- Home
- Entertainment
- ఆ హీరో బ్లాక్ బస్టర్ మూవీ నాకెందుకు పడలేదబ్బా అని బాధపడ్డ అల్లు అర్జున్, ఛాలెంజ్ చేసి చిరుని పిలిపించుకుని..
ఆ హీరో బ్లాక్ బస్టర్ మూవీ నాకెందుకు పడలేదబ్బా అని బాధపడ్డ అల్లు అర్జున్, ఛాలెంజ్ చేసి చిరుని పిలిపించుకుని..
అల్లు అర్జున్ పుష్ప లాంటి భారీ విజయం అందుకున్నప్పటికీ తన మనసులో ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోయిందట. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన అసంతృప్తికి కారణాన్ని వివరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
megastar chiranjeevi
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరో. పుష్ప 2 చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టింది. అల్లు అర్జున్ పుష్ప లాంటి భారీ విజయం అందుకున్నప్పటికీ తన మనసులో ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోయిందట. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన అసంతృప్తికి కారణాన్ని వివరించారు.
అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి చిత్రంతో లాంచ్ అయ్యాడు. ఆ మూవీ హిట్ అయింది కానీ బన్నీకి అంత గొప్ప పేరు రాలేదు. తనకు గుర్తింపు తీసుకువచ్చే చిత్రం కోసం అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నాడు. ఆ టైంలో రవితేజ ఇడియట్ చిత్రం రిలీజ్ అయింది. ఇడియట్ మూవీ చూసి బన్నీ ఆశ్చర్యపోయాడట. యువతలో క్రేజ్ రావాలంటే ఇలాంటి సినిమా పడాలి. ఇడియట్ లో నటించే ఛాన్స్ నాకెందుకు రాలేదని చాలా రోజులు బాధపడినట్లు బన్నీ తెలిపాడు.
నా నెక్స్ట్ మూవీ ఇడియట్ లాగానే ఉండాలి అని కోరుకున్నాడట. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆర్య చిత్రం బన్నీ వద్దకి వచ్చింది. ఇడియట్ కి, ఆర్యకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఆర్య కథ తనకి చాలా బాగా నచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు. కానీ తన అనుమానం ఒక్కటే.. సుకుమార్ కొత్త డైరెక్టర్ .. అనుకున్న విధంగా తీయగలడా లేదా అని టెన్షన్ పడ్డారట. ఆ టైంలో వివి వినాయక్ ఇచ్చిన ధైర్యం తనని ముందుకు నడిపించింది అని బన్నీ తెలిపారు.
Allu Arjun
సుకుమార్ చాలా ట్యాలెంట్ ఉన్న కుర్రాడు. మీరు సినిమా మొదలు పెట్టండి అని చెప్పాడట. ఒక వేల సుకుమార్ చేయలేకపోతే నేను దర్శకత్వం చేస్తా అని వినాయక్ హామీ ఇచ్చారట. వినాయక్ ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మరచిపోలేను అని అల్లు అర్జున్ అన్నారు. మొత్తానికి సినిమా ప్రారంభించి షూటింగ్ పూర్తి చేశాం. తొలి రోజు నేను సుకుమార్ థియేటర్ లో రెస్పాన్స్ చూడడానికి వెళ్లాం. తొలి రోజు ఈ చిత్రం 40 శాతం ఆక్యుపెన్సీతోనే మొదలైంది. ఆ టైంలో నేను ఇండస్ట్రీకి కొత్త, ఒక చిత్రంలో మాత్రమే నటించాను. సుకుమార్ కూడా ఎవరికీ తెలియదు. దీనితో తొలి రోజు 40 శాతం మాత్రమే థియేటర్లలోకి జనాలు వచ్చారు.
Idiot Movie
చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బావుందని అంటున్నారు. సినిమా అద్భుతంగా ఉండడంతో అల్లు అర్జున్ కి అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయి. బయ్యర్లు, ఎగ్జిబిటర్ల నుంచి ఫీడ్ బాక్ తీసుకుంటే 10 వారాలు ఆడుతుంది అని చెప్పారట. వాళ్ళు ఇచ్చిన ఫీడ్ బాక్ తో బన్నీ సంతృప్తి చెందలేదు. పైగా కోపం వచ్చింది అట. ఆడియన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తుంటే మినిమమ్ 100 రోజులు ఆడాలి. 10 వారాలు అంటారేంటి అని బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారట.
Chiranjeevi
ఇంట్లో భోజనం చేస్తూ.. బన్నీ కాస్త ఇబ్బందిగా కనిపించారు. దీనితో అల్లు అరవింద్.. అలా మూతి ముడుచుకుని కుర్చున్నావేంటి.. 10 వారాలు సినిమా ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సక్సెస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు అని చెప్పారట. బన్నీకి చిరాకు వచ్చి.. అందరూ 10 వరాలు.. 10 వారాలు అంటున్నారు ఏంటి ? ఈ సినిమా మినిమమ్ 125 రోజులు ఆడుతుంది. చిరంజీవి గారి చేతుల మీదుగా 125 డేస్ షీల్డ్ తీసుకుంటా చూడండి అని బన్నీ ఛాలెంజ్ చేశాడట. బన్నీ నమ్మకమే నిజమైంది. ఆర్య చిత్రం సంచలన విజయం సాధించి 125 డేస్ ఆడింది. ఆ ఈవెంట్ కి చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. చిరు చేతుల మీదుగా బన్నీ 125 డేస్ షీల్డ్ అందుకున్నారు.