- Home
- Entertainment
- బేబీ బంప్ ఫొటోస్ తో ఇలియానా మరోసారి రచ్చ.. యాంగిల్స్ లోనే ఉంది అంతా అంటూ బోల్డ్ గా..
బేబీ బంప్ ఫొటోస్ తో ఇలియానా మరోసారి రచ్చ.. యాంగిల్స్ లోనే ఉంది అంతా అంటూ బోల్డ్ గా..
ఇటీవల ఇలియానా సడెన్ గా తాను గర్భవతిని అంటూ ప్రకటన చేసింది. ఇలియానా చేసిన ఈ ప్రకటనతో అంత షాక్ అయ్యారు.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.
బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.
ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది.
ఇటీవల ఇలియానా సడెన్ గా తాను గర్భవతిని అంటూ ప్రకటన చేసింది. ఇలియానా చేసిన ఈ ప్రకటనతో అంత షాక్ అయ్యారు. పెళ్లే కాలేదు అప్పుడే గర్భం ఏంటి ? అసలు ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు ? ఒక వేళ రహస్యంగా పెళ్లి చేసుకుంది అనుకున్నా ఆమె బిడ్డకి తండ్రి ఎవరు అంటూ ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు మొదలయ్యాయి.
Ileana
ఇటీవల ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలని ఓపెన్ గా ప్రదర్శిస్తూ షాకిచ్చింది. కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా సహజీవనం చేస్తోంది అనే రూమర్ ఉంది. అయితే తాను గర్భవతి అనే విషయం తప్ప ఇలియానా ఇంకేమి రివీల్ చేయలేదు. ఇటీవల ఇలియానా తన బేబీ బంప్ ప్రదర్శిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నారు.
Ileana
తాజాగా ఇలియానా బేబీ బంప్ తో ఉన్న మిర్రర్ సెల్ఫీ పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు నడుము సుందరి బోల్డ్ కామెంట్ పెట్టింది. స్ట్రైట్ గా ఉన్న యాంగిల్ లో ఇలియానా నార్మల్ గానే కనిపిస్తోంది. సైడ్ యాంగిల్ మాత్రం ఆమె బేబీ బంప్ కనిపిస్తోంది. దీనితో యాగిల్స్ లోనే ఉంది అంతా అంటూ బోల్డ్ గా కామెంట్ పెట్టింది.
గతంలో ఓ ఆస్ట్రేలియన్ కొరియోగ్రాఫర్ తో సహజీవనం చేసిన ఇలియానా ఆ తర్వాత జరిగిన బ్రేకప్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో ఆమె ప్రెగ్నన్సీ గురించి కూడా రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇలియానా ప్రేమకు గుడ్ బై చెప్పి కెరీర్ ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలేవీ వర్కౌట్ కాలేదు.