పూరి జగన్ గురించి వివి వినాయిక్ ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించరు
నేను ఇప్పటి వరకూ 17 సినిమాలు చేశా. పూరి జగన్నాథ్‌లో ఉండే ధైర్యం వేరు. అది చాలా ఇష్టం. ‘సినిమా విడుదలైంది. మన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది.
Puri Jagannath, V.V Vinayak, rajamouli
ఓ టైమ్ లో దర్శకుడు వివి వినాయక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఉన్న ప్రతీ హీరో ఆయనతో చేయాలని కోరుకునేవారు. ఆయన స్టార్స్ కు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఎందుకంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలో మాస్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడీయన. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెం 150.. ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి వినాయక్ కెరీర్ లో. ఆయన సరైన స్క్రిప్టుతో వస్తే మళ్లీ సినిమా చేయటానికి రెడీ అంటారు చిరంజీవి.
Puri Jagannath, V.V Vinayak, rajamouli
ఇక ఒక టైమ్ లో రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వినాయక్. కొన్నేళ్లుగా అస్సలు సినిమాలే చేయట్లేదు. అయితేనేం ఇండస్ట్రీలో అందరికీ వినాయిక్ అంటే ఇష్టం. అలాగే వినాయక్-పూరీ జగన్నాథ్ (పూరీ జగన్) ఇద్దరూ ఆప్తమిత్రులు.
పూరీ జగన్నాథ్ అంటే వినాయిక్ కు చాలా ఇష్టం. ఆ విషయం చాలా సార్లు చెప్పారు ఆయన. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పూరీ గురించి మీ అభిప్రాయమేంటి..? ఆయనతో మీకున్న స్నేహం గురించి చెప్పండి అని వినాయక్‌ను అడగ్గా ఇంట్రస్టింగ్ విషయాలు మాట్లాడారు.
Puri Jagannath, V.V Vinayak, rajamouli
వివి వినాయిక్ మాట్లాడుతూ..తాను మళ్లీ జన్మ ఉంటే పుట్టాలని పూరి జగన్నాథ్ లా ఉందని అన్నారు. ఆ విషయమై మాట్లాడుతూ.. జగన్ లో ఉన్న ధైర్యం నాకు బాగా ఇష్టం. సినిమా రిలీజ్ అయ్యాక...అది హిట్ అయినా ఫ్లాఫ్ అయినా తనకు సంభందం లేదన్నట్లు ఉంటాడు. నేను అనుకున్నది తీసాను అంటాడు.
చాలా ఫాస్ట్ రైటింగ్, మేకింగ్ కూడా ఫాస్ట్. తనకు వచ్చిన ఫైనాన్సియల్ ట్రబుల్స్ ఆ టైమ్ లో నాకు నాకు బాగా క్లోజ్ ప్రెండ్ కాబట్టి తెలుసు. మళ్లీ దాన్ని కమ్ బ్యాక్ చేసాడు. మళ్లీ వేసి కొడితే టకటకా మళ్లీ క్లియర్ చేసి దిసీజ్ పూరి అని నుంచున్నాడు. ఆ ప్రాసెస్ లో ఎక్కడా తగ్గలేదు తను. నాకు కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లు ఉన్నాయి అని ఎప్పుడూ చెప్పడు. హి వర్క్స్, హి ఎర్న్స్, హి స్టాట్స్..అందుకే నాకు జగన్ అంటే ఇష్టం. అని చెప్పుకొచ్చారు వివి వినాయిక్.
VV Vinayak
అలాగే మరోసారి వినాయిక్ మాట్లాడుతూ..తాను ఎప్పుడైనా కాస్త ‘డల్’గా అనిపించినప్పుడు పూరిని కలవాలనిపిస్తుందని.. వినాయక్ చెప్పారు. డల్‌గా ఉన్నప్పుడు పూరీకి కాల్ చేసి.. ‘బిజీగా ఉన్నావా? పూరీ.. అని కాల్ చేస్తే.. ‘ముందు వచ్చేసేయ్’ అని తప్ప మారుమాట ఆయన నుంచి రాదని వినియాక్ చెప్పుకొచ్చారు.
"నిజంగా పూరీకి ఎలాంటి భయం.. టెన్షన్ లేకుండా చాలా బిందాస్‌గా ఉంటాడు. అంత స్వేచ్ఛగా వుండే ఆయనని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు.. మళ్లీ వచ్చే జన్మంటూ ఉంటే పూరిలా పుట్టాలనిపిస్తుంది" అని వినాయక్ ఇంటర్వ్యూలో చెప్పారు.
VV Vinayak
ఇక రాజమౌళి గురించి చెప్తూ...రాజమౌళితో తాను చాలా స్నేహంగా ఉంటామన్నారు. రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్‌తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాజమౌళి, పూరీ, తాను ముగ్గురం మంచి స్నేహితులమన్నారు. తాను రాజమౌళి ఇంటికెళితే ఆయన, జక్కన్న కుటుంబ సభ్యులు చేసే హడావుడి అంతా ఇంత కాదని.. వాళ్లలోని ఆప్యాయత అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అందరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటామని వినాయక్ చెప్పుకొచ్చారు.
VV Vinayak
మీరు చిరంజీవికి తో చేస్తానని అనుకున్నారా? అనే విషయం గురించి చెప్తూ.. ఇప్పుడు అనుకున్నది ఏదీ నేను ఊహించింది కాదు. ఏదో 25-30లక్షలు సంపాదించి.. అప్పు తీర్చేస్తే చాలు అనుకున్నా. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండవచ్చని అనుకునేవాడిని. అప్పుడు దర్శకులు రూ.30-40లక్షలు తీసుకుంటుంటే నేను ఎక్కడో ఉండేవాడిని. అయితే, డబ్బు తలకెక్కకూడదు. ఆయనతో రెండూ రీమేక్‌లే చేశా. అయితే, ఒక కథ కూడా అన్నయ్య కోసం రాశా. ‘ఠాగూర్’ కోసం రాజా రవీంద్ర వచ్చి నన్ను తీసుకెళ్లారు.
ఒకప్పుడు ‘విజేత’ విజయోత్సవ సభకు వెళ్లి చెప్పులు పోగొట్టుకున్న నేను.. ఆయన్ను నేరుగా కలవడం అదే. అప్పుడు అన్నయ్య మాట్లాడుతూ.. ‘తమిళ రమణ చూశారా. అది నాకు ఎలా ఉంటుంది’అని అడిగారు. ‘మీకు చాలా బాగుంటుంది సర్. అయితే, చివరిలో హీరో చనిపోకూడదు. కొన్ని సీన్లు మార్చాలి’ అని చెప్పా. అప్పుడు ఆయన సీఎం అయితే ఎలా ఉంటుంది? అని చర్చించి అలా కూడా కథ అనుకున్నాం. రెండు మూడు షెడ్యూల్స్ అయిన తర్వాత క్లోజ్ అయ్యారు. రషెస్ చూసి చాలా మెచ్చుకున్నారు. నా జీవితంలో మర్చిపోలేని సినిమా. రీమేక్ అయినా, సొంత కథ అయినా, కష్టపడాల్సిందే. అదే కష్టం.రమణ చూస్తే అందులో చిరంజీవిగారిని ఊహించలేరు. ఆయనకు సరిపోయేలా సినిమాను మార్చాం.