్లీ ఇంద్రజని తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.
కానీ జబర్దస్త్ లో ఈ మార్పులు ఆ షోపై ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు ఈ మార్పుల కారణంగా షోకి రేటింగ్ కూడా తగ్గింది. గతంలో మాదిరి కామెడీ లేదనే టాక్ కూడా ఉంది. పైగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి ఆర్టిస్ట్ లు లేకపోవడంతో ఆ లోటు కూడా ఉంది.
ఇలా అన్నీ షో రేంజ్‌ని తగ్గిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఇంద్రజ వెళ్లిపోతుందనే వార్తతో ఆమె అభిమానులు, షో ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక షో పని అయిపోయిందని, ఎవరూ చూడరని అంటున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.