- Home
- Entertainment
- Ileana: హాట్ బికినీ ఫోటో షేర్ చేసిన ఇలియానా... అది చాలా మిస్ అవుతున్నానంటూ క్రేజీ కామెంట్!
Ileana: హాట్ బికినీ ఫోటో షేర్ చేసిన ఇలియానా... అది చాలా మిస్ అవుతున్నానంటూ క్రేజీ కామెంట్!
బెల్లీ బ్యూటీ ఇలియానా హాట్ బికినీ ఫోటో షేర్ చేసింది. నీలి రంగు టూ పీస్ బికినీ ధరించిన గోవా భామ గాగుల్స్ పెట్టుకొని బోల్డ్ ఫోజులిచ్చారు. సదరు ఫొటోకు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. అవును ఇది పాత ఫోటోనే, కానీ నేను బీచ్ చాలా మిస్ అవుతున్నాను అంటూ తన గోడు వెళ్లగక్కింది.

Ileana
టాలీవుడ్ క్వీన్ గా వెలిగిపోయిన ఇలియానా (Ileana) బాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ కెరీర్ నెట్టుకొస్తోంది. దూరపు కొండలు నునుపు అని తెలియక బాలీవుడ్ లో ఎదిగి పోవాలని టాలీవుడ్ ని వదిలేసి వచ్చింది. అసలు విషయం తెలిసేనాటికి జారీ నేలమీద పడింది.
Ileana
ఒకప్పుడు తీరిక లేకుండా గడిపిన ఇలియానా ప్రస్తుతం చాలా ఖాళీగా ఉంటున్నారు. పనేమీ లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ చేశారు. తరచుగా ఇంస్టాగ్రామ్ లో బికినీ ఫోటోలు పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలియానా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్స్ కి చేరింది.
ఈ సందర్భంగా ఇలియానా మరో బికినీ ఫోటో షేర్ చేశారు. బ్లూ బికినీలో క్రేజీ పోజులో దర్శనం ఇచ్చింది. అయితే ఇలియానా సదరు ఫోటోలో డీగ్లామరస్ గా ఉన్నారు. ఒకింత బరువు కూడా పెరిగిన ఇలియానా పూర్వపు అందం కోల్పోయారు. ఒకప్పుడు నాజూకు నడుముతో స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండే ఇలియానా కొంచెం షేపవుట్ అయ్యారు.
ఇలియానా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో ఫ్యాన్స్ ని ఒకింత ఇబ్బంది పెట్టేదిగా ఉంది. ఫాలోవర్స్ పెరిగిన ఆనందంలో ఇలియానా జాగ్రత్తలు తీసుకోకుండా నేచురల్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Ileana
కాగా ఓ దశలో ఇలియానా తన శరీరం గురించి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని, బటక్స్ కావాల్సిన సైజు కంటే పెద్దవిగా ఉన్నాయని, హిప్ అందంగా లేదని బాధ పడినట్లు ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేసింది.
చిన్నగా ఆ ఆత్మన్యూనతా భావం నుండి బయటకు వచ్చినట్లు ఇలియానా చెప్పడం విశేషం. ప్రియుడు ఆండ్రూ తో బ్రేకప్ తర్వాత ఇలియానా మానసిక స్థితి సరిగాలేదు. ఆమె డిప్రెషన్ ఫీల్ అయ్యారు. దాని కారణంగా ఆమె బరువు పెరిగారు. ఆ మధ్య ఇలియానా గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు.
ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే అసలు ఆశాజకంగా లేదు. టాలీవుడ్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానాకు ఈ పరిస్థితి ఊహించనిదే. ఇలియానా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేశాయి.
బెల్లీ బ్యూటీ ఇలియానా హాట్ బికినీ ఫోటో షేర్ చేసింది. నీలి రంగు టూ పీస్ బికినీ ధరించిన గోవా భామ గాగుల్స్ పెట్టుకొని బోల్డ్ ఫోజులిచ్చారు.