- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో ఇడ్లీ బాబాయ్ చంపేస్తానని విశ్వక్ బెదిరిస్తాడు. అమూల్యను ఎలాగైనా తన దగ్గరకు తీసుకురావాలని భాగ్యాన్ని బెదిరిస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

విశ్వక్ బెదిరింపులు
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ, ధీరజ్ కలిసి అమూల్య పెళ్లికి శుభలేఖలను ఆర్డర్ ఇచ్చి వస్తారు. ప్రేమ వెనక్కి వెళ్లి తన పేరుతో అచ్చువేసిన శుభలేఖను అడిగి తెచ్చుకుంటుంది. ఇక భాగ్యం, ఇడ్లీ బాబాయిని ఎవరు ఎత్తుకెళ్లారు? అని గాభరా పడుతూ ఉంటుంది. ఈ లోపు విశ్వక్.. భాగ్యానికి ఫోన్ చేస్తాడు. ‘మీ ఆయనను కిడ్నాప్ చేసింది నేనే’ అని చెబుతాడు విశ్వక్. అది విని భాగ్యం షాక్ అవుతుంది. ‘నిశ్చితార్థం చెడగొట్టమంటే చెడగొట్టలేకపోయారు. తెల్లారితే అమూల్య పెళ్లి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ రాత్రికల్లా అమూల్యను నా దగ్గరికి తీసుకురావాలి. లేకుంటే ఇడ్లీని మర్చిపో’ అని చెబుతాడు. అమూల్యను నా దగ్గరికి తీసుకొస్తే ఇడ్లీని వదిలి పెడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో భాగ్యం ఏం చేయాలని ఆలోచిస్తూ వల్లికి ఫోన్ చేస్తుంది.
భాగ్యం మాట్లాడుతూ ‘విశ్వక్ మీ నాన్నను కిడ్నాప్ చేశాడు. అమూల్యను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే మీ నాన్నను విడిచి పెడతానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అని ఏడుస్తుంది. అప్పుడు వల్లి ‘ఆ బండోడితో పెట్టుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసుకో’ అని ఫోన్ కట్ చేస్తుంది. ఒకవైపు తాను దొరికిపోతానేమోనని భయపడుతూ ఉంటే మరొక టెన్షన్ వచ్చి పడిందని ఏడుస్తూ ఉంటుంది.
ధీరజ్ కు క్లాసు పీకిన నర్మద
ఇక్కడ నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ తన పేరు మీద, ధీరజ్ పేరు మీద అచ్చు వేసిన శుభలేఖను చూసి మురిసిపోతూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఒక అందమైన పాటను వేస్తారు. ధీరజ్ తో ప్రేమ మాట్లాడుతూ ‘ఎదురెదురు ఇళ్లల్లోనే ఉండే వాళ్ళం. నేను అందంగా ఉంటాను. బావా మరదళ్లం కూడా అవుతాము. నన్ను ఎందుకు ప్రేమించలేదు. ప్రేమించి ఉంటే మనకి ఇలా శుభలేఖలు వేసి పెళ్లి చేసేవారు కదా. ఆరోజు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్పు’ అని అంటుంది. ధీరజ్ కూడా ఒకసారి ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇది ఇద్దరూ మళ్లీ కాసేపు గొడవలు పడతారు. కాసేపు పాటలు వేసి నడిపిస్తాడు డైరెక్టర్.
ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద ప్రేమ బాధగా కూర్చోవడం చూస్తుంది. ధీరజ్ ను పిలిచి ‘ప్రేమ ఏది? నీ భార్య గురించి నీకు తెలియక పోవడం ఏంటి? ఈరోజు హల్దీ, సంగీత్ లు ఉన్నాయి. ప్రేమ వారం రోజులుగా ఎంత కష్టపడుతుందో తెలుసు కదా. పెళ్లి పనులు ఆలస్యం చేయకుండా ఎంత ఓపిగ్గా చేస్తుంది. కానీ నువ్వు ప్రేమను ఎందుకు దూరం పెడుతున్నావ్? మనిషిలాగా చిన్నచిన్న తప్పులు చేస్తారు. వాటిని మనసులో పెట్టుకోకూడదు. నీ జీవితంలో నువ్వు ఏ తప్పు చేయలేదా? ప్రేమ తను చేసిన తప్పుకు ఎప్పుడో క్షమాపణ చెప్పేసింది. పెళ్లిలో అందరూ తమ తమ భర్తలతో ఆనందంగా ఉంటే తను మాత్రం ఒంటరిగా బాధపడాలా? జరుగుతున్న వేడుకలో విడివిడిగా ఉండడం మంచిది కాదు’ అని నచ్చచెబుతుంది నర్మద.
ప్రేమకు సారీ చెప్పిన ధీరజ్
నర్మద చెప్పిన మాటలు విని ధీరజ్ కూడా కొంచెం మారుతాడు. ఒంటరిగా కూర్చున్న ప్రేమ దగ్గరకు వెళ్లి కాఫీ తాగలేదా అని అడుగుతాడు. ప్రేమ మాట్లాడుతూ ‘మతిమరుపు ఉందా ఏంటి? నాతో మాట్లాడేస్తున్నావు. నాకు కాఫీ తాగాలనిపించలేదు. మనసు బాగోలేదు’ అని చెబుతుంది. దానికి ధీరజ్ మరింతగా బాధపెట్టేలా మాట్లాడుతాడు. దీంతో ప్రేమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ప్రేమ దగ్గరకు వెళ్లి మరీ ధీరజ్ సారీ చెబుతాడు. ‘నాతో మాట్లాడాలని నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మాట్లాడలేదు. నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా పట్టించుకోలేదు. ఏదో తెలియని కోపం. తప్పు నాదే. నీ మీద నాకు పర్సనల్ గా ఏ కోపం లేదు. కానీ నువ్వు ఆరోజు మా చెల్లెలు విషయంలో అలా మాట్లాడడం తట్టుకోలేకపోయాను. నువ్వు అలా మాట్లాడతావని అనుకోలేదు. అయినా జరిగింది తలుచుకుంటూ ఇలా కంటిన్యూ చేయడం నాదే తప్పు. సారీ’ అని చెబుతాడు ధీరజ్. అప్పుడు ప్రేమ నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెబుతుంది. దాంతో ధీరజ్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. మళ్లీ సారీ చెబుతాడు. ధీరజ్ సారీ పదే పదే చెప్పడం చూసి ప్రేమ చాలా ఆనందపడుతుంది. కానీ ధీరజ్ ముందు మాత్రం కోపం నటిస్తుంది.
హల్దీ మొదలు
ఇక హల్దీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. కామాక్షి మాట్లాడుతూ పెళ్లి పనులన్నీ నాచేతే చేయిస్తున్నావు కానీ పెద్ద కూతురికి రవ్వల నక్లెస్ కొనాలని కూడా లేదు అని అంటుంది. దానికి వేదవతి పసుపు రాసి పువ్వులు కట్టగానే రవ్వల నెక్లెస్ కావాలా? ఇంకోసారి అడిగావంటే మీ అత్తారింటికి పంపించేస్తాను జాగ్రత్త అని అంటుంది. మరోవైపు వల్లి మాత్రం ఏం చేయాలని ఇటూ అటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు ప్రేమ, నర్మద చక్కగా తయారై పెళ్లిలో పసుపు దంచుతూ ఉంటారు. అది చూసి వల్లి...తన తోడికోడలిద్దరూ సంతోషంగా ఉంటే నేను మాత్రం మా నాన్నకి ఏమవుతుందో అని టెన్షన్ పడాల్సి వస్తుంది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపు ప్రేమ.. వల్లి అటూ ఇటూ ఆలోచిస్తూ తిరగడం చూస్తుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

