MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం

Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం

Illu Illalu Pillalu Today Episode Feb 11: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్యను పెళ్లి చేసుకోలేదని విశ్వక్ వల్లి, భాగ్యానికి చెప్పేస్తాడు. దీంతో మళ్లీ కుంపటి పెట్టేందుకు భాగ్యం బ్యాచ్ రెడీ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Feb 11 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్యపై ధీరజ్ ప్రేమ
Image Credit : Jio hotstar

భార్యపై ధీరజ్ ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ, ధీరజ్‌లు గుడిమెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ తాను పరీక్ష రాయనని చెబుతుంది. కానీ ధీరజ్ ఆమెను ఒప్పించి పరీక్ష రాయాలని చెబుతాడు. ఈలోపు కొబ్బరి చిప్ప ప్రేమ పగలగొట్టడంతో ఆమె చేతికి గాయం అవుతుంది. చాలా కంగారుగా ఆమెను ప్రేమగా చూసుకుంటాడు ధీరజ్. ఆప్యాయతను చూసిన ప్రేమ చాలా ఆనందపడుతుంది. 

ధీరజ్ కూడా నీకు అన్నీ నేనే కదా, నీ మీద కేరింగ్ లేకుండా ఎలా ఉంటుంది, నీకు ఏమైనా అయితే బాధ లేకుండా ఎలా ఉంటుంది అని అంటాడు. అప్పుడు ప్రేమ అమూల్య విషయం చెప్పేద్దామని అనుకుంటుంది. ధీరజ్ తో ‘లైఫ్ లాంగ్ ఇలాగే నా మీద చేరింది చూపిస్తావా? ఇలాగే చూసుకుంటావా? నా చేయి ఎప్పటికీ వదలవు కదా’ అని అంటుంది. ధీరజ్ చనిపోయే వరకు చేయి వదలను అని అంటాడు. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని ప్రేమ డామినేట్ చేసేస్తుందని చెబుతాడు. దాంతో మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ప్రేమ చెబుతుంది. ఇక ధీరజ్ ప్రేమను ప్రేమించిన సంగతి చెప్పాలి అనుకుంటాడు. కానీ అదే సమయానికి మోకాలి ప్రదక్షిణలు చేస్తూ అక్కడికి వస్తాడు విశ్వక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాగర్ విషయంపై భాగ్యానికి డౌట్
Image Credit : Jio hotstar

సాగర్ విషయంపై భాగ్యానికి డౌట్

విశ్వను చూసిన ధీరజ్ వీళ్లు కూడా వచ్చారా? అని అనుకుంటాడు. అమూల్యను నాన్న చూస్తే ఇబ్బంది పడతారు, వెంటనే నాన్నని తీసుకువెళ్లిపోవాలి పదా అని చెప్పి ప్రేమని తీసుకుని రామరాజు దగ్గరికి వస్తాడు. రామరాజుతో వెళ్లిపోదాం పదండి అని చెప్పి తీసుకు వెళ్తాడు. ఈ లోపు శ్రీవల్లి పొర్లు దండాలు పెట్టుకుంటూ రామరాజు దగ్గరికి వచ్చి ఆగుతుంది. దాంతో పొర్లు దండాలు ఎందుకు మొక్కుకున్నావు అని వేదవతి అడుగుతుంది. అప్పుడు నర్మద ‘చేసిన పాపాలకు భయపడినట్టుంది’ అని అంటుంది. రామరాజు అదేంటమ్మా అనగానే... ‘ ఏం లేదు అన్నయ్యగారు మీరు ప్రాణాలతో బయట పెడితే పొర్లుదండాలు పెడతానని మొక్కుకుంది’ అని భాగ్యం కవర్ చేస్తుంది’ ఈ లోపు నర్మద తండ్రి ప్రసాద రావు అక్కడ స్వీట్స్ పంచుతూ వస్తాడు.

నర్మద తన తండ్రిని చూసి నాన్న మీరేంటి స్వీట్స్ పంచుతున్నారు అని అడుగుతుంది. ప్రసాద్ రావు సాగర్ అని ఏదో చెప్పబోయి రామరాజుని చూసి ఆగిపోతాడు. ఇక వల్లి, భాగ్యం మాత్రం ఆ విషయం ఏంటో చెప్పమని పట్టుబడతారు. దాంతో ప్రసాద్ రావు ఎలాగోలా తప్పించుకోవాలని ‘మా అమ్మాయి, అల్లుడు అన్యోన్యంగా ఉంటున్నారు కదా. అలాగే ఉండాలని కోరుకుంటూ ఇలా స్వీట్లు పంచుతున్నాను’ అంటాడు. ఈ లోపు భాగ్యం ‘అదేంటి సాగర్ ను మీ అల్లుడుగా మీరు ఒప్పుకోలేదుగా... ఇంతవరకు కూతురుని, అల్లుడిని ఇంటికే తీసుకెళ్లలేదు’ అని అంటుంది. దాంతో నర్మద కోపంగా ‘అల్లుడిగా అంగీకరించనంత మాత్రాన, కూతురిని ఇంటికి తీసుకెళ్లనంత మాత్రాన ప్రేమ ఎక్కడికి పోతుంది’ అని అంటుంది

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Related image2
Illu Illalu Pillalu Today Episode Feb 9: రామరాజు ఇంట్లో మరో కుంపటి, సాగర్ చేసిన పిచ్చి పని
34
అసలు విషయం చెప్పేసిన విశ్వ
Image Credit : Jio hotstar

అసలు విషయం చెప్పేసిన విశ్వ

రామరాజు అక్కడ నుంచి వెళుతూ ఉంటారు. ఈ లోపు అమూల్యను చూస్తాడు. అమూల్య కూడా తండ్రిని చూసి ప్రేమగా దగ్గరికి వస్తుంది. కానీ వేదవతి మాత్రం కోపంగా మాట్లాడుతుంది. రామరాజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో విశ్వక్ అమూల్యను చూసి ఇదేంటిది ఇలా టార్చర్ పెట్టి చంపుతుంది అని మనసులో అనుకుంటాడు. శ్రీవల్లి కూడా విశ్వను చూసి ఇదంతా వీడి వల్లే అనుకుంటూ పెద్ద రాయి పట్టుకొని కొట్టడానికి వెళుతుంది. విశ్వక్ తో ‘నువ్వు మాట్లాడతా అని పిలిచి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చావు. నీ వెనక ఉన్నది నేనే అని నర్మద, ప్రేమలకు తెలిసిపోయింది. నర్మద అయితే నన్ను కొట్టింది. నా కాపురంలో నిప్పులు పోసావు. అసలు పెళ్లెందుకు చేసుకున్నావు’ అని తిడుతుంది. అప్పుడు విశ్ నేను అసలు అమూల్యని పెళ్లి చేసుకోలేదని, అమూల్యే మెడలో తాళికట్టుకుని వచ్చిందని చెబుతాడు. దీంతో శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు.

44
తోటికోడళ్లకు షాక్
Image Credit : Jio hotstar

తోటికోడళ్లకు షాక్

అమూల్య తనంతట తానే తాళి కట్టుకొని వచ్చింది, తెలివిగా తాళి వేసుకొని వచ్చి నాకు టార్చర్ పెడుతుంది, అమూల్య వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పని చెబుతాను అని అంటాడు విశ్వక్. భాగ్యం వాళ్ళు కూడా ఆ విషయాన్ని తాము కనిపెట్టాలని అనుకుంటారు. ఈ లోపు ప్రసాద్ స్వీట్స్ ఎందుకు పంచాడో, సాగర్ సంగతి, అమూల్య విషయం అన్నీ తెలుసుకోవాలని అనుకుంటుంది భాగ్యం బ్యాచ్. ఈ లోపు నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ప్రేమ మాట్లాడుతూ ‘నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా నీ సంగతి తెలిసే వరకే.. ఆ తర్వాత నువ్వు ఎలాగూ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే’ అని అంటుంది. ఈ లోపు భాగ్యం మాట్లాడుతూ ‘మేమెందుకు సర్దుకుంటాం. అసలు అమూల్యకు పెళ్లి అవ్వలేదుగా’ అని అంటుంది. దాంతో నర్మద, ప్రేమ షాక్ అయిపోతారు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 9: రామరాజు ఇంట్లో మరో కుంపటి, సాగర్ చేసిన పిచ్చి పని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved