- Home
- Entertainment
- రామ్ చరణ్ అభిమానులకు హాట్ బ్రేకింగ్ న్యూస్, పెద్ది క్లైమాక్స్ ట్విస్ట్ ను ఒప్పుకుంటారా? నిజమెంత?
రామ్ చరణ్ అభిమానులకు హాట్ బ్రేకింగ్ న్యూస్, పెద్ది క్లైమాక్స్ ట్విస్ట్ ను ఒప్పుకుంటారా? నిజమెంత?
పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఈసినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్ తో పాటు.. ఏదో ఒక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఇక తాజాగా పెద్ది క్లైమాక్స్ ప్రయోగంపై ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా?

మెగా అభిమానులు ఎదురుచూపులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈసినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈసినిమా నుంచి వస్తున్న వరుస అప్ డేట్స్ తో అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఏప్రిల్‌లో విడుదలైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ అయితే అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా “పెద్ది షాట్” అంటూ క్రికెట్‌కు లింక్ చేస్తూ విడుదల చేసిన ప్రోమో IPL మ్యాచ్‌ల సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక పెద్ది సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
సూపర్ హిట్ చికిరి సాంగ్..
ఇక పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన “చికిరి చికిరి” సాంగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. ఎవరూ ఊహించని స్థాయిలో ట్రెండ్ అవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటలోని హుక్ స్టెప్‌ను చేస్తూ Instagramలో రీల్స్ షేర్ చేస్తున్నారు. ఈ హుక్ స్టెప్ పై అప్పుడు ఆడియన్స్ ప్రయోగాలు కూడా స్టార్ట్ అయ్యాయి. డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ స్టెప్ ను ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేస్తుంది.
పెద్ది క్లైమాక్స్ ట్విస్ట్..
ఇదిలా ఉండగా, పెద్ది సినిమా క్లైమాక్స్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఉప్పెనలో.. హీరో పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. అలాంటి ప్రయోగమే పెద్ది సినిమా కోసం బుచ్చిబాబు చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లో వినిపిస్తోన్నన్యూస్ ప్రకారం.. పెద్ది సినిమా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ పాత్రకు ఒక కాలు లేకుండా చూపించబోతున్నట్టు తెలస్తోంది. కాలు లేకుండా ఆయన గేమ్స్ లో పాల్గొని ఇండియాకు మెడల్ తెచ్చేలా క్లైమాక్స్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఇది రూమర్ మాత్రమే. దీనికి సబంధించి అఫీషియల్ గా ఎవరు అనౌన్స్ చేయలేదు. ఇందులో నిజం ఎంత అనేది కూడా తెలియదు. నఈ రూమర్లు నిజమే అయితే, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. కొత్త కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు స్వాగతం చెబుతున్న ఈ కాలంలో ఈ తరహా క్లైమాక్స్‌ను మెగా అభిమానులు అంగీకరిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
పెద్ది సినిమా రిలీజ్ డేట్.. ?
పెద్ది సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. అన్ని పనులు కంప్లీట్ చేసి.. ఈసినిమాను వచ్చే ఏడాది మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పనులు ఇప్పటికే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక నుంచి వరుసగా అప్ డేట్స్ కూడా ప్లాన్ చేసుకున్నారట టీమ్. రీసెంట్ గా జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రెహమాన్ తో జానీ మాస్ట్ ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ డిజాస్టర్స్ అవ్వడంతో.. ఆశలని ఈసినిమాపైనేపెట్టుకున్నాడు రామ్ చరణ్.

