MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Ram Charan: 70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే?

Ram Charan: 70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే?

70 ఏళ్ల వయసులో కూడ చిరంజీవి ఇంత ఫిట్ గా ఎలా ఉన్నాడు. ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ మెగాస్టార్ గురించి చరణ్ ఏం చెప్పాడంటే?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2026, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రిపబ్లిక్ సమ్మిట్ లో రామ్ చరణ్   ఉపాసన
Image Credit : Asianet News

రిపబ్లిక్ సమ్మిట్ లో రామ్ చరణ్ - ఉపాసన

రీసెంట్ గా పెద్ది సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆమధ్యే రిపబ్లిక్ సమ్మిట్ 2026లో తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం, అలాగే చిన్ననాటి అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి చిరంజీవి క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న చిరంజీవి ఇప్పటికీ అంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటో కూడా చరణ్ వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన చరణ్
Image Credit : Asianet News

70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన చరణ్

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, "మా నాన్నగారికి ఇప్పుడు 70 ఏళ్లు. ఆయన ఉదయం 5:30 గంటలకు నిద్రలేస్తారు. కాఫీ తాగి, ఉదయం 6 గంటలకల్లా జిమ్‌లో ఉంటారు. నన్ను కూడా జిమ్‌కు రమ్మని తరచూ పిలుస్తుంటారు. ఆయన తన వర్కౌట్‌ను, తన ఆరోగ్యాన్ని, తనను తాను అందంగా చూసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు" అని చెప్పారు.

35
రామ్ చరణ్ కు అసలు విషయం వెల్లడించిన మెగాస్టార్...
Image Credit : Asianet News

రామ్ చరణ్ కు అసలు విషయం వెల్లడించిన మెగాస్టార్...

చరణ్ మాట్లాడుతూ.. "నేను ఒక సారి నాన్నను అడిగాను మీరు ఇంకా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యాను. "రామ్, నేను కేవలం సినిమాల కోసం ఇది చేయడం లేదు. నా మెదడు చురుకుగా ఉండటానికి, మీ అందరి కోసం, నా మనవళ్లు, మనవరాళ్ల కోసం ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నా ను"  అని చిరంజీవి చెప్పినట్లు రామ్ చరణ్ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని కూడా చరణ్ వెల్లడించారు.

45
చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్న చరణ్..
Image Credit : Asianet News

చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్న చరణ్..

చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ రామ్ చరణ్ మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇంటికి వచ్చే దర్శకులు, నిర్మాతలు 'ఒకరోజు నువ్వు కూడా మీ నాన్నగారి అడుగుజాడల్లో నడవాలి' అని చెప్పేవారు. అలా చిన్న వయసులోనే నా భుజాలపై పెద్ద బాధ్యతను ఉంచేవారు. అయితే నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు" అని తెలిపారు.

55
స్టార్ డమ్ హీట్ ఇంటి వరకూ వచ్చేది కాదు..
Image Credit : X

స్టార్ డమ్ హీట్ ఇంటి వరకూ వచ్చేది కాదు..

అంతేకాకుండా, చిరంజీవి స్టార్‌డమ్ ప్రభావాన్ని ఇంటి వాతావరణంలోకి రానివ్వలేదని రామ్ చరణ్ వెల్లడించారు. "మా నాన్న మాతో చాలా సమయం గడిపేవారు. సినిమా సంభాషణలు కానీ, పరిశ్రమకు సంబంధించిన చర్చలు కానీ మా డైనింగ్ టేబుల్ దగ్గరకు లేదా లివింగ్ రూమ్‌లోకి వచ్చేవి కావు. వాటన్నింటినీ ఆయన ఆఫీస్‌కే పరిమితం చేసేవారు. స్టార్‌డమ్ వేడిని మేము ఎప్పుడూ అనుభవించలేదు. ఆయన మమ్మల్ని చాలా సాధారణంగా పెంచారు" అని మెగా పవర్ స్టార్ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?
Recommended image2
Megastar: మా నాన్న ఆ రోజు ఇచ్చిన వార్నింగ్‌ విలువేంటో తెలిసొచ్చింది.. గూండా సినిమా టైమ్‌లో సంఘటన బయటపెట్టిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved