MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్ల హవా.. ఎక్కడా తగ్గట్లే.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటీమణులు.!

సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్ల హవా.. ఎక్కడా తగ్గట్లే.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటీమణులు.!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రమ్య కృష్ణ, మీనా, సిమ్రాన్, ఇంద్రజ,  ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. వీరితోపాటు మరింకొందరు హీరోయిన్లు  కూడా రీఎంట్రీ ఇవ్వడంతో వరుస చిత్రాలతో దుమ్ములేపుతున్నారు.  

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 14 2022, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

లేడీ సూపర్ స్టార్, ప్రముఖ నటి రమ్య కృష్ణ (Ramya Krishna) హీరోయిన్ గా 1983 నుంచే తెలుగు, తమిళం, కన్నడ,  మలయాళం చిత్రాల్లో నటించింది. దక్షిణాది ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకుంంది. మరోవైపు హిందీలోనూ ఆయా చిత్రాల్లో నటించింది. అయితే రమ్య కృష్ణ దూకుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ‘బాహుబలి’లో శివగామి పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. దూసుకుపోతోంది. ఇటీవల ‘లైగర్’తో అలరించింది. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’లో నటిస్తోంది.
 

28

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో వెలుగొందిన హీరోయిన్లలో సీనియర్ నటి మీనా (Meena) ఒకరు. ఫ్యామిలీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కీల క పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రంలో ఆకట్టుకుంది. అదేవిధంగా మోహన్ బాబు చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’లోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘రౌడీ బేబీ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
 

38

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) కూడా రీఎంట్రీతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. తెలుగులో చిత్రాలు చేయకపోయినా.. హిందీ, తమిళంలో వరుపెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల చియాన్ విక్రమ్ నటించిన ‘మహాన్’, మాధవ్ నటించిన ‘రాక్రెట్రీ’ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాలు లెగులోనూ డబ్ వెర్షన్ లో ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. తమిళంలో సిమ్రాన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో సిమ్రాన్ ‘కలిసుందాం రా, సమరసింహా రెడ్డి, మ్రుగరాజు, నర్సింహనాయుడు, సీతయ్య, ఒక్క మొగాడు’ వంటి ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది.
 

48

టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగొందిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ (Indraja) కూడా  వరుసపెట్టి చిత్రాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లోనే కాకుండా తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు, తమళ, మలయాళ చిత్రాలక్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం, స్టాండప్ రాహుల్, అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది.
 

58

అప్పట్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లలో నటి సంగీత (Sangeetha) కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘నవ్వుతూ బతకాలిరా, ఖడ్గం, పెళ్లా ఊరెళ్లితే, ఆయుధం, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి’ చిత్రాల్లో నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగులో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది ‘తెలంగాణ దేవుడు’లో నటించింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ఏకంగా గ్లామర్ స్టప్పులేసి ఆకట్టుకుంది.  ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ థళపతి ‘వారసడు’లో నటిస్తోంది. 
 

68

ఇప్పటికీ కుర్రహీరోయిన్లతో పోటీపడుతూ అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ ప్రియమణి (Priyamani). సౌత్ ఇండస్ట్రీలోనిి అన్ని భాషల చిత్రాల్లో నటించిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్ష్ లోనూ దూకుడుగానే వ్యవహరిస్తోంది. వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకుంటోంది. గతేడాది ‘నారప్ప’తో అలరించింది. మరోవైపు ‘భామాకాలాపం’తో  ఓటీటీలోనూ అడుపెట్టింది. ఇక ‘విరాటపర్వం’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, కన్నడ, తమిళంలో ఏకంగా ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. 

78

ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా ఎప్పుడో కేరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల జాబితాలోనే చేరిపోయింది హీరోయిన్ సదా (Sada). దాదాపు 20 ఏండ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతోంది. కొన్నేండ్లుగా సీని ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలు ఎంట్రీలివ్వడంతో సదా లాంటి వారికి కాస్తా కష్టకాలం వచ్చింది. దీంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ జోరు పెంచింది. ఇప్పటికే బుల్లితెరపై హంగామా చేసిన సదా.. ఇటీవల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం అవకాశాలను అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
 

88

టాలెంటెడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) కూడా రీ ఎంట్రీ తర్వాత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మలయాళ చిత్రం ‘మకల్’తో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు తెలుగులోనూ రామ్ పోతినేని సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ మీరా గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు హీరోయిన్ జెనెలియా (Genelia) కూడా తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి డెబ్యూ ఫిల్మ్స్ తో రీఎంట్రీ ఇవ్వబోతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
మీనా (నటి)
రమ్య కృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్ అంతే, మెగా బ్లాక్ బస్టర్ పక్కా ?
Recommended image2
రాజా సాబ్ నెగెటివ్ టాక్.. ప్రభాస్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్, సినిమాలో జరిగిన మార్పులివే..
Recommended image3
రవితేజ చేతిలో చిత్తైపోయిన బాలకృష్ణ సంక్రాంతి సినిమాలు.. అభిమానులకు పీడకల, అవేం సినిమాలు బాబోయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved