- Home
- Entertainment
- మొదటిసారి తన కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేసిన ఇలియానా.. పిక్ వైరల్.. అది మాత్రం సస్పెన్స్!
మొదటిసారి తన కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేసిన ఇలియానా.. పిక్ వైరల్.. అది మాత్రం సస్పెన్స్!
గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన చిన్నారి తనయుడి చూసుకుంటూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. తల్లితనంలోని మధుర అనుభూతులను ఆస్వాధిస్తుంది.

గోవా బ్యూటీ ఇలియానా ఊహించిన షాక్‌తోపాటు సర్‌ప్రైజ్ చేసింది. తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి పెద్ద షాకిచ్చింది. తండ్రి ఎవరో సస్పెన్స్ లో పెట్టి మరింత ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఏంటనే అనుమానాలకు తెరలేపింది. తాను చిన్నారి జన్మనిచ్చేంత వరకు ఆ పాపకి తండ్రి ఎవరో సస్పెన్స్ లో పెట్టింది.
ఆగస్ట్ 1న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఇలియానా. ఆ విషయాన్ని కూడా కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన ప్రెగ్నెన్సీ, డెలివరీకి సంబంధించిన ఆమె సీక్రెట్ మెయింటేన్ చేస్తూ వచ్చింది. రహస్యంగా ఉంచుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసింది.
ఇప్పుడు తల్లితనాన్ని అనుభవిస్తున్న ఇలియానా మొదటిసారి తన చిన్నారితో దిగిన ఫోటోని పంచుకుంది. ఉదయాన్నే తన చిన్నారికి ఫీడింగ్ ఇస్తున్న సమయంలో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. తాను డెలివరీ అయ్యాక ఫస్ట్ టైమ్ తన చిన్నారితో ఉన్న ఫోటోని షేర్ చేసింది ఇలియానా. ఇలా తన సంతోషాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
ఇలియానా.. పదేళ్ల క్రితం టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది.
2006 నుంచి 2012 వరకు ఏడేళ్లపాటు టాలీవుడ్‌లో తన హవా చూపించింది. `దేవదాసు`తో పరిచయం అయిన ఈ బ్యూటీ `పోకిరి`తో బిగ్గెస్ట్ బ్రేక్ అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత `ఖతర్నాక్`, `రాఖీ`, `మున్న`, `ఆట`, `జల్సా`, `భలే దొంగలు`, `కిక్`, `రెచ్చిపో`, `సలీమ్`, `శక్తి`, `నేను నా రాక్షసి`, `జులాయి`, `దేవుడు చేసిన మనుషులు` చిత్రాలతో అలరించింది.
చివర్లో పరాజయాలు చవిచూసింది. అదే సమయంలో హిందీలో ఆఫర్లు ఊపందుకున్నాయి. అక్కడ బిజీ అయ్యింది. అక్కడ ఆరేళ్లపాటు బిజీగా గడిపింది. దీంతో తెలుగుకి గ్యాప్ వచ్చింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రంలో నటించింది. కానీ ఇది నిరాశపరిచింది. మళ్లీ తెలుగులోసినిమాలు చేయలేదు.
హిందీలో కెరీర్‌ని లాక్కొస్తుంది. అయితే మధ్యలో లవ్ లో ఫెయిల్ అయ్యింది ఇలియానా. దీంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. తన బాడీ సేమింగ్ కామెంట్లని ఫేస్ చేసింది. అనేక ట్రోల్స్ అనంతరం స్ట్రాంగ్ అయ్యింది. తన కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ఆమె తన ప్రెగ్నెన్సీ అని ప్రకటించడం, ఇప్పుడు మగబిడ్డకి జన్మనివ్వడం జరిగిపోయాయి. కుమారుడికి కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. భర్తకి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదీ బ్యూటీ. మైఖేల్ డోలన్ అని తెలుస్తుంది.