హాస్పిటల్లో చేరి.. అనారోగ్యంతో ఇళయరాజా కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్
ఇళయరాజా సాంగ్ సీక్రెట్: సంగీత దర్శకుడు ఇళయరాజా ఆసుపత్రిలో ఉండి, సంగీత వాయిద్యాలు లేకుండా ఒక పాటను ట్యూన్ చేశారు. అది ఏంటో తెలుసా...
ఇళయరాజా
1980 - 90లలో సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఆయన హవా నడుస్తున్న సమయంలో అనారోగ్యంతో మ్యూజిక్ మాస్ట్రో ఆసుపత్రిలో చేరగా, ఒక నిర్మాతకు అర్జెంట్‌గా పాట కావలసి వచ్చింది.
దాంతో ఇళయరాజా ఆసుపత్రిలో ఉండి, పడుకునే మంచం మీదనే పాటకు ట్యూన్ చేశారు. అంతే కాదు అప్పుడు అలా ట్యూన్ చేసిన ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పాట ఏంటో తెలుసా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇసైజ్ఞాని ఇళయరాజా
1984 సంవత్సరంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు హెర్నియా సర్జరీ జరిగింది. ఆయన బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్లు ఆయనకు ఒక నెల రోజుల పాటు పాటలు పాడవద్దని సూచించారు. ఎటువంటి కార్యక్రమాలకు వెళ్ళవద్దన్నారు.
అయితే సరిగ్గా అదే సమయంలో నిర్మాత పంజు అరుణాచలం ఇళయరాజాను చూసేందుకు వెళ్లారు. తన సినిమా కీలక దశలో ఉందని, పాట చిత్రీకరణ కోసం రజినీకాంత్ ఎదురు చూస్తున్నారని వివరించారు.
ఇళయరాజా సాంగ్ సీక్రెట్
డాక్టర్ పాడవద్దని చెప్పారు, మరి ఇప్పుడు ఎలా కంపోజ్ చేయాలి అని ఇళయరాజా ఆలోచనలో పడ్డారు. పంజు అరుణాచలం పరిస్థితిని అర్థం చేసుకుని, పాట సందర్భం గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రేకప్ గురించి అని చెప్పగానే.. ఆయన ఓ ఐడియా వేశారు.
'డాక్టర్ పాడవద్దని చెప్పారు, ఈల వేయవద్దని చెప్పలేదు కదా.. ఈల వేస్తూ ట్యూన్ కంపోజ్ చేస్తా' అని అన్నారట ఇలయరాజ. వెంటనే ఈలవేస్తూ సాంగ్ ను కంపోజ్ చేసుకున్నారట.
SPB, ఇళయరాజా
ఇళయరాజా ఈల వేస్తూ ట్యూన్ చెప్పగా.. పంజు అరుణాచలం సాహిత్యం రాశారు. అప్పుడు ఇళయరాజా పడుకునే ఉన్నారు, మరి పాట ఎలా రికార్డ్ చేస్తారని పంజు అరుణాచలం అడగ్గా.. 'నేను చూసుకుంటా' అని కూల్‌గా చెప్పారట. మరుసటి రోజు తన అసిస్టెంట్స్‌ను పిలిచి మ్యూజిక్ నోట్స్ రాసి ఇచ్చారు.
Kaathalin Deepam Ondru Song
S.P. బాలసుబ్రహ్మణ్యం స్టూడియోకు పాట పాడటానికి రాగా.. 'నువ్వు పాడు.. నాకు ఫోన్‌లో కాల్ చేయి' అని చెప్పారట రాజా. ఆయన పాడిన దానిని ఫోన్‌లో విని.. ఫోన్‌లోనే కరెక్షన్స్ చెప్పారు. అలా మ్యూజిక్ స్టూడియోకు వెళ్లకుండా ఆయన కంపోజ్ చేసిన పాట ఇది.
ఇంతకీ ఆ పాట మరేదో కాదు.. 'తంబిక్కు ఎంత ఊరు' సినిమాలోని 'కాతలిన్ దీపం ఒండ్రు' పాట. ఈ పాటను ఇళయరాజా ఆసుపత్రిలో ఉండి కంపోజ్ చేశారు. ఈ పాట ఇప్పటికీ తమిళ అభిమానులను అలరిస్తూ ఉండటమే ఇళయరాజా ప్రతిభకు నిదర్శనం.