తల్లిగా వేదనకి గురైన ఇలియానా..రెండు నెలలకే తన బిడ్డకి ఇలా, ప్రియుడి గురించి తొలిసారి కామెంట్స్
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ ముగిసేలా చేశాయి.
బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. బాడీ అవుట్ ఆఫ్ షేప్ గా కూడా మారింది. ఇటీవల ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాలేదు అప్పుడే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా షాక్ అయ్యారు.
చాలా రోజుల పాటు తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా ఇలియానా దాచిపెట్టింది. అయితే ఇటీవల అతడి ఫోటో షేర్ చేయడంలో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది. తాజాగా ఇలియానా తన ముద్దుల కొడుకు తో ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేసింది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇలియానాకి కొడుకు పుట్టి రెండు నెలలు పూర్తయింది. అయితే ఇలియానా తల్లిగా తొలిసారి మానసిక వేదనకి గురైందట. ఇటీవల తన కొడుకు చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యాడట. దీనితో ఇలియానా తల్లిగా తల్లడిల్లిపోయినట్లు తెలిపింది. కన్నబిడ్డ అనారోగ్యానికి గురైతే తల్లి మనసు ఎంతగా వేదన చెందుతుంది.. ఆ వేదనని ఎలా భరించాలి అనే విషయాలని ఎవరూ చెప్పలేదని ఇలియానా పేర్కొంది.
తల్లి అయ్యాకే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయని ఇలియానా పేర్కొంది. ప్రతి మహిళ తల్లి అయ్యాక ఇలాంటి అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలిపింది. ఇక తన ప్రియుడు, బిడ్డకి తండ్రి గురించి కూడా ఇలియానా ఇప్పుడిప్పుడే విషయాలు బయట పెడుతోంది.
డోలాన్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచారు. అండగా ఉన్నారు. నా ముఖంపై చిరునవ్వు తెప్పించారు. ఆయన పక్కన ఉంటే ఏది నాకు కష్టంగా అనిపించదు అని ఇలియానా తెలిపింది. తన ప్రియుడిని ప్రశంసలతో ముంచెత్తింది.