MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌

Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌

Suriya: 'కరుప్పు' సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నటుడు సూర్య నటిస్తున్న తెలుగు మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'  విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 28 2026, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరుప్పుతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన సూర్య
Image Credit : X

కరుప్పుతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన సూర్య

సూర్యకి చాలా ఏళ్ల తర్వాత సరైన హిట్‌ పడింది. ఆయన రేంజ్‌కి సాలిడ్‌ హిట్‌ పడితే అది బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ఇప్పుడు `కరుప్పు` మూవీ చూపిస్తోంది. సూర్య కెరీర్‌లో తొలిసారి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా ‘కరుప్పు’ నిలిచింది.  ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు రూ.269కోట్లు రాబట్టింది.  దీంతో సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు సూర్య. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కరుప్పు కలెక్షన్లు
Image Credit : Asianet News

కరుప్పు కలెక్షన్లు

ఇప్పటి వరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.127కోట్లు రాబట్టింది. తెలుగులో దాదాపు రూ.28కోట్లు, కర్నాటకలో రూ.19కోట్లు, కేరళాలో రూ.12కోట్లు వసూలు చేసింది. నార్త్ ఇండియాలో మూడు కోట్లు, ఓవర్సీస్‌లో రూ,70కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇది రూ.270కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ వారంలో మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. 

Related Articles

Related image1
Upasana ని మ్యారేజ్‌ చేసుకోవడంపై రామ్‌ చరణ్‌ క్రేజీ కామెంట్‌.. పెళ్లికి ముందే `పెద్ది` చేస్తే మంచి సంబంధం వచ్చేది
Related image2
Blast Zone Movie Review: బ్లాస్ట్ జోన్‌ మూవీ రివ్యూ.. అర్జున్‌ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్‌ మూవీ ఎలా ఉందంటే?
34
సూర్య తెలుగు సినిమా వస్తోంది
Image Credit : Sithara Entertainments

సూర్య తెలుగు సినిమా వస్తోంది

ఈ జోష్‌లో ఉన్న అభిమానులకు సూర్య మరో ట్రీట్‌ ఇవ్వబోతున్నాడు. కొత్త సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన తెలుగు సినిమా రిలీజ్‌ కి రెడీ అయ్యింది. సూర్య తదుపరి సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. `రక్తచరిత్ర` తర్వాత సూర్య నటించిన తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం.  ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్లు, తర్వాత టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఆ టీజర్‌లో సినిమా జులైలో వస్తుందని చెప్పారు.

44
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ రిలీజ్‌ డేట్‌
Image Credit : X

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ రిలీజ్‌ డేట్‌

అయితే ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను ఆగస్టుకు వాయిదా వేశారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య విదేశీ వీధుల్లో గొడుగు పట్టుకుని, ఫోన్ చూస్తూ స్టైలిష్‌గా కనిపించారు. 'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'సార్‌', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Related Stories
Recommended image1
Upasana ని మ్యారేజ్‌ చేసుకోవడంపై రామ్‌ చరణ్‌ క్రేజీ కామెంట్‌.. పెళ్లికి ముందే `పెద్ది` చేస్తే మంచి సంబంధం వచ్చేది
Recommended image2
Blast Zone Movie Review: బ్లాస్ట్ జోన్‌ మూవీ రివ్యూ.. అర్జున్‌ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved