MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • BiggBoss Telugu 6: ఇనయ పారితోషికం లీక్‌.. 14 వారాలకుగానూ ఆమెకి దక్కిన మొత్తం ఎంతంటే?

BiggBoss Telugu 6: ఇనయ పారితోషికం లీక్‌.. 14 వారాలకుగానూ ఆమెకి దక్కిన మొత్తం ఎంతంటే?

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఇనయ సుల్తానా గత వారం అనూహ్యంగా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని వారాలకు గానూ ఆమె అందుకున్న పారితోషికం లీక్ అయ్యింది. ఆశ్చర్యపరుస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 15 2022, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్‌ తెలుగు 6 (Bigg boss 6 Telugu) షోలో బలమైన కంటెస్టెంట్‌గా నిలిచింది ఇనయ. ఆమె సైలెంట్‌గా తన కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచుకుంటూ వచ్చింది. పది వారాల తర్వాత ఒక్కసారిగా టాప్‌ లీగ్‌లోకి దూసుకొచ్చింది. బెస్ట్ కెప్టెన్‌గా, క్వీన్‌ ఆఫ్‌ ది హౌజ్‌గా నిలిచిన ఇనయ కానీ అనూహ్యంగా 14వ వారంలో ఎలిమినేట్‌ అయ్యింది. ఇనయ ఎలిమినేషన్‌ విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. అది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

26

అప్పటి వరకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న ఇనయ ఎలిమినేట్‌ కావడమేంటని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. బిగ్‌ బాస్‌ షోపైనే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పనుల వల్లే బిగ్‌ బాస్‌ పై అభిప్రాయం పోతుందని, కొందరిని సేవ్‌ చేయడం కోసం బలమైన వారిని పంపించడం దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోతున్నారు నెటిజన్లు. తీవ్ర స్థాయిలో బీబీ షోపై విమర్శలు చేస్తున్నారు. 

36

ఈ నేపథ్యంలో హౌజ్‌ గురించి, హౌజ్‌లోని సభ్యుల గురించి బయటకొచ్చిన ఇనయ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేవంత్‌తోపాటు ఇతర సభ్యుల గురించి షాకింగ్‌ కామెంట్లు చేసింది. రేవంత్‌ గురించి ఆమె చెప్పిన విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 
 

46

ఈ సందర్భంగా ఇనయ పారితోషికం కూడా హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్నందుకు ఇనయ తీసుకున్న రెమ్యూనరేషన్‌ డిటెయిల్స్ లీక్‌ అయ్యాయి. అవి వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఇనయ సుల్తానా 14 వారాలకుగానూ అందుకున్న పారితోషికం ఎంతనేది చర్చనీయాంశం అవుతుంది. అంత తక్కువనా అంటూ కామెంట్లు వస్తున్నాయి. 

56

బిగ్‌ బాస్‌ షోలో ఇనయ 14 వారాలు ఉన్న విసయం తెలిసిందే. మొత్తంగా ఆమె సుమారు 20లక్షలు పారితోషికంగా అందుకుందట. రోజుకి ఆమెకి ఇరవై వేలు ఇచ్చేవారని, వారానికి లక్షా నలభై వేలు అందుకోగా, 14 వారాలకు గానూ 1960000 పారితోషికంగా ఇనయ పుచ్చుకుందని తెలుస్తుంది. అయితే టాప్‌ టెన్‌ కంటెస్టెంట్లతో పోల్చితే ఇది చాలా తక్కువ అని అంటున్నారు. అంతకు ముందు ఎలిమినేట్‌ అయిన ఫైమా సైతం సుమారు 30లక్షలు పారితోషికం అందుకుంది. మిగిలన వారు కూడా ఇరవై లక్షలకుపైగా పారితోషికం సొంతం చేసుకున్నారు. కానీ ఇనయకి ఇరవై లక్షలకు లోపే రావడం గమనార్హం. 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

సోషల్‌ మీడియాతో పాపులర్‌ అయిన ఇనయ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ మధ్య రామ్‌గోపాల్‌ వర్మతో ఓ పార్టీలో పాల్గొని కలిసి చేసిన డాన్సు సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆ ఒక్క దెబ్బతో పాపులర్‌ అయిపోయింది ఇనయ. అదే బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం తెచ్చిందని టాక్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Recommended image3
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved