- Home
- Entertainment
- Sowcar Janaki Net Worth: షావుకారు జానకి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్, వేల కోట్లు.. ఒక్క ఇళ్లే 200 కోట్లకుపైగా
Sowcar Janaki Net Worth: షావుకారు జానకి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్, వేల కోట్లు.. ఒక్క ఇళ్లే 200 కోట్లకుపైగా
సీనియర్ నటి షావుకారు జానకి చనిపోయిన తర్వాత ఆమెకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయాలు షాకిస్తున్నాయి. ఆమె వేల కోట్ల ఆస్తులు సంపాదించిందట. ఒక్క ఇళ్లే రెండు వందల కోట్లకుపైగా విలువ చేస్తుందట.

షావుకారు జానకి ఆస్తులు
లెజెండరీ నటి షావుకారు జానకి హఠాన్మరణం చిత్ర పరిశ్రమ ని విషాదంలోకి నెట్టేసింది. ఆమె శ్వాస సంబంధించిత సమస్యలతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. దీంతో సౌత్ సినిమాలో విషాదం నెలకొంది. అయితే షావుకారు జానకికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. స్వయంగా జానకినే తాను ఎంత సంపాదించిందో తెలిపారు. వేల కోట్లు సంపాదించినట్టు వెల్లడించారు.
ఆస్తులన్నీ పోగొట్టిన భర్త
ఆర్థిక ఇబ్బందుల నుంచి కెరీర్‌ని ప్రారంభించింది జానకి. తాను సినిమాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలోనే ఇంట్లో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్తని ఒప్పించి ఇళ్లు గడవడం కోసం ఆమె నటిగా బిగ్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. `షావుకారు` చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకున్నారు. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాలుగా నటించారు. రాణించారు. ఈ క్రమంలో తాను బాగా ఆస్తులు సంపాదించారు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్టిమెంట్ పెట్టారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు. కొన్ని తన భర్త పేరుతోనూ రిజిస్టర్ చేయించారు. అయితే జానకి సంపాదించడంతో భర్త శంకరమంచి శ్రీనివాసులు జల్సాలకు అలవాటు పడ్డారు. జాబ్ వదిలేసి భార్య సంపాదనతో బతకడం స్టార్ట్ చేశారు. అప్పట్లో భారీగా డబ్బు రావడంతో తాను ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, తాగుడికి బానిసయ్యారు. ఈ క్రమంలో ఆస్తులన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి.
వేల కోట్ల ఆస్తులు సంపాదించిన షావుకారు జానకి
దీంతో ఇది సరిగా లేదని చెప్పి జానకి.. భర్తకి దూరంగా ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆస్తులన్నీ పోయాయి. అయినా భర్త బాగోగులు చూసుకున్నారు జానకి. అయితే తాను కొన్న ఆస్తులు, పోయిన ఆస్తుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జానకి స్పందించారు. తాను కొన్న ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే వాటి విలువ వందల కోట్లు కాదు, వేల కోట్లు ఉంటాయని చెప్పారు. అవన్నీ పోయాయని వెల్లడించారు. ఇప్పటికీ తాను కొంత దాచుకున్నానని, వాటిని తన పిల్లలకు ఇచ్చినట్టు చెప్పారు. ఒక్క రూపాయి కూడా అప్పులేదని వెల్లడించారు.
రెండువందల కోట్ల విలువ చేసే ఇళ్లు
జానకి చనిపోయేవరకు చెన్నైలోని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంట్లో ఉన్నారు. దాని విలువ రెండు వందల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. తొలి సినిమా పారితోషికం రూ.2500తో కెరీర్‌ని ప్రారంభించి వేల కోట్లకు ఎదిగారు. కానీ అన్నీ పోగొట్టుకున్నారు. అయితే వాటిలో సగం వరకు పొదుపు చేసుకున్నారట. అంటే ఇప్పటికీ ఆమె ఆస్తులు వందల కోట్లల్లో ఉంటాయని చెప్పొచ్చు. అంతేకాదు 1990లో చెన్నైలో ఆమె `కోకోనట్ గ్రోవ్` పేరుతో రెస్టారెంట్‌ని కూడా నిర్వహించారు. అప్పట్లో అది చాలా ఫేమస్ అని సమాచారం. అయితే ఆ తర్వాత అది ఉన్నదా లేదా అనే సమాచారం లేదు. కాకపోతే అందులో ఫుడ్ చాలా ఫేమస్ అని ఇప్పటికీ అంటుంటారు. మొత్తంగా షావుకారు జానకి వేల కోట్ల ఆస్తులు సంపాదించి, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను తమ పిల్లలకు ఇచ్చి వెళ్లిపోయారు.

