తల్లి అయ్యాక డిప్రెషన్ కి గురయ్యాను.. చరణ్ వైఫ్ ఉపాసన కీలక వ్యాఖ్యలు!
హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కీలక కామెంట్స్ చేశారు. తల్లి అయ్యాక డిప్రెషన్ కు గురయ్యానని ఆమె బాంబు పేల్చారు. ఉపాసన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి

ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. అపోలో గ్రూప్ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ బిజినెస్ ఉమన్ గా సత్తా చాటుతుంది. కాగా ఉపాసన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తల్లి అయ్యాక డిప్రెషన్ కి గురయ్యానని ఆమె అన్నారు.
ఉపాసన-రామ్ చరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్ళై పదేళ్లు దాటినా పేరెంట్స్ కాలేదు. ఈ క్రమంలో విమర్శల పాలయ్యారు. ఉపాసనకు తల్లి అయ్యే యోగం లేదంటూ దారుణమైన విమర్శలు చేశారు. 2022 డిసెంబర్లో చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాసన గర్భం దాల్చిన విషయం బయటపెట్టారు.
2023 జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ లో ఉపాసనకు డెలివరీ అయ్యింది. కూతురికి క్లిన్ అని పేరు పెట్టారు. క్లిన్ కార జననంతో మెగా ఫ్యామిలీలో అనేక శుభాలు జరిగాయి. ఇటీవల చిరంజీవి పద్మ విభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే.
అయితే తల్లి అయ్యాక డిప్రెషన్ కి గురయ్యానని ఉపాసన చెప్పడం చర్చకు దారి తీసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన... అందరు తల్లుల మాదిరి నేను కూడా ఒత్తిడికి గురయ్యాను. అప్పుడు రామ్ చరణ్ నాకు అండగా నిలిచాడు. నాతో పాటు మా ఇంటికి వచ్చాడు. అన్నారు.
కీలక సమయంలో తనకు రామ్ చరణ్ అండగా ఉన్నాడని ఆమె చెప్పారు. ఇక ప్రణాళిక ప్రకారమే పిల్లల్ని ఆలస్యంగా కన్నానని ఉపాసన గతంలో చెప్పింది. పెళ్ళైన పదేళ్ల వరకు పిల్లలు వద్దని ముందుగానే చెప్పుకున్నామని ఉపాసన అన్నారు. ఈ క్రమంలో ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రామిస్ బ్రేక్ చేయలేదని ఆమె అన్నారు.
ఇక రెండో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉన్నానని ఉపాసన చెప్పడం కొసమెరుపు. ఈసారి మెగా వారసుడు పుట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో మూవీ ప్రకటించాడు.