- Home
- Entertainment
- మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
ఇండస్ట్రీ హిట్లు, భారీ విజయాలు అందుకున్న కొందరు హీరోయిన్లు టాలీవుడ్ లో ఇప్పుడు కనిపించడం లేదు. ఆ హీరోయిన్లు ఎవరు ? ఏం జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Tollywood
టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు వెలిగి మాయమైపోతుంటారు. పెళ్ళైన తర్వాత హీరోయిన్ల కెరీర్ మునుపటిలా సాగదు. టాలీవుడ్ లో అదిరిపోయే హిట్లు అందుకుని పెళ్ళైన తర్వాత కనిపించకుండా పోయిన ఐదుగురు హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీరిలో కొందరు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఇలియానా
ఇలియానా పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. మహేష్ బాబు సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇలియానా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్ లో ఉన్న టైంలో ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. ప్రేమ వ్యవహారాలు ఇలియానా కెరీర్ ని దెబ్బతీశాయి. పెళ్లి తర్వాత ఇలియానా పూర్తిగా సినిమాలకు దూరమైంది.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ లేదు కానీ మంచి విజయాలు ఉన్నాయి. రాంచరణ్ తో ధ్రువ, బ్రూస్లీ లాంటి చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లతో కూడా నటించింది. బాలీవుడ్ నిర్మాతతో వివాహం తర్వాత రకుల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి.
ప్రణీత సుభాష్
ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రం గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రణీత కెరీర్ లోనే మెమొరబుల్ మూవీ. 2021లో వివాహం చేసుకున్న తర్వాత ప్రణీత సినిమాలకు దూరమైంది.
కాజల్ అగర్వాల్
రాంచరణ్ తో మగధీర లాంటి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిత్రంలో కాజల్ నటించింది. కాజల్ టాలీవుడ్ లో చాలా సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేసింది అనే చెప్పాలి. అందరు అగ్ర హీరోలతో ఆమెకి హిట్లు ఉన్నాయి. కానీ పెళ్లైన తర్వాత కాజల్ కెరీర్ నెమ్మదించింది.
అమలాపాల్
సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతో అమలాపాల్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అమలాపాల్ తెలుగులో అల్లు అర్జున్, రాంచరణ్, నాగ చైతన్య లాంటి హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రెండో పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాలకు దూరమైంది.

