- Home
- Entertainment
- Ileana: బేబీ బంప్ చూపిస్తూ మురిసిపోయిన ఇలియానా.. బ్లాక్ టైట్ ఫిట్‌లో హాట్ అందాలతో ఎట్రాక్టింగ్
Ileana: బేబీ బంప్ చూపిస్తూ మురిసిపోయిన ఇలియానా.. బ్లాక్ టైట్ ఫిట్‌లో హాట్ అందాలతో ఎట్రాక్టింగ్
గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఊహించని విధంగా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేసింది. తాను మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది.

ఇలియానా తాజాగా తన బేబీ బంప్‌ని ప్రదర్శించింది బ్లాక్ టైట్ ఫిట్ ధరించి బేబీ బంప్ షో చేసింది. అంతేకాదు తన చిన్నారి కడుపులో పెరుగుతున్నందున దాన్ని చూసుకుని మురిసిపోతుంది ఇలియానా. నవ్వులు చిందిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
బేబీ బంప్ ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో బంప్ అలెర్ట్ అంటూ పోస్ట్ పెట్టింది ఇలియానా. ఇందులో ఇలియానా బరువెక్కి బొద్దుగా కనిపిస్తుంది. క్యూట్ ఫేస్ ఆకట్టుకునే ఉంది. మరోవైపు బ్లాక్ డ్రెస్‌లో యమ హాట్‌గానూ ఉంది. మొత్తంగా రెండు రకాలుగా రచ్చ చేస్తుందీ గోవా అందం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలియానా బేబీ బంప్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమన్నా, అథియా శెట్టి, నర్గీస్ వంటి అనేక మంది సెలబ్రిటీలు స్పందిస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. తల్లి కాబోతున్న సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరోవైపు నెటిజన్లు సైతం విషెస్ తెలియజేస్తున్నారు. కానీ కొందరు మాత్రం తండ్రి ఎవరని ప్రశ్నిస్తున్నారు. మ్యారేజ్ ఎప్పుడైంది? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ అమ్మడిపై కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అదే సమయంలో బేబీ బంప్‌లోనూ అందం ఓవర్ లోడ్ అని, చాలా హాట్‌గా ఉన్నావని అంటున్నారు.
గోవా అందం ఇలియానా నటిగా క్రేజ్ తగ్గింది. అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పర్సనల్ లైఫ్‌లో సెటిల్ కావాలనుకుంటుంది. అందుకే గర్భం దాల్చినట్టు తెలుస్తుంది. గతంలో ఆమె లవ్‌లో పడి బ్రేకప్ తీసుకుంది. దీంతో డిప్రెషన్‌కి, అనారోగ్య సమస్యలకు గురైన ఇలియానా ఈ మధ్యనే కోలుకుంది. కానీ ఇప్పుడు వెంటనే తాను తల్లికాబోతున్న విషయాన్ని పంచుకుని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.