- Home
- Entertainment
- ఐబొమ్మ రవి పై బయోపిక్ మూవీ.. వెండితెరపై పైరసీ కింగ్ సినిమా తెరకెక్కించేది ఎవరో తెలుసా?
ఐబొమ్మ రవి పై బయోపిక్ మూవీ.. వెండితెరపై పైరసీ కింగ్ సినిమా తెరకెక్కించేది ఎవరో తెలుసా?
Ibomma Ravi Biopic : టాలీవుడ్ లో పైరసీ కింగ్ ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బయోపిక్ తోరకెక్కబోతుందా? తెలుగు పరిశ్రమను పైరసీతో ఇబ్బంది పెట్టిన వ్యక్తి జీవితాన్ని టాలీవుడ్ తెరపైనే చూడబోతున్నామా? ఇంతకీ ఐబొమ్మ రవి బయోపిక్ తెరకెక్కించబోయేది ఎవరు?

టాలీవుడ్ పైరసీ భూతం
చాలా కాలంగా టాలీవుడ్ ను పైరసీ భూతంలా పట్టి పీడిస్తుంది. టాలీవుడ్ ప్రముఖులకు, పోలీసులకు నిద్రలేకుండా చేస్తోన్న ఐ బొమ్మ హెడ్ ఇమ్మడి రవి, రీసెంట్ గా అరెస్ట్ అయ్యాడు. ఇక ఐబొమ్మ కథ సమాప్తం అనుకున్నారు అంతా. ఈలోపు ఐబొమ్మ వన్ పేరుతో మరో సైట్ టాలీవుడ్ పై గుదిబండలా తాయరయ్యింది. ఇక అవన్నీ పక్కన పెడితే.. టాలీవుడ్ పెద్దలకు ఇన్నాళ్లు నిద్ర లేకుండా చేసిన.. ఐబొమ్మ రవి జీవితం ఆధారంగా తెలుగు తెరపై సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఐబొమ్మ రవి బయోపిక్ మూవీ
సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ సినిమాలు అందుబాటులో ఉంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించినట్లు ఆరోపణల నేపథ్యంలో.. సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారన కొనసాగుతున్న క్రమంలో.. ఐబొమ్మ రవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాహసం చేయబోతున్న యూబ్యూబర్
తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబర్‌గా పేరుపొందిన దొరసాయి తేజ, ఇమ్మడి రవి బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా పాకేసింది. ఈసినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐబొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరకు జరిగిన అరెస్టు వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇలాంటిసినిమా చేయడం అంటే అది సాహసమనే చెప్పాలి.
ఐబొమ్మ అభిమానులు ఏమంటున్నారంటే?
ఒక్కప్పుడు బయోపిక్స్‌ను మహానుభావులు, నాయకులు, ప్రఖ్యాత వ్యక్తుల ఆధారంగా మాత్రమే నిర్మించేవారు. కానీ గత కొన్నేళ్లుగా మోసాలు, క్రిమినల్ కేసులు, బ్యాంక్ స్కామ్‌లు, స్మగ్లింగ్ కుంభకోణాలు వంటి సంఘటనల ఆధారంగా కూడా బయోపిక్ సినిమాలు రావడం పెరిగింది. అందువల్ల ఐబొమ్మ రవి జీవితం కూడా సినిమా రూపంలో మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త హైలెట్ అవుతోంది. అయితే ఈ విషయంలో నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. “ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూపించాడని అతనిని సపోర్ట్ చేస్తాం అంటూనే, అదే వ్యక్తిపై తీసిన సినిమా థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఎవరైనా డబ్బులు ఇచ్చి చూడాలనుకుంటారా?” అని జనాలు అంటున్నారు. ఇక ప్రస్తుతం చర్చల వరకే ఉన్న ఈమూవీ .. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

