`భారతీయుడు 3` ఆగిపోయిందా? కమల్ హాసన్ సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి? అంతా ఆయనే కారణం?
Indian 3 Movie Release Update: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `భారతీయుడు 3` సినిమా విడుదల విషయంలో సరికొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ కావడం కష్టమా?

Indian 3 Movie, kamal haasan, shankar
Indian 3 Movie Release Update: భారీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `ఇండియన్` సినిమా 1996లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఆ సినిమా విజయం తర్వాత దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ విడుదల చేశారు. `భారతీయుడు 2` సినిమా గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ డిజాస్టర్‌గా నిలిచింది.

కమల్, శంకర్
`ఇండియన్ 2` సినిమా వల్ల ఆ సినిమాను నిర్మించిన లైకా సంస్థ భారీగా నష్టపోయింది. `భారతీయుడు 2` సినిమా షూటింగ్ సమయంలోనే దాని మూడవ భాగం కోసం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసేశాడు శంకర్. ఇంకా ఒక పాట సీన్ మాత్రమే మిగిలి ఉంది.
అది తీస్తే `ఇండియన్ 3` సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. కానీ ఈ సినిమా కోసం ఆ ఒక్క పాట సీన్ తీయడానికి 20 కోట్లకు పైగా అవుతుందని శంకర్ చెప్పాడంట. ఇది కాకుండా తనకు ఇవ్వాల్సిన మిగిలిన పారితోషికం కూడా ఇవ్వాలని లిస్ట్ ఇచ్చాడట.

ఇండియన్ 3 అప్డేట్
వరుస ఓటముల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న లైకా సంస్థ, తమకు ఇండియన్ 3 సినిమానే వద్దని చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకుందట. దీనివల్ల `ఇండియన్ 3` సినిమా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావడానికి ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి.
ప్రస్తుతం లైకా సంస్థకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా శంకర్ పారితోషికాన్ని సెటిల్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేసి దాన్ని విడుదల చేయడం అంత త్వరగా జరిగే అవకాశం లేదనే అంటున్నారు.

ఇండియన్ 3 ఆగిపోయిందా?
దీనివల్ల `భారతీయుడు 3` సినిమా ఆగిపోయే అవకాశం ఉందని ఒక సమాచారం వ్యాపిస్తోంది. కానీ చిత్ర బృందం దీని గురించి ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. `ఇండియన్ 3` సినిమాలో కమల్ హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటించారు. `ఇండియన్ 2` ప్రమోషన్ సమయంలోనే తనకు 2వ భాగం కంటే 3వ భాగం అంటేనే చాలా ఇష్టమని కమల్ చెప్పాడు. ప్రస్తుతం తనకు ఇష్టమైన ఆ 3వ భాగం విడుదల అవ్వడమే ప్రశ్నార్థకంగా మారింది.
ఆ మధ్య దీన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు విడుదల చేయడమే కష్టమనే కామెంట్ వినిపిస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్ `థగ్ లైఫ్` చిత్రంలో బిజీగా ఉన్నారు. మణిరత్నం దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
also read: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్ సాంగ్ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది

