MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Impure Story: మహిళ కన్య కాదని తెలియడంతో పెళ్లి రద్దు చేసిన అత్తా మామలు.. ఇంప్యూర్‌ స్టోరీ లీక్‌

Impure Story: మహిళ కన్య కాదని తెలియడంతో పెళ్లి రద్దు చేసిన అత్తా మామలు.. ఇంప్యూర్‌ స్టోరీ లీక్‌

Impure Story: ఒక ఫ్యామిలీలో తనకు కాబోయే కోడలికి సంబంధించిన రహస్యం తెలుస్తుంది. తన కోడలు కన్య కాదని తెలుస్తుంది. దీంతో అత్తా మామలు ఏం చేశారనే కథాంశంతో `ఇంప్యూర్‌` మూవీ రూపొందిందని చెప్పారు నిర్మాత.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 30 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
కోడలు కన్య కాదని తెలిస్తే.. ఇంప్యూర్‌ స్టోరీ
Image Credit : Asianet News

కోడలు కన్య కాదని తెలిస్తే.. ఇంప్యూర్‌ స్టోరీ

`తమకు కాబోయే కోడలు కన్య కాదని తెలుస్తోంది. దీంతో అత్తమామలు ఏం చేశారనే కథాంశంతో రూపొందిన చిత్రమే `ఇంప్యూర్‌` అని చెప్పింది నిర్మాత, రైటర్‌ వారాహి మల్లిపామలు. ఆమె ‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన వారాహి పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె పెన్ స్టేట్ నుండి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో జీవనోపాధి కోసం ఆమె టెక్ రంగంలో పనిచేశారు. కానీ తన సినిమా కలలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. ఆమె ఆరు సంవత్సరాల క్రితం, పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రులు, వీకెండ్స్‌లో స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారు.

'మా ఇంటి బంగారం' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ‘ఇంప్యూర్’తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ‘వారాహి’ని తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరచుగా తెలుగు పాత్రలకు ఉత్తర భారత మహిళలనే తీసుకుంటుంది. మహిళా ప్రాధాన్య చిత్రాలను అమ్మడం చాలా కష్టం. అందుకే వారహి ప్రధాన పాత్రలో తెలుగు మహిళ అయిన యషా ముత్తులూరిని తీసుకున్నారు.

ఇక ‘ఇంప్యూర్’ చిత్ర విశేషాల గురించి వారాహి మల్లిపాముల మాట్లాడుతూ..‘నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి మా అమ్మ చాలా ఖర్చు పెట్టారు. అందుకే ఆ డబ్బును సినిమాలో పెట్టాలనుకుంటే ఇస్తానని చెప్పారు. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించాను. కానీ ఆ డబ్బుతో ఒక పూర్తి సినిమా తీయలేకపోయాను. మేము ఇంకా చాలా అప్పు చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి నేను న్యూయార్క్ నుండి వచ్చాను` అని చెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
సమంతనే ఆ అపోహ తొలగించింది
Image Credit : Asianet News

సమంతనే ఆ అపోహ తొలగించింది

నాకు చిన్నప్పటి నుంచే సినిమాపై బలమైన నమ్మకం ఉంది. కానీ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని నిర్మించేలా నిర్మాతలను ఒప్పించడం అంత సులభం కాదు. నేను రాసిన స్క్రిప్ట్‌ని ఎంతో మంది నిర్మాతలకు వినిపించాను. చాలామంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. చివరికి సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించి మహిళా ప్రాధాన్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదరించవచ్చని నిరూపించారు. థియేటర్లలో 'ఇంప్యూర్' చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేయడానికి వారే నాకు స్ఫూర్తినిచ్చారు."

మా సినిమా కోసం రాజా కుమారి, కరణ్ పాండవ్‌లతో కలిసి పాటలు స్వరపరిచారు. వారిద్దరూ గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన కళాకారులు. 'ఓఎమ్‌జి' పాటలోని హుక్ స్టెప్‌ను ప్రజలు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది బాగా ప్రాచుర్యం పొందుతుందని ఆశిస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. మా సినిమా స్థాయిని పెంచారు. రక్తపాతంతో నిండిపోయిన చిత్రాల నుంచి మా ఇండిపెండెంట్ చిత్రాన్ని కాస్త భిన్నంగా చూడమని ప్రజలను కోరుతున్నాను. మా చిత్రం స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. సాయి కృష్ణ అద్భుతంగా నటించాడు. 'ఇంప్యూర్' అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలానే 'ఇంప్యూర్' సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో విడుదలవుతోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Wamiqa Gabbi Mumbai Home: ఒకప్పుడు నేలపై పడుకున్న వామికా గబ్బి.. ఇప్పుడు ఆమె ఇల్లు ఎలా ఉందో చూశారా?
Recommended image2
Amala Paul: ఇక అలాంటి అశ్లీల సీన్లలో అస్సలు నటించను..ఇమేజ్ డ్యామేజ్, గతాన్ని గుర్తు చేసుకున్న అమలాపాల్
Recommended image3
Aishwarya Rai: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టిన ఐశ్వర్య రాయ్, బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ అదుర్స్
Related Stories
Recommended image1
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Recommended image2
Mohan babu: ఆ పనిచేస్తే నేను రోడ్డుపై అడుక్కుతినే వాడిని.. మోహన్‌ బాబు చెప్పిన జీవిత సత్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved