- Home
- Entertainment
- తోడు కోరుకుంటున్న `జబర్దస్త్` రష్మి.. ఒంటరిగా ఉన్నా, బోర్ కొడుతుందంటూ పోస్ట్.. నెట్టింట నానా రచ్చ
తోడు కోరుకుంటున్న `జబర్దస్త్` రష్మి.. ఒంటరిగా ఉన్నా, బోర్ కొడుతుందంటూ పోస్ట్.. నెట్టింట నానా రచ్చ
రష్మి గౌతమ్ యాంకర్‌గా తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది. గ్లామర్ పోజులతో నెట్టింట రచ్చ లేపుతుంది. మరోవైపు మొన్నటి వరకు సుడిగాలి సుధీర్‌తో కలిసి బుల్లితెరపై హంగామా చేసింది. ఇప్పుడు ఒంటరయ్యింది.

`జబర్దస్త్` యాంకర్ రష్మి కామెడీ షోతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇందులో సుడిగాలి సుధీర్‌తో పులిహోర కలుపుతూ, కెమిస్ట్రీ పండిస్తూ, అప్పుడప్పుడు రొమాన్స్ తో రెచ్చిపోతూ, గాఢ ప్రేమని పంచుకుంటూ మరింత రచ్చ చేస్తుంటుంది. తరచూ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటుంది.
అయితే గత కొన్ని రోజులుగా ఒంటరైపోయింది రష్మి. ఆమె బుల్లితెరపై ఫ్రెండ్‌గా, లవర్‌గా కలరింగ్ ఇస్తూ వస్తోన్న సుడిగాలి సుధీర్ కావడంతో ఒంటరైపోయింది. సుధీర్ `జబర్దస్త్`ని, `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో వాటికి యాంకరింగ్ బాధ్యత తనే చూసుకుంటుంది. `జబర్దస్త్`కి కొత్త యాంకర్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవీ డ్రామా కంపెనీ`లకు యాంకరింగ్ చేస్తుంది. కానీ సుధీర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నెటిజన్లు కూడా అదే ఫీల్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రష్మి పెట్టిన ఇన్ స్టా స్టోరీ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఫిష్‌స్టోరీని పంచుకుంది రష్మి. ఇందులో `నేను నీతో స్నేహం చేయోచ్చా, నేను ఒంటరిగా, బోరింగ్‌గా ఫీలవుతున్నాను. నువ్వు నాకు ఏకైక స్నేహితుడివి` అని అర్థంతో ఈ ఫిష్ స్టోరీ ఉంది. ఇది నెట్టింట రచ్చ లేపుతుంది. రష్మి తనలోని ఫీలింగ్‌ని ఈ స్టోరీ రూపంలో పంచుకుందని అంటున్నారు నెటిజన్లు.
Rashmi Gautam
జనరల్‌గా సెలబ్రిటీలు తమలోని భావాలను ఇలాంటి పోస్ట్ ల రూపంలో వ్యక్తం చేస్తుంటారు. రష్మి కూడా ఇప్పుడు అదే చేసిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నారు. రష్మి తోడు కోరుకుంటుందని, ఒంటరిగా ఉండలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ఇన్నాళ్లు కలిసి ఉండి, ఇప్పుడు ఒంటరైతే ఇలానే ఉంటుందంటున్నారు.
Rashmi Gautam
అయితే రష్మి పోస్ట్ సుడిగాలి సుధీర్‌ని ఉద్దేశించే అని, ఆయన దూరం కావడం వల్లే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. అదే సమయంలో ఇది సుధీర్ కోసమా? లేక పెళ్లి కోసమా? జీవితంలో తోడు కోరుకుంటుందా? అనే మరో సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రష్మి పోస్ట్ అనేక అర్థాలకు, పరమార్థాలకు తావిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ వైరల్ అవుతుంది. మరి ఇందులో రష్మి ఉద్దేశ్యం ఏంటనేది ఆమెకే తెలియాలి.
రష్మి ప్రస్తుతం రెండు టీవీ షోస్‌తో బిజీగా ఉంది. మరోవైపు ఇటీవల `బొమ్మ బ్లాక్‌బస్టర్` చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా కూడా చేయబోతుందని సమాచారం. `గాలోడు` డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.