- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 21: లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు అమూల్య విశ్వక్ ప్లాన్
Illu Illalu Pillalu Today Episode Jan 21: లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు అమూల్య విశ్వక్ ప్లాన్
Illu Illalu Pillalu Today Episode Jan 21: అమూల్య నిశ్చితార్థం అయిపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. విశ్వక్ లేచిపోయి పెళ్లి చేసుకుందామని అమూల్యను ఒప్పిస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

విశ్వక్ భారీ ప్లాన్
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ గ్లాసులతో ఒక ఆట ఆడుతారు. కాసేపు ఇద్దరూ సరదాగా గొడవలు పడతారు. వీరిద్దరి గొడవలే ఈరోజు ఎపిసోడ్ లో సగం కనిపిస్తాయి. కాసేపు వీరిద్దరి మీద ఒక ప్రేమ సాంగ్ వేస్తారు. మీరు ప్రేమలో మునిగి తేలుతుండగా తిరుపతి బయటకు వచ్చి వీరిని చూస్తాడు. వారిని చూసి ఏం చేస్తున్నార్రా, దయచేసి గదిలోకి వెళ్లి తలుపేసుకోండి అంటాడు తిరుపతి. దీంతో ప్రేమ గదిలోకి వెళ్ళిపోతుంది.
ఇక ఇక్కడ నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ ని చూస్తూ అమూల్య బాధపడుతుంది. అలాగే ఆ నిశ్చితార్థాన్ని కూడా గుర్తు చేసుకుని ఏడుస్తుంది. వనజ పెళ్లిచూపులు అయ్యాక మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఈ లోపు విశ్వక్, అమూల్యకు ఫోన్ చేస్తాడు. అమూల్య మాట్లాడుతూ ‘నిశ్చితార్థం అయిపోయింది విశ్వ. ఇక నా జీవితం..’ అని ఏడుస్తూ ఉంటుంది. ‘నిశ్చితార్థం మాత్రమే.. పెళ్లి కాదు.. నువ్వు నా ప్రాణం. మీ వాళ్ళు మా వాళ్ళు నువ్వు, చివరికి ఆ దేవుడు చెప్పినా సరే నిన్ను నేను వదులుకోను. అంతగా వదులుకోవాల్సి వస్తే నా ప్రాణాలే వదిలేస్తాను. చావనైనా చస్తాను కానీ నువ్వు లేకుండా నీ ప్రేమ లేకుండా నేను బతకలేను. నువ్వు ధైర్యంగా ఉండు. మనం రేపు రాత్రి లేచిపోయి ఎక్కడైనా పెళ్లి చేసుకుందాం. మనకి వేరే మార్గం లేదు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం’ అని అంటాడు.
పెళ్లికి అమూల్య ఓకే?
దానికి అమూల్య మాట్లాడుతూ నేను అలా చేయలేను, మా అమ్మా నాన్నలకి మొఖం చూపించలేను అని ఏడుస్తుంది. అయితే విశ్వ మాట్లాడుతూ మీ అన్నయ్య చేసింది? మా చెల్లెలు చేసింది ఏంటి? వాళ్ళు హ్యాపీగా లేరా? నాలుగు రోజులు మీ నాన్న బాధపడతాడని... నూరేళ్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని అమూల్యకు బాగా బ్రెయిన్ వాష్ చేస్తాడు. అమూల్యను పెళ్లి కోసం చాలా ఒప్పిస్తాడు. మొదట్లో అందరూ కోపంగా ఉన్న తర్వాత అన్ని సర్దుకుంటాయి అని చెబుతాడు. అమూల్యను తీయటి మాటలతో, ప్రేమతో నిండిన కబుర్లతో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు.
అమూల్య మాట్లాడుతూ ఉంటే ఈ లోపు వేదవతి వచ్చేస్తుంది. దీనితో అమూల్య ఫోన్ పెట్టేస్తుంది. అమూల్య చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ కింద పడిపోతుంది. అది వేదవతి చూసి తీస్తుంది. వేదవతి మాట్లాడుతూ ఏంటిది కింద ఎందుకు పడేసావ్? అని అడుగుతుంది. దానికి అమూల్య నేను పడేయలేదు, జారి పడిపోయింది అని చెబుతుంది. ఆ రింగ్ తీసుకొని తల్లి ముందే వేలికి పెట్టేసుకుంటుంది. భోజనానికి రమ్మని పిలిస్తే అమూల్య తనకొద్దని, ఆకలిగా లేదని చెబుతుంది. దీంతో వేదవతి ‘రోజూ కాసేపు ఆగమన్నా ఆగవు... కానీ ఈరోజు ఆకలిగా లేదంటున్నవ్. ఏంటి ఏదైనా సమస్యా?’ అని అడుగుతుంది. దానికి అమూల్య ఏమీ లేదని చెప్పేస్తుంది. దీంతో వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వేదవతి అనుమానం
వేదవతి రామరాజుతో మాట్లాడుతూ ‘మీ చిన్న కూతురుకి పెళ్లి ఇష్టం లేదు. భోజనం వద్దంటుంది. అడిగితే ఆకలి లేదంటుంది. ఎంగేజ్మెంట్ రింగ్ చూస్తూ ఆలోచిస్తుంది’ అని చెబుతుంది వేదవతి. అమూల్య ఏ పక్క నుంచి ఏ ప్రమాదం తెచ్చి పెడుతుందో అని భయంగా ఉందని అంటుంది.దాంతో రామరాజు ‘మన కూతురి గురించి మనం అలా మాట్లాడొచ్చా? కని పెంచిన తల్లివి.. నీకు తెలియదా దాని మనస్తత్వం ఏమిటో? నా మాటను నన్ను కాదని ఒక అడుగు కూడా ముందుకు వేయదు. నా పరువు తీసే పని అస్సలు చెయ్యదు’ అని చాలా నమ్మకంగా చెబుతాడు రామరాజు.
అమూల్య ఏడుస్తూ పడుకుంటుంది రామరాజు వేదవతి అన్నం కలిపి ప్లేట్లో పట్టుకొని వస్తారు. అమూల్యతో మాట్లాడుతూ ‘ఆకలి లేదని చెప్పావా? తప్పు కదా’ అంటూ ప్రేమగా కూతురికి అన్నం తినిపిస్తాడు రామరాజు. ‘నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మతో నేను అనాధగా భూమి మీదకి వచ్చాను. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు పుట్టబోయేది మా అమ్మే అని చెప్పాను.ఆ ఒక్క మాట మీ అమ్మ ఆ రోజు నుంచి కడుపులో ఉన్న నిన్ను మా అమ్మ అనుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంది. నువ్వు పుట్టే సమయంలో డాక్టరు బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పారు. మీ అమ్మ ప్రాణాలకు తెగించి నీకు జన్మనిచ్చింది. ఇదంతా నీకెందుకు చెబుతున్నానంటే.. ఆ రోజు ప్రాణాలు పణంగా పెట్టి నిన్ను కన్న నీ తల్లి ఈరోజు ఈ నాన్న పరువు తీయడానికి నువ్వు అడ్డం తిరుగుతావేమోనని భయపడుతోంది. నాకు మాత్రం నా కూతురు మీద అస్సలు అనుమానం లేదు. మీ నాన్న పరువు ఈ ఇంటి పరువు పోయేలా నువ్వు చేయవని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని అంటాడు రామరాజు. దీంతో అమూల్య ఏడుస్తూ రామరాజుని పట్టుకుంటుంది.
ఎమోషనల్ సీన్
ఇదంతా వేదవతితోపాటు ప్రేమ, నర్మదా కూడా చూస్తూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తండ్రి కూతుళ్ళ పాటను వేసి ఈ సీను ఎమోషనల్ గా మార్చేశాడు డైరెక్టర్. ఇక అమూల్య తిన్న తర్వాత చివరి ముద్దను కూతురికి దిష్టి తీసి పారేస్తాడు రామరాజు. ఇక్కడి నుంచి సీన్ మళ్ళీ అమూల్య ఒంటరిగా కూర్చున్న దగ్గరికి మారుతుంది. మెట్లపై కూర్చుని ఏం చేయాలా అని అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది. ఒకపక్క విశ్వక్, మరొక పక్కా తండ్రి ప్రేమ గుర్తొస్తాయి. అక్కడికి నర్మద, ప్రేమ, వల్లితో పాటు వారి భర్తలంతా వచ్చి అమూల్య చుట్టూ కూర్చుంటారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

