- Home
- Entertainment
- ‘మేజర్’ సినిమాను వారికి చూపించాను.. వారు ఇచ్చిన మెడల్ ఆస్కార్ కంటే విలువైనది : అడివి శేష్
‘మేజర్’ సినిమాను వారికి చూపించాను.. వారు ఇచ్చిన మెడల్ ఆస్కార్ కంటే విలువైనది : అడివి శేష్
టాలెంటెడ్ హీరో అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ కాంబినేషనల్ వచ్చిన చిత్రం ‘మేజర్’. ఈ మూవీని ఇటీవల స్పెషల్ షోలలో భాగంగా కామాండోస్ కోసం ప్రదర్శించారు. అయితే వారు అందించిన మెడల్ గురించి శేష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం `మేజర్` (Major). శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రమిది. సాయీ మంజ్రేఖర్ (Saiee Manjrekar), శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు.
2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించగా.. ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బాస్టర్ టాన్ ను కూడా సొంతం చేసుకుంది.
అయితే ఈ చిత్రం రిలీజ్ ను మేకర్స్ చాలా వినూత్నంగా చేస్తున్నారు. ఇప్పటికే అభిమానుల కోసం మే 24 నుంచి 29 వరకు స్పెషల్ షోలను ప్రదర్శించారు. తాజాగా మేజర్ సందీప్ తల్లిదండ్రుల కోసం కూడా స్పెషల్ గా షో వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమా బాగా ఉందని, కంటతడి పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే, మేజర్ సందీప్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా కావడంతో.. ఇటీవల ముంబైలోని 312 మంది కమాండోలు, వారి కుటుంబ సభ్యుల కోసం కూడా స్పెషల్ షోను ప్రదర్శించారు. వారి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కమాండోస్ కు తనతో ఎలా రెస్పాండ్ అయ్యారో అడివి శేష్ తాజాగా తెలిపారు.
అడివి శేష్ మాట్లాడుతూ, ‘ముంబయిలోని నేషనల్ సెక్యూరిటీ గార్ట్స్ కి సినిమాను చూపించాం. అక్కడ 312 మంది కమాండోలు మరియు వారి కుటుంబ సభ్యులు సినిమాను చూశారు. సినిమా ముగియగానే నిశ్శబ్ధంగా ఉండిపోయారు. తమ హెడ్‌క్వార్టర్స్‌కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే వారు బ్లాక్ క్యాట్ కమాండోస్ తరపున మెడల్ తో సత్కరించారు. అది నాకు ఆస్కార్ అవార్డు కంటే విలువనైది’ అని పేర్కొన్నాడు.
‘మేజర్’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ప్రత్యేక ప్రదర్శనల ద్వారా మరింత రీచ్ ను సంపాదించుకున్నారు. అడివి శేష్ అద్భుతమైన నటన, శశి కిరణ్ దర్శకత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. థియేటర్లలో సినిమా చూసిన ఆడియెన్స్ కూడా భావోద్వేగానికి లోనవుతున్నారంటే సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.