- Home
- Entertainment
- సింగర్ ప్రవస్తికి బెదిరింపులు.. వాళ్లతో లింక్ చేస్తున్నారంటూ లేడీ సింగర్ ఆవేదన
సింగర్ ప్రవస్తికి బెదిరింపులు.. వాళ్లతో లింక్ చేస్తున్నారంటూ లేడీ సింగర్ ఆవేదన
Pravasthi Aradhya: `పాడుతా తీయగా` పాటల ప్రోగ్రామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా ఎంతో గొప్ప ప్రోగ్రామ్‌గా దీనికి పేరున్న నేపథ్యంలో జడ్జ్ ల తీరు ఇప్పుడు వివాదంగా మారింది. జడ్జ్ లు ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సింగర్ సునీత తనకు అన్యాయం చేశారని లేడీ సింగర్ ప్రవస్తి ఆరోపించారు. ఆమె విడుదల చేసిన వీడియో పెద్ద దుమారం రేపింది. సింగర్ సునీతపై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
singer pravasthi aradhya
Pravasthi Aradhya: తనని ఎలిమినేట్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేశారని తెలిపింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలతో ఆమె మాట్లాడింది. అందులో భాగంగా మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది ప్రవస్తి. సోషల్ మీడియాలో తనని కొందరు బెదిరిస్తున్నారని, తనకు సపోర్ట్ చేసిన సింగర్స్ తో సంబంధాలను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏబీఎన్ టీవీలో మాట్లాడుతూ ప్రవస్తి ఈ విషయాలను వెల్లడించింది.
singer pravasthi aradhya (Rtv)
ఇన్ స్టాగ్రామ్‌లో తనని బెదిరిస్తున్నట్టు తెలిపింది. కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి ఈ బెదిరింపులు కామెంట్స్ వస్తున్నట్టు తెలిపింది. వాళ్లని ఏసేస్తాం, మిమ్మల్నీ వేసేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారట. అయితే కొందరు కంటెస్టెంట్ల నుంచే ఈ కామెంట్స్ వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేసింది ప్రవస్తి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కామెంట్లు పెడుతున్నట్టుగా తెలిపింది.
singer pravasthi aradhya
ఇదిలా ఉంటే సింగర్ ప్రవస్తి `పాడుతా తీయగా` షో నుంచి ఎలిమినేట్ చేయడంపై సోమవారం సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనని కావాలని ఎలిమినేట్ చేసినట్టు వెల్లడించింది. సింగర్ సునీత తనని బాడీ షేమింగ్ కామెంట్లు చేసిందని వెల్లడించింది.
మైక్‌లో కీరవాణితో తన గురించి బ్యాడ్‌గా చెప్పిందని,ఈ అమ్మాయిది హై రేంజ్ వాయిసే కాదు, హై రేంజ్ పిచ్ రాదు, ఏదో మ్యానేజ్ చేస్తుంది చూడండి, ఈ సాంగ్‌లో తెలుస్తుంది చూడండి` అంటూ మాట్లాడుకోవడం తాను విన్నట్టు తెలిపింది. ఆ మాటలకు బాధకలిగిందని, అయినా ధైర్యం తెచ్చుకుని పాడినట్టు తెలిపింది ప్రవస్తి.
singer pravasthi aradhya
తన పాట పాడే సమయంలో క్లాసికల్ సాంగ్‌కి సంబంధించి మృధంగం వాయించే అతను వచ్చాడు. ఆయన మృధంగం మర్చిపోయాడు. కానీ నేను క్లిక్ మీద పాడుకుంటూ వెళ్లిపోయా. ఆ విషయం అందరికి తెలుసు, అయినా నన్ను పాయింట్ ఔట్ చేశారు. మైక్‌లో క్లీయర్‌గా చెప్పాను అని, అయినా వినలేదని తెలిపింది ప్రవస్తి.
పాడుతా తీయగా షోకి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని బయటపెడుతూ సంచలనంగా మారింది ప్రవస్తి. అదే సమయంలో ఈ ఘటన తర్వాత ఇక తన కెరీరే వదులుకున్నట్టు తెలిపింది. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి పాడుతా తీయగా షో ఎలా మారిపోయిందో బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నప్పుడు బాగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని వెల్లడించింది ప్రవస్తి. ఆమె కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి.
Padutha Theeyaga
ఇదిలా ఉంటే సింగర్ ప్రవస్తి ఆరాధ్యకి జరిగిన అన్యాయంపై నెటిజన్లు, సంగీత ప్రియులు స్పందిస్తున్నారు. సింగర్ సునీతని ట్రోల్ చేస్తున్నారు. ఈ అందమైన సింగర్ తన కూతురు వయసు ఉన్న అమ్మాయికి ఇలా అన్యాయం చేస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తన అభిప్రాయమే కాకుండా, ఇతర జడ్జ్ లను కూడా ప్రభావితం చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అందమైన సింగర్ మనసులో ఇంతటి ద్వేషం ఉందా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. వారినే కాదు, కీరవాణిపై కూడా విమర్శలు చేస్తున్నారు.
read more: మహేష్ బాబుకి ఈడీ షాక్.. నోటీసులు జారీ ?