పెళ్లి కాకుండా తల్లైన ఈ స్టార్ హీరోయిన్, కెరీర్ నాశనం... ఆ నిర్ణయమే ముంచింది!
టాలీవుడ్ లో ఆమె ఫస్ట్ కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్. కానీ తప్పుడు నిర్ణయాలతో కెరీర్ నాశనం చేసుకుంది. పెళ్ళికి ముందే తల్లైన ఈ హీరోయిన్... ఏకంగా ఇండస్ట్రీని వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
Ileana
చాలా కొద్ది మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. మొదటి సినిమాకే ఫేమ్ వచ్చి పడుతుంది. అలాంటి లక్కీ హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సదరు హీరోయిన్ నటించిన డెబ్యూ మూవీ హిట్. ఇక రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. స్టార్ హీరో నటించిన ఆ మూవీ రికార్డ్స్ బద్దలు చేసింది. ఆ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించింది. తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ .. అనుహ్యంగా పరిశ్రమను వీడింది..
ఆమె ఎవరో కాదు ఇలియానా డి క్రూజ్. ఈ గోవా బ్యూటీని దర్శకుడు వైవిఎస్ చౌదరి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. 2006లో రామ్ పోతినేని హీరోగా విడుదలైన దేవదాసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అదే ఏడాది పోకిరి తో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. రెండో చిత్రంలోనే ఆమెకు మహేష్ బాబు వంటి స్టార్ సరసన ఛాన్స్ దక్కింది.
పోకిరి ఇండస్ట్రీ హిట్. దర్శకుడు పూరి జగన్నాధ్ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే ఇలియానాను గ్లామరస్ గా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా అనంతరం యువత ఇలియానా ప్రేమలో పడిపోయారు. ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో జతకట్టింది.
అటు తమిళంలో కూడా ఆమెకు స్టార్స్ సరసన అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా అంటారు. కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ కి వెళ్ళింది ఇలియానా. ఈ నిర్ణయం ఆమెను దెబ్బతీసింది. దానికి తోడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో ఎఫైర్ నడిపింది. బ్రేకప్ కారణంగా డిప్రెషన్ ఫేస్ చేసింది. హిందీ పరిశ్రమలో ఇలియానా సక్సెస్ కాలేదు.
అడపదడపా సినిమాలు, ప్రాధాన్యత లేని పాత్రలకు పరిమితం అయ్యింది. మరోవైపు టాలీవుడ్ ఆమెను పూర్తిగా మరిచిపోయింది. కాగా ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయ్యారు. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అందుకు కారణం ఎవరో ఇలియానా చెప్పలేదు. చాలా కాలం సస్పెన్సు లో పెట్టింది. ఇలియానాకు ఒక అబ్బాయి పుట్టాడు. ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అట.
సౌత్ ఇండియాను ఎలాల్సిన ఇలియానా అనవసరంగా హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లి కెరీర్ నాశనం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఇలియానా నటిస్తుంది. తెలుగులో ఇలియానా నటించిన చివరి చిత్రం.. అమర్ అక్బర్ ఆంటోని. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ రిజల్ట్ తో ఇలియానాకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.