- Home
- Entertainment
- వర్షకు ఇమ్మానియేల్ ఖరీదైన బర్త్ డే గిఫ్ట్... బంగారు దుకాణానికి తీసుకెళ్లి హారం కొనిచ్చిన జబర్దస్త్ కమెడియన్
వర్షకు ఇమ్మానియేల్ ఖరీదైన బర్త్ డే గిఫ్ట్... బంగారు దుకాణానికి తీసుకెళ్లి హారం కొనిచ్చిన జబర్దస్త్ కమెడియన్
ఇమ్మానియల్ తన ప్రేయసి వర్షకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలో వర్ష భర్త డే కాగా సర్పైజ్ చేశాడు. ఇమ్మానియేల్ గిఫ్ట్ కి వర్ష ఫిదా అయిపోయింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.

Jabardasth Varsha
రోజురోజుకు ఇమ్మానియేల్ - వర్షల మధ్య ప్రేమ ముదురుతోందనిపిస్తుంది. మొన్న షోలో ఆమె మెడలో ఏకంగా తాళి కట్టాడు. జబర్దస్త్ షో జడ్జిగా వచ్చిన పోసాని మీ ఇద్దరి మధ్య ఏముందని అడిగాడు. అది వర్షనే చెప్పాలని ఇమ్మానియేల్ అన్నాడు. ఏదైనా కానీ ప్రేమలో నీ నిజాయితీ నచ్చిందని పోసాని ఇమ్మానియేల్ ని మెచ్చుకున్నాడు.
వర్ష ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే మెడలో తాళికడతాను అన్నాడు ఇమ్మానియేల్. ఆ మాటకు గెటప్ శ్రీను వెంటనే తాళి తీసుకొచ్చాడు. వర్ష మెడలో ఇమ్మానియల్ తాళి కట్టాడు. వర్ష ముఖంలో నవ్వులు చిందాయి. ఆమె వద్దని ప్రతిఘటించకపోవడం విశేషం.
Jabardasth Varsha
తాజాగా ఇమ్మానియేల్ వర్షకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. పంజాగుట్టలోని నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన హారం కొనిపెట్టాడు. ఇమ్మానియేల్ ఇచ్చిన గిఫ్ట్ కి వర్ష ఫిదా అయ్యింది. తనకు ఎంతగానో నచ్చినట్లు చెప్పింది. త్వరలో వర్ష బర్త్ డే కాగా ఇలా సర్ప్రైజ్ చేశాడట.
Jabardasth Varsha
పనిలో పనిగా ఇమ్మడి అనే సిల్వర్ గోల్డ్ షాప్ ని ఇమ్మానియేల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేశాడు. వర్ష, ఇమ్మానియేల్ షాప్ అంతా తిరిగి కలెక్షన్ గురించి వివరించారు. ఇది ప్రమోషనల్ వీడియో అని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇమ్మానియేల్ వర్షకు జ్యుయలరీ గిఫ్ట్ గా ఇచ్చాడా లేదా అనేది మాత్రం సస్పెన్సు.
Jabardasth Varsha
గత రెండేళ్లుగా బుల్లితెరపై వర్ష-ఇమ్మానియేల్ వీరవిహారం చేస్తున్నారు. తమని తాము లవర్స్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళిద్దరి కెరీర్ కి ప్లస్ అయ్యింది. కామెడీ స్కిట్స్, షోస్ లో ఇమ్మానియేల్ వర్ష రొమాన్స్, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.
Jabardasth Varsha
ముఖ్యంగా వర్ష ఇమ్మానియేల్ పై వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. ఇమ్మానియేల్ నా అదృష్టం అని చెప్పుకునే వర్ష, జీవితంలో అతన్ని వదిలేది లేదు అంటుంది. ఒక సందర్భంలో పెళ్లి నీతోనే వెళ్లి అత్తమ్మ కు చెప్పు నేను వస్తున్నానని వర్ష చెప్పారు. వాళ్ళ మనస్సులో ఏమైనా ఉండనీ ప్రేమికులు అన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.