ఇలియానాకు ఎన్టీఆర్ మూవీలోని ఆ సాంగ్ అంటే పిచ్చి అట.. ఇష్టమైన రెండు పాటలు ఇవే..
గోవా బ్యూటీ, నడుము సుందరి ఇలియానాకి యువతలో ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

Ileana
గోవా బ్యూటీ, నడుము సుందరి ఇలియానాకి యువతలో ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు.
Ileana
ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో అరకొర అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. సౌత్ లో ఆమెకు పూర్తిగా ఆఫర్స్ కరువయ్యాయి. ఇలియానా చివరగా తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
Ileana
ఏది ఏమైనా ఇలియానా ఇంత పెద్ద స్టార్ గా మారిందంటే అందుకు కారణం తెలుగు సినిమాలే. ఇక ఇలియానా అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలలో తెలుగు సినిమాని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Ileana
మీరు నటించిన సినిమాల్లో బెస్ట్ సాంగ్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. నాకు ఇష్టమైనవి రెండు సాంగ్స్ ఉన్నాయి. ఒకటి పోకిరి చిత్రంలోని 'డోలె డోలె' అనే సాంగ్.. రెండవది ఎన్టీఆర్ సరసన నటించిన రాఖీ చిత్రంలోని 'జర జర' అనే సాంగ్ అంటే తనకు చాలా ఇష్టం అని ఇలియానా పేర్కొంది.
Ileana
ఈ రెండు సాంగ్ మాస్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ముఖ్యంగా జర జర సాంగ్ లో ఇలియానా అందాలు ఆరబోసి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ సమయంలో అందరి ఫ్యామిలీస్ లాగే మా ఫ్యామిలీ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అని ఇలియానా రివీల్ చేసింది. ఆ టైం లో రెండు సినిమాలకు సైన్ చేశాను.
Ileana
ఆ రెండు చిత్రాలు పాండమిక్ కారణంగా వాయిదా పడ్డాయి. దీనితో యూఎస్ వెళ్ళిపోదామని ఆలోచన కూడా వచ్చింది. కానీ నేను ఇక్కడ చాలా సినిమాల్లో నటించాలని అనుకుంటున్నా. అందుకే వెళ్ళలేదు అని ఇలియానా పేర్కొంది.