- Home
- Entertainment
- RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూసి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటికి మైండ్ బ్లాక్.. అయినా తప్పులో కాలేసింది
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూసి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటికి మైండ్ బ్లాక్.. అయినా తప్పులో కాలేసింది
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ సెలెబ్రెటీలకు ఫేవరిట్ మూవీగా మారిపోయింది. తాజాగా మారో ప్రపంచ ప్రఖ్యాత నటి ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ
అంతర్జాతీయ ఫ్లాట్ ఫామ్ లపై, అదే విధంగా బాక్సాఫీస్ వద్ద కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ జ్ఞాపకాలు అభిమానుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అంతలా ఈ చిత్రం సినీ అభిమానులని ఎంటర్టైన్ చేసింది. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. దిగ్గజ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరూన్ లాంటి వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాపై, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
ఇంకా తగ్గని ఆర్ఆర్ఆర్ క్రేజ్
ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించిన సంగతి తెలిసిందే. తారక్ కొమరం భీం, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విడుదలై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ హాలీవుడ్ నుంచి ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ ఆడియన్స్ ఎక్కువగా చూసిన ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి ఫిదా
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఈ సిరీస్ లో అత్యంత కీలకమైన సన్సా స్టార్క్ పాత్రలో నటించిన ప్రముఖ నటి సోఫీ టర్నర్ ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించారు.
హాలీవుడ్ లో కూడా ఇలాంటి సినిమా చూడలేదు
సోఫీ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రంలోని ప్రొడక్షన్ క్వాలిటీ అద్భుతం. ఇలాంటి క్వాలిటీని నేను ఇటీవల హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడలేదు. ఆ డ్యాన్స్, గ్రాండ్ విజువల్స్ ఎంతగానో నచ్చాయి అని సోఫీ పేర్కొన్నారు.
తప్పులో కలిసిన సోఫీ టర్నర్
ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తూనే ఆమె తప్పులో కాలేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆమె బాలీవుడ్ మూవీగా అభివర్ణించారు. ఈ బాలీవుడ్ చిత్రం నాకు నచ్చింది. ఒక రోజు నేను కూడా బాలీవుడ్ లో నటిస్తాను అని పేర్కొంది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై సోఫీ ప్రశంసలు కురిపించడాన్ని అభిమానులు అభినందిస్తున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని ఆమె బాలీవుడ్ మూవీ అని చెప్పడాన్ని విమర్శిస్తున్నారు. తెలుగు సినిమా ఆస్కార్ స్టేజీపై సత్తా చాటినప్పటికీ ఇంకా బాలీవుడ్ సినిమా అని చెప్పడం అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది.
Sansa Stark, happy that you enjoyed RRR!#SophieTurner#RRRMovie#GameOfThronespic.twitter.com/ZcebMJ0HK7
— RRR Movie (@RRRMovie) January 10, 2026

