- Home
- Entertainment
- రష్మిక, నయనతారలకు షాక్.. రెండేళ్లుగా సినిమాల్లేవ్ అయినా ఆమెనే నెం 1.. ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్
రష్మిక, నయనతారలకు షాక్.. రెండేళ్లుగా సినిమాల్లేవ్ అయినా ఆమెనే నెం 1.. ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్
India Top 10 Populer Heroines List: ఇండియన్ టాప్ 10 హీరోయిన్స్ జాబితా బయటకు వచ్చింది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన మోస్ట్ పాపులర్ హీరోయిన్లు ఎవరో తేలిపోయింది. ఇందులో రెండేళ్లుగా సినిమాల్లేని హీరోయిన్ టాప్‌లో ఉండటం విశేషం.

rashmika mandanna, samantha, nayanthara, telugu heroines
India Top 10 Populer Heroines List: ప్రముఖ రేటింగ్ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితా వచ్చింది. ఫిబ్రవరి నెలలో పాపులర్ టాప్ 10 హీరోయిన్లు ఎవరో లిస్ట్ విడుదల చేసింది.
ఇందులో అందరికి షాకిస్తూ సమంత మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లుగా సినిమాల్లేని సమంత ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్‌గా నిలవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకి సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ కారణంగా ఆమె వార్తల్లో నిలిచినట్టు తెలుస్తంది.
Alia Bhatt
ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, త్రిష, సాయి పల్లవి, నయనతారలకు బిగ్ షాక్ తగిలింది. గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న వీళ్లు టాప్ 2లో కూడా స్థానం సంపాదించలేకపోయారు. బాలీవుడ్ బ్యూటీ, `ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ అలియాభట్‌కి రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ సినిమాలతో అలరించడంతోపాటు సోషల్ మీడియాలో ప్రకటనలతో యాక్టింగ్‌గా ఉంది. దీంతో టాప్ 2 స్థానంలో అలియాభట్ నిలిచింది.
sai pallavi
ఇక మూడో స్థానంలో `కల్కి 2898 ఏడీ` హీరోయిన్ దీపికా పదుకొనె నిలవడం విశేషం. నాల్గో స్థానం సాయిపల్లవి దక్కింది. ఆమె `తండేల్` సినిమాతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఐదో స్థానం దక్కించుకుంది. అసలు సినిమాల్లేవ్, పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ కాజల్‌కి ఐదో స్థానం దక్కడం ఆశ్చర్యపరుస్తుంది.
Rashmika Mandanna
`పుష్ప 2`, `ఛావా` చిత్రాలతో వార్తల్లో నిలుస్తుంది రష్మిక మందన్నా. ఆమె సుమారు మూడు వేల కోట్ల బిజినెస్‌లో భాగమైంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో `సికందర్` చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతుంది. అయినా రష్మిక మందన్నా ఆరో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.
trisha, nayanthara
ఇటీవల అజిత్‌తో `పట్టుదల` సినిమాలో నటించిన త్రిష ఏడో స్థానంలో నిలిచింది. ఆమె త్వరలో అజిత్‌తోనే `గుడ్ బ్యాడ్ అగ్లీ`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఆమెతోపాటు నయనతార ఎనిమిదో స్థానం దక్కించుకుంది. సౌత్‌లో ఎప్పుడూ డిస్కషన్ పాయింట్‌గా నిలిచే నయన్ ఇంత తక్కువ రేటింగ్ సొంతం చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది.
Sreeleela
`కిసిక్కు` సాంగ్‌తో దుమారం రేపిన శ్రీలీలకి కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది.ఆమె తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక `ఘాతి` సినిమాతో త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న అనుష్క శెట్టి 10 స్థానంలో నిలవడం విశేషం. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇది ఇండియన్ టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్.