MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు.. సమంత మనోగతం బహిర్గతం..

నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు.. సమంత మనోగతం బహిర్గతం..

నాగచైతన్య, సమంత ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా నాలుగేండ్లకి విడిపోయారు. అయితే ఎందుకు విడిపోయారనేది మాత్రం పెద్ద సస్పెన్స్. సోషల్‌ మీడియాలో ఎవరికి వాళ్లు కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు నిజాలు బయటకొస్తున్నాయి?..

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 17 2023, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత, నాగచైతన్య దాదాపు ఐదారేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్ద అంగీకారంతోనే వీరిద్దరి పెళ్లి జరిగింది. అటు సమంత సంప్రాదాయల(క్రిస్టియన్‌), ఇటు నాగార్జున ఫ్యామిలీ(హిందూ) సంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరి పెళ్లికి అప్పట్లో పది కోట్లు ఖర్చు అయ్యిందనే ప్రచారం ఉంది. అంతేకాదు ఆ సమయంలో మన టాలీవుడ్‌లో అంతటి గ్రాండ్‌గా మ్యారేజ్‌ జరిగింది కూడా వీరిదే అనే టాక్‌ ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే నాలుగేండ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఈ ఇద్దరు. బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది ఆదర్శ జంటగానూ అభివర్ణించారు. డీసెంట్‌గా వీరి వైవాహిక జీవితం సాగింది. అయితే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేసింది. ఈ విషయంలో చైతూ నుంచి ఫుల్‌ సపోర్ట్ ఉందనే టాక్‌ వినిపించింది. ఇద్దరు కలిసి `మజిలి` చిత్రంలోనూ నటించారు. పెళ్లైన జంట కావడంతో ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది. అదే సినిమాకి పెద్ద అసెట్‌ అయ్యింది. 
 

36

కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైతూ, సామ్‌ విడిపోతున్నట్టుగా, ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా ప్రచారం ఊపందుకుంది. దీనిపై సమంత కూడా స్పందించి ఖండించారు. కానీ అనుకున్నదే జరిగింది. ఈ ఇద్దరు 2021లో అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు, సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చారు. స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకే నోట్‌ని ఇద్దరూ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థాలకు పిల్లలు కనడం, ఎక్స్ పోజింగ్‌, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని, పైగా `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడం కూడా నాగ్‌ ఫ్యామిలీకి నచ్చలేదని, అదే వివాదానికి దారి తీసి విడాకుల వరకు వెళ్లిందనే రూమర్స్ వినిపించాయి. 
 

46

కానీ నిజం ఏంటనేది మాత్రం వారిద్దరికి మాత్రమే తెలుసు. దీనిపై ఎవరూ ఇప్పటి వరకు ఓపెన్‌ కాలేదు. విడిపోయాక తమ జీవితం గురించి, తాను ఫేస్‌ చేస్తున్న స్ట్రగుల్స్ గురించి అడపాదడపా సమంత ఓపెన్‌ అవుతూ వస్తోంది. ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అనారోగ్యానికి గురై దాన్నుంచి కోలుకుంది. చావుతో పోరాడి గెలిచింది. జీవితంలోనూ ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే అని చెప్పొచ్చు. అయితే తాజాగా సమంత, చైతూ విడిపోవడానికి సంబంధించి అసలు మ్యాటర్‌ లీక్‌ అయ్యింది. ఓవర్సీస్‌ క్రిటిక్‌గా చెలామణి అవుతున్న ఉమైర్‌ సంధు ఓ ట్వీట్‌తో దుమారం రేపుతున్నాడు. 

56

ఇటీవలే ఓ పోస్ట్ తో సంచలనం క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు సమంత మనోగతం ఇదే అంటూ ట్వీట్‌ చేశాడు. ఇందులో ఆయన చెబుతూ, నాగచైతన్య, ఆయన కుటుంబ సాంప్రదాయ వాదులు. నేను వీరితో ఉండటం ఓ పంజరంలో బంధించినట్టుగా భావించాను. బోల్డ్ సినిమాలు చేయోద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, నైట్‌ పార్టీలకు వెళ్లొద్దు, ఐటెమ్‌ నెంబర్లు చేయోద్దు.. వంటి కండీషన్లతో బతకాల్సి వచ్చింది. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం` అని సమంత భావిస్తున్నట్టు, ఆమె చెబుతున్నట్టుగా ఉమైర్‌ సంధు పోస్ట్ చేశాడు. ఇది ఇంటర్నెట్‌లో దుమారం రేపుతూ వైరల్‌ అవుతుంది. వీటి కారణంగానే సమంత.. చైతూ నుంచి విడిపోయిందనే అర్థంలో ఆయన ఈ పోస్ట్ చేశౠడు. 

66

అయితే ఉమైర్‌ సంధు ఇటీవల వరుసగా ఇలాంటి వివాదాస్పద పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు. సినిమా స్టార్లే టార్గెట్‌గా వారి పర్సనల్‌ విషయాలను చెబుతూ సంచలనంగా మారుతున్నాడు. సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. స్టార్‌ హీరో, హీరోయిన్లకి పరువు తీసి తాను ఫేమస్‌ కావాలనుకుంటున్నాడు. కానీ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆయన్ని ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. తప్పుడు వార్తలను, ఫేక్‌ ప్రచారం చేస్తున్నాడని అరోపిస్తున్నారు అభిమానులు. ఆయన్ని బ్యాన్‌ చేయాలని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడీ క్రిటిక్‌ సోషల్‌ మీడియాలో స్టార్ల పరువు తీస్తూ పాపులర్‌గా మారుతున్నాడు ఉమైర్ సంధు.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో
Recommended image2
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Recommended image3
Ram Charan: 70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved