MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu: బ్యాంకులో డబ్బులు లేవు.. సాగర్ ని ఇరికించేసిన వల్లీ, నర్మద కాపాడుతుందా?

Illu Illalu Pillalu: బ్యాంకులో డబ్బులు లేవు.. సాగర్ ని ఇరికించేసిన వల్లీ, నర్మద కాపాడుతుందా?

Illu Illalu Pillalu: సాగర్ ఉద్యోగం కోసం చేసిన తప్పు నర్మదకు తెలిసిపోయింది. మరి, ఈ సమస్య నుంచి సాగర్ ని ఎలా బయటపడేస్తుందో, వల్లి కుట్ర నుంచి ఎలా బయటపడతారో నేటి ఎపిసోడ్ లో చూద్దాం... 

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2026, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధీరజ్ కారుకి యాక్సిడెంట్...
Image Credit : Jio Hotstar

ధీరజ్ కారుకి యాక్సిడెంట్...

అమూల్య మెడలో తాళి ఎందుకు వేసుకుంది? దాని వెనక ఎవరు ఉన్నారు? అనే విషయం తెలుసుకోవాలని వల్లి అనుకుంటుంది. మెల్లగా అమూల్య దగ్గరకు వెళ్లి ఆరా తీయడం మొదలుపెడుతుంది. అది చూసిన ప్రేమ.. వల్లిపై సీరియస్ అవుతుంది. దీంతో.. వల్లి అక్కడి నుంచి జారుకుంటుంది. తర్వాత అమూల్యను.. విశ్వ నుంచి జాగ్రత్తగా ఉండమని... వాడు ఏవేవో కుట్రలు చేస్తూ ఉంటాడని ప్రేమ జాగ్రత్తలు చెబుతుంది. ఈలోగా.. ధీరజ్ ఫోన్ వచ్చి కంగారుపడుతుంటే.. ప్రేమ వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. ధీరజ్ వాళ్ల ఫ్రెండ్స్ కారు తీసుకువెళ్లి.. చెట్టుకు ఢీ కొట్టారని, ఓనర్ ఫోన్ చేసి తిడతుతున్నారని ధీరజ్ చెబుతాడు. ధీరజ్ కంగారుగా వెళ్తుంటే.. ప్రేమ తాను కూడా వస్తాను అని వెళ్లి బైక్ ఎక్కుతుంది.ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

24
సాగర్ ని ఇరికించేసిన వల్లీ..
Image Credit : Jio Hotstar

సాగర్ ని ఇరికించేసిన వల్లీ..

మరోవైపు, రామరాజుకి పెద్ద కొడుకు రైస్ మిల్లు లెక్కలు తండ్రికి చూపిస్తూ ఉంటాడు. రూ.2వేలు లెక్క తేడా వస్తోందని తండ్రికి చెబుతాడు. అయితే.. ఆ డబ్బులు వల్లి వాళ్ల నాన్న ఇడ్లీ తీస్తాడు. దానిని ఎలా కవర్ చేయాలా అని దూరం నుంచే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో వల్లి ఇంట్లోకి వస్తుంటే.. పిలిచి.. వాళ్ల ఆయన చేస్తున్న పని చూపిస్తారు. తనకు ఇంత నిజాయితీ ఉన్న భర్త దొరికాడు అని వల్లి తలబాదుకుంటూ ఉంటుంది. అంతలో.. వేదవతి వచ్చి.. భర్తను భోజనం చేయమని అడుగుతుంది. కానీ.. రైస్ మిల్లు లెక్కల్లో తేడా వచ్చిందని.. చూస్తున్నాను అని ఆగమని చెబుతాడు. ఇంతలో.. భాగ్యం ఒక ఐడియా ఆలోచిస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి సాగర్ ని ఇరికించేస్తుంది.

‘ అన్నయ్యగారు.. బ్యాంకులు తెరిచే ఉంటారు కదా’ అని అడుగుతుంది. ‘ తెరిచే ఉంటారు’ అని రామరాజు అంటే.. ‘ నిన్న వనజ వచ్చి రూ.20లక్షల కోసం రచ్చ చేసి వెళ్లింది కదా.. దేవుడు లాంటి మిమ్మల్ని పట్టుకొని.. డబ్బులు కొట్టేయాలని చూశారని ఎంత నీచంగా మాట్లాడిందండి. అందుకే..బ్యాంకు నుంచి ఆవిడ డబ్బులు తెచ్చి.. ఆవిడ ముఖాన కొట్టేస్తే ఓ సమస్య తీరిపోతుంది కదా. అందుకే మీకు గుర్తు చేశాను’ అని రామరాజుతో చెబుతుంది. ‘ గుర్తు చేసి మంచి పని చేశావు.. సాగర్ ని వెళ్లి డబ్బులు తెమ్మని చెప్పు’ అని వేదవతితో రామరాజు అంటాడు. ‘ బ్యాంక్ కి వెళ్లి డబ్బులు తెచ్చి ఆమెకు ఇస్తాను అని.. నడిపోడు రాత్రే చెప్పాడు.. ఇచ్చేస్తాడు లేండి.. మీరు బ్రేక్ ఫాస్ట్ చేద్దురు కానీ రండి’ అని వేదవతి పిలుస్తుంది. రామరాజు లేచి వెళ్తుంటే.. వల్లి ఆపి.. మళ్లీ రామరాజుని రెచ్చగొడుతుంది. ‘ కొత్త ఉద్యోగం మాయలో పడి.. సాగర్ మరిదిగారు మొన్న మీరు చెప్పిన పని మర్చిపోయారు.. దాని వల్ల వనజ ఇంటికి వచ్చి గొడవ చేసింది.. దారుణంగా మీ పరువు తీసేసింది. ఇప్పుడు కూడా సాగర్ మరిది గారు కొత్త ఉద్యోగం మోజులో పడి.. ఆమెకు డబ్బులు ఇవ్వడం మర్చిపోతారేమో, పైగా రూ.20లక్షలు పెద్ద ఎమౌంట్ కదా.. సాగర్ కాకుండా.. మీరు మీ పెద్ద అబ్బాయితో వెళ్లి.. ఆ డబ్బులు తీసుకొని రండి’ అని చెబుతుంది.

దీంతో.. రామరాజు సాగర్ ని పిలవమని చెబుతాడు. వేదవతిని పిలిస్తే.. వల్లి వెళ్లి పిలుస్తుంది. ఇక.. సాగర్, నర్మద ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన సాగర్ ని.. పాస్ బుక్ ఇవ్వమని రామరాజు అడుగుతాడు. ఆ పాస్ బుక్ ఇస్తే.. తానే వెళ్లి ఆ డబ్బులు తెస్తాను అని రామరాజు అంటాడు. సాగర్ నేను తెస్తాను అని చెప్పినా రామరాజు వినడు.దీంతో.. సాగర్ ఏం చేయాలో తెలియక నీళ్లు నములుతూ నిలపడతాడు. అది చూసిన వల్లీ.. ‘ పాస్ బుక్ తెమ్మంటే సాగర్ మరిది గారు నీళ్లు నములుతూ నిలపడ్డారు.. కొంపతీసి బ్యాంక్ లో డబ్బులు లేవా ఏంటి?’ అని వల్లి అడుగుతుంది. వేదవతి కంగారు అడుగుతుంది. అయినా సాగర్ నోరు మెదపడు. దీంతో.. వల్లి మళ్లీ.. కావాలని రామరాజుని రెచ్చ గొడుతుంది. రామరాజు ఆవేశంగా పైకి లేవడంతో సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 20: భర్త చెంప పగలగొట్టిన నర్మద, భార్య కాళ్లు పట్టుకున్న సాగర్
Related image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
34
నగలు అమ్మడానికి రెడీ అయిన నర్మద..
Image Credit : Jio Hotstar

నగలు అమ్మడానికి రెడీ అయిన నర్మద..

దీంతో.... సాగర్ చెయ్యి పట్టుకొని నర్మద సపోర్ట్ గా నిలపడుతుంది. ‘ మామయ్య గారు.. మీరు ఆయనకు ఈ పని అప్పగించారు. కాసేపట్లో ఆయన బ్యాంక్ కి వెళ్లి.. ఆ డబ్బులు తెచ్చి వనజ గారికి ఇచ్చేస్తారు’ అని నర్మద స్ట్రాంగ్ గా చెబుతుంది. ‘ అది కాదమ్మాయి.. అన్నయ్యగారు, మా అల్లుడు గారు బ్యాంక్ కి వెళ్లి డబ్బులు తెస్తారు. మీరు పాస్ బుక్ తెచ్చి ఇస్తే చాలు’ అని భాగ్యం, వల్లి అంటారు. కానీ.. నర్మద ఊరుకోదు. వాళ్లపై సీరియస్ అవుతుంది. తర్వాత రామరాజుకి నచ్చ చెబుతుంది. ‘ మీ అబ్బాయి మీకు తెలియకుండా ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా అని, డబ్బుల విషయంలో కూడా మోసం చేస్తాడని మీకు అనుమానం ఉందా? అలా ఉంటే.. ఇప్పుడే పాస్ బుక్ తెచ్చి ఇస్తాను’ అని నర్మద అంటుంది. దీంతో.. తమకు నమ్మకం ఉందని.. డబ్బులు తెచ్చి ఇవ్వమని రామరాజు చెబుతాడు.

ఇక.. నర్మదను పక్కకు పిలిచి, సాగర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు అని అడుగుతుంది. కొత్త ఉద్యోగం కదా అందుకే కంగారుపడుతున్నాడు అని నర్మద చెబుతుంది. ‘ నేను ఇంకా ఆ డబ్బులు లేవేమో.. అందుకే కంగారు పడుతున్నాడేమో అనుకున్నాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది’ అని వేదవతి అంటుంది. మరోవైపు... ఈ డబ్బుల విషయంలో సాగర్ పై వల్లికి డౌట్ వస్తుంది. సాగర్ బ్యాంక్ కి వెళితే.. వెనకే ఫాలో అయ్యి.. ఈ విషయం బయటపెడతాను అని ఇడ్లీ అంటాడు.

ఇక.. గదిలో సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే నర్మద లోపలికి రావడం చూసి.. మాటలతో కవర్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. కానీ... నర్మద సాగర్ మీద చిరాకుపడుతుంది. ఒక తప్పు చేస్తే.. దానిని కవర్ చేయడానికి తప్పులు చేస్తూనే ఉండాలి అని, నీ కోసం నేను కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని నర్మద బాధపడుతుంది. ఇప్పటికప్పుడు రూ20లక్షలు ఎలా తెచ్చి ఇవ్వాలి అని సాగర్ టెన్షన్ పడతాడు. మళ్లీ నర్మద సాగర్ ని తిడుతుంది. పరాయి వాళ్ల డబ్బులు వాడుకోకూడదని నీకు తెలీదా అని తిడుతుంది. నువ్వే నన్ను కాపాడాలి అంటూ సాగర్.. నర్మదను బ్రతిమిలాడతాడు. దీంతో.. నర్మద తన నగలు అన్నీ తీసి.. హ్యాండ్ బ్యాగ్ లో పెడుతుంది. వాటిని తాకట్టు పెట్టి.. డబ్బులు తెస్తాను అని నర్మద అంటుంది. మళ్లీ ఇదొక సమస్య అవుతుందేమో అని సాగర్ అంటే.. అది నేను చూసుకుంటాను అని నర్మద చెబుతుంది. ఇష్టం లేకపోయినా.. సాగర్ ని ఈ సమస్య నుంచి బయటపడేయడానికి నర్మద ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి బ్యాంకు కి బయలు దేరతారు. అది ఇడ్లీ చూసి.. వెళ్లి భాగ్యం, వల్లీకి చెబుతాడు. నర్మద చెంగు చాటున ఏదో బ్యాగు దాచిందని.. తోడుగా నర్మద కూడా వెళ్లిందని, ఏదో అనుమానంగా ఉందని ఇడ్లీ అంటాడు. వెనకే ఫాలో అవ్వమని భాగ్యం చెబుతుంది.

44
ధీరజ్ ఉద్యోగం పోయే...
Image Credit : Jio Hotstar

ధీరజ్ ఉద్యోగం పోయే...

ఇక.. ధీరజ్ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో.. ధీరజ్ వాళ్ల ఫ్రెండ్స్ ని తిడతాడు. కారు ఓనర్ కూడా ధీరజ్ మీద సీరియస్ అవుతాడు. రామరాజు పెంపకం సరిగా లేదని, అమూల్య లేచిపోయిన విషయం గురించి మాట్లాడతాడు. ఆ మాటలకు ధీరజ్ కి కోపం వస్తుంది. కోపంగా వెళ్లి.. ఆ ఓనర్ ని కొట్టడానికి వెళతాడు. ప్రేమ, అతని ఫ్రెండ్స్ ఆపుతారు. ఇక.. కోపం వచ్చిన ఓనర్.. ధీరజ్ ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు.. ఇంకెవరూ నీకు కారు ఇవ్వరు అని వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు సాగర్, నర్మద.. బంగారం తాకట్టుపెట్టడానికి వెళతారు. అదంతా ఇడ్లీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. వాళ్లు బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్లారని ఇడ్లీకి తెలిసిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
Recommended image2
Karthika Deepam 2 Today Episode: ఒక్కటైన తండ్రి, కూతురు- జ్యో టెన్షన్- దశరథ ఆవేశం- జైలుకు జ్యో?
Recommended image3
OTT: చెమటలు పట్టించే క్రైమ్, థ్రిల్లర్.. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 20: భర్త చెంప పగలగొట్టిన నర్మద, భార్య కాళ్లు పట్టుకున్న సాగర్
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved