MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. చివర్లో పవన్‌కళ్యాణ్‌, టాప్‌లో ఉన్నది ఎవరంటే?

ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. చివర్లో పవన్‌కళ్యాణ్‌, టాప్‌లో ఉన్నది ఎవరంటే?

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియా వైడ్‌గా మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాని విడుదల చేస్తుంది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ దెబ్బకి బాలీవుడ్‌ హీరోలు పరార్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 20 2025, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియా టాప్‌ 10 హీరోస్‌ ప్రభాస్‌ ఫస్ట్ ప్లేస్‌
Image Credit : bollywoodmdb

ఇండియా టాప్‌ 10 హీరోస్‌- ప్రభాస్‌ ఫస్ట్ ప్లేస్‌

ఇండియా వైడ్‌గా టాప్‌ 10 హీరోల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల విడుదల చేస్తుంది. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి లిస్ట్ వచ్చింది. ఇందులో ఎప్పటిలాగానే ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన ప్రతి నెల నెంబర్‌ 1గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇమేజ్‌ పరంగా, క్రేజ్‌ పరంగా, మార్కెట్‌ పరంగా, సోషల్‌ మీడియాలో  డిస్కషన్‌కి సంబంధించి ప్రభాస్‌కి తిరుగులేదని చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఉన్నారు. ఆయన స్థానం కూడా పదిలంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూడో స్థానంలో అల్లు అర్జున్‌
Image Credit : youtube/unstoppable with nbk

మూడో స్థానంలో అల్లు అర్జున్‌

మూడో స్థానంలో ఐకాన్ స్టార్‌ అ్లలు అర్జున్‌ నిలిచారు. ఆయన తరచూ మూడు, నాలుగు స్థానాల్లో ఉంటున్నారు. ఇప్పుడు కంటిన్యూగా మూడో స్థానంలో నిలుస్తున్నారు. `పుష్ప2` తర్వాత అల్లు అర్జున్‌ రేంజ్‌ పెరిగిపోయింది. ఇప్పుడు అట్లీతో ఇంటర్నేషన్‌ మూవీ చేస్తున్నారు. దీంతో బన్నీకి సంబంధించిన చర్చ కూడా జరుగుతూనే ఉంది.  ఆయన కూడా టాప్‌ లో ఉంటున్నారు. ఇక నాల్గో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. గతంలో మూడో స్థానంలో ఉన్న ఆయన ఈ సారి నాల్గో స్థానానికి పరిమితమయ్యారు. ఐదో స్థానంలో అజిత్ ఉన్నారు. కోలీవుడ్‌ నుంచి విజయ్‌, అజిత్‌ మాత్రమే ఈ లిస్ట్ లో ఉంటున్నారు. అజిత్‌ కూడా ఐదో స్థానానికి ఫిక్స్ అయ్యారు.

Related Articles

Related image1
సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దీపికా పదుకొనె
Related image2
చిరంజీవి చేతిలో చావు దెబ్బలు తిన్న మోహన్‌ బాబు.. `కొదమసింహం` మూవీ రీ రిలీజ్‌ రివ్యూ
36
ఆరో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్‌
Image Credit : our own

ఆరో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్‌

ఆరో స్థానంలో ఎన్టీఆర్‌ ఉన్నారు. తారక్‌ స్థానం నెల నెల మారుతుంటుంది. టాప్‌ 6 నుంచి టాప్‌ 10 వరకు మధ్యలో ఏదైనా ఉంటుంది. ఆయన సినిమాలకు సంబంధించిన చర్చను బట్టి అది ఉంటుంది. అయితే ఇటీవల చాలా వరకు ఆరు, ఏడు స్థానాల్లో ఉంటున్నారు. కానీ అక్టోబర్‌లో మాత్రం ఆరో స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌తో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అందుకే తారక్‌ తన స్థానం పెంచుకున్నారు.

46
ఏడో స్థానంలో మహేష్‌ బాబు
Image Credit : Asianet News

ఏడో స్థానంలో మహేష్‌ బాబు

ఏడో స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఉండటం విశేషం. ఆయన ప్లేస్‌ కూడా ఆరు, ఏడు, ఎనిమిది మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు కూడా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఏడో స్థానంలో ఫిక్స్ అయ్యారు. ఇక నవంబర్‌లో మాత్రం ఆయన స్థానం పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళితో `వారణాసి` చిత్రంలో చేస్తున్నారు. దీని ట్రైలర్‌ వచ్చింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆయన స్థానం పెరిగే అవకాశం ఉంది.

56
ఎనిమిదో స్థానంలో రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

ఎనిమిదో స్థానంలో రామ్‌ చరణ్‌

ఇక ఎనిమిదో స్థానంలో రామ్‌ చరణ్‌ ఉన్నారు. అక్టోబర్‌ లో ఆయన 8వ స్థానంలో ఉండటం విశేషం. ఆయన స్థానం అటు ఇటుగా అంతే ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. వరుసగా అప్‌ డేట్లు వస్తున్నాయి. దీంతో వచ్చే నెల రామ్‌ చరణ్‌ స్థానం పెరిగే అవకాశం ఉంది.

66
టాప్‌ 10 లిస్ట్ లోకి పవన్‌ కళ్యాణ్‌
Image Credit : instagram

టాప్‌ 10 లిస్ట్ లోకి పవన్‌ కళ్యాణ్‌

అక్టోబర్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ టాప్‌ 10 లిస్ట్ లోకి రావడం విశేషం. ఆయన `హరి హర వీరమల్లు` సమయంలో టాప్‌లోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. ఆయన హీరోగా నటించిన `ఓజీ` మూవీ సెప్టెంబర్‌ చివర్లో విడుదలయ్యింది. దాని ప్రభావం అక్టోబర్‌ నెల మొత్తం ఉంది. దీంతో పవన్‌ ఈ జాబితాలోకి వచ్చారు. ఆయన తొమ్మిదో స్థానంలో ఉండటం విశేషం. ఇక పదో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. పవన్‌ దెబ్బకి బాలీవుడ్‌ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించలేకపోవడం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
మహేష్ బాబు ఘట్టమనేని
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దీపికా పదుకొనె
Recommended image2
చిరంజీవి చేతిలో చావు దెబ్బలు తిన్న మోహన్‌ బాబు.. `కొదమసింహం` మూవీ రీ రిలీజ్‌ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved